సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యానికి మూల స్తంభం పారదర్శక ఎన్నికలు అని, ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు జరుగకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు కావడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతోనే పోటీ చేసిందని, ఖమ్మంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్ అవకతవకల్లో విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కేసీఆర్ ప్రభుత్వ వైఖరే కారణమని మండిపడ్డారు.
కాగా తెలంగాణ పీసీసీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, రేణుకా చౌదరి, నిరంజన్..శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల తర్వాత భారీ ఎత్తున ఓటింగ్ నమోదు కావడంపై ఫిర్యాదు చేశారు. నిజామాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌లలో ఐదు గంటల తర్వాత లక్షల ఓట్లు పోలింగ్ కావడంపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. చేవెళ్లలో విచిత్రంగా మైనస్ ఐదు శాతం ఓట్లు నమోదయ్యాయి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలి. 5 గంటల తర్వాత క్యూలో ఉన్న ఎంతమందికి కాల్‌చిట్టీలు ఇచ్చారనే రికార్డులు బయట పెట్టాలి’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment