Renuka Chowdhary
-
పువ్వాడ అజయ్ పై రేణుక చౌదరి దారుణ వ్యాఖ్యలు
-
మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ రేణుకా చౌదరి మధ్య మాటల యుద్ధం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సాయం చేయలేనివారు, ఇరవై ఏళ్ల పాటు పదవులు అనుభవించి స్వలాభం చూసుకున్నవారు.. ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్న తన ను విమర్శించడం గర్హనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రూ.1.81 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 181 మంది లబ్ధిదారులకు సోమవా రం ఇక్కడ మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఓ నాయకురాలు పార్టీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి గోల్మాల్ చేసి ఓ గిరిజన డాక్టర్ బతుకును ఆగం చేసి, రోడ్డుమీద పడే పరిస్థితి తీసుకొచ్చారని కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలను తుక్కు కింద లెక్కకట్టాలని రవాణా శాఖలో ఓ చట్టం ఉందని, అలాగే రాజకీయాల్లో కూడా స్క్రాప్ పాలసీ తీసుకురావాలని అన్నారు. ఖమ్మం జిల్లా, నగరాభివృద్ధికి చేసిందేమీ లేకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు డ్రామాలు చేస్తూ, గాజులేసుకుని.. పెద్ద కళ్లజోళ్లు పెట్టుకుని డ్యాన్స్ వేసుకుంటూ ప్రదర్శనలు చేస్తారని ఎద్దేవా చేశారు. చదవండి: Harish Rao: లంచం అడిగిన వైద్యుడు.. మంత్రి రియాక్షన్ ఇది -
ఖమ్మంలో నా గెలుపు ఖాయం : రేణుకా చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యానికి మూల స్తంభం పారదర్శక ఎన్నికలు అని, ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు జరుగకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు కావడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతోనే పోటీ చేసిందని, ఖమ్మంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్ అవకతవకల్లో విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కేసీఆర్ ప్రభుత్వ వైఖరే కారణమని మండిపడ్డారు. కాగా తెలంగాణ పీసీసీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, రేణుకా చౌదరి, నిరంజన్..శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల తర్వాత భారీ ఎత్తున ఓటింగ్ నమోదు కావడంపై ఫిర్యాదు చేశారు. నిజామాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌లలో ఐదు గంటల తర్వాత లక్షల ఓట్లు పోలింగ్ కావడంపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. చేవెళ్లలో విచిత్రంగా మైనస్ ఐదు శాతం ఓట్లు నమోదయ్యాయి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలి. 5 గంటల తర్వాత క్యూలో ఉన్న ఎంతమందికి కాల్‌చిట్టీలు ఇచ్చారనే రికార్డులు బయట పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. -
దొంగ ఓట్లు వేయించారు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం నగరంలోని సిద్ధారెడ్డి కళాశాల పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయించారని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఆరోపించారు. గురువారం పోలింగ్ జరుగుతున్న తరుణంలో కొద్ది మంది దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారం అందటంతో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించానని తెలిపారు. అనంతరం ఆమె పోలింగ్ సరళిని తెలుసుకొని అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో పసి పిల్లలతో వచ్చిన వాళ్లను, వృద్ధులను పోలింగ్ కేంద్రంలోకి పంపించాలన్నారు. ఈ క్రమంలోనే సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించగా.. దొంగ ఓట్లు వేస్తున్నారని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
కాంగ్రెస్ పేదల పక్షపాతి
సాక్షి, ఖమ్మం: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడేది కాంగ్రెస్ పార్టీయేనని ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని విలీన గ్రామాల పరిధిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. పాండురంగాపురం, బల్లేపల్లి, జయనగర్‌కాలనీ, గోపాలపురం, రుద్రమకోట, పుట్టకోట, అల్లీపురం, కొత్తగూడెం, ధంసలాపురం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ పేదల పక్షపాతి అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌లు ఇచ్చిన హామీలను విస్మరించి పాలన సాగించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని అప హాస్యం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తురన్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. చాయ్‌వాలాగా మోదీ ప్రధానమంత్రి అయి కార్పొరేట్ శక్తులకు మాత్రం చౌకీదారుగా పని చేస్తున్నారన్నారు. నల్లధానాన్ని వెలికితీస్తానని చెప్పి అప్పులు ఎగ్గొట్టిన బడా పారిశ్రామిక వేత్తలకు అండగా నిలిచారన్నారు. గతంలో ఎంపీగా, మంత్రిగా పని చేసిన సమయంలో జిల్లాలో అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనతోపాటు తమ పార్టీ నాయకుల ఇళ్లల్లో సోదాల పేరుతో భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. హస్తం గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రచారంలో పార్టీ రాష్ట్ర పరిశీలకులు మర్రి శశిధర్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ సంభాని చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మల్లీదు హైమావతి, కార్పొరేటర్ నాగండ్ల దీపక్‌చౌదరి, బాలగంగాధర్ తిలక్, వడ్డెబోయిన నరసింహారావు, మల్లీదు వెంకటేశ్వర్లు, భూక్యా భాషా, కోటేరు వెంకటరెడ్డి, తమ్మిన్ని నాగేశ్వరరావు, కోటేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పోట్ల లేదా రేణుకా చౌదరి!
సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం లోక్‌సభ బరి నుంచి కమ్మ సామాజిక వర్గ నేతకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ నాయకత్వం ప్రతిపాదన కూడా ఇదేనని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం నియోజకవర్గాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పోటీ చేస్తారని ప్రచారం సాగినా.. ఖమ్మం కాంగ్రెస్‌లోని ఓ వర్గం వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆమె బుధవారం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియాను కలిసి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులను వివరించారు. అయితే గతంలో సుదీర్ఘ కాలం టీడీపీలో ఉండి టీఆర్ఎస్లో చేరి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పేరును కూడా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలించింది. ఖమ్మం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని నిలబెట్టడం కలిసొస్తుందని పీసీసీ పెద్దలు నివేదించినట్లు తెలుస్తోంది. అయితే రేణుకా చౌదరికి ఢిల్లీ పలుకుబడి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి కాకుండా ఇతర సామాజికవర్గ నేతలకు టికెట్ ఇవ్వాలంటే ఎన్నికల ఖర్చు భరించే స్తోమత ఉన్న నాయకుడికి కేటాయించే అవకాశం ఉంది. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరతారా..? వైఎస్సార్సీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కని పరిస్థితుల్లో ఆయన తమ పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. కానీ పొంగులేటి మాత్రం టీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీ మారే ప్రసక్తే లేదని తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ఆర్థికంగా బలవంతుడైన మరో నేత టికెట్ ఆశిస్తున్నప్పటికీ.. ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. -
‘కారు పార్టీ బేకారు పార్టీ’
సాక్షి, ఖమ్మం : నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటిలోనూ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలనే కూటమిగా ఏర్పడినట్లు ఆమె తెలిపారు. శనివారం ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాలను సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కారు పార్టీ బేకారు పార్టీ అని ఆమె ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఘోరంగా మోసం చేసిందని ఆమె మండిపడ్డారు. గ్రామాల్లో విద్యార్థులు డబుల్ పీజీలు చేసి నిరుద్యోగులుగా మిగిలిపోయారని ఆమె అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో నరే్ంద్ర మోదీలు వట్టి మాటాలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. మహాకూటమి కేవలం రాష్ట్రంలోనే కాక.. కేంద్రలోనూ కూడా ప్రభుత్వాలు ఏర్పడే వరకే కొనసాగుతుందని వెల్లడించారు. మహాకూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖమ్మంలో పర్యటిస్తారని రేణుకా ప్రకటించారు. ఈ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని ఆమె తెలిపారు. తమ విజయాన్ని కాంక్షిస్తూ తమకు పూర్తిగా సహకరిస్తున్న రేణుకా చౌదరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఖమ్మం ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసింది శూన్యమని .. రానున్న ఎన్నికల్లో ప్రజాకూటమిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం ఇక్కడిదో ఆగదని.. ఢిల్లీ గడ్డ మీద కూడా కూటమిదే విజయం అని పేర్కొన్నారు. కాగా ఖమ్మంలో టీఆర్ఎస్, టీడీపీ మధ్య పోరు రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ నుంచి తాజీ మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పోటీలో ఉండగా.. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మహాకూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజకీయంగా ఇద్దరూ హేమాహేమీలు కావడంతో పోటీ ఉత్కంఠంగా మారింది. గతంలో శత్రువులుగా మెలిగిన నామా, రేణుక ఇప్పుడు కలిసి ప్రచారంలో చేయడంతో పోటీ ఆసక్తిగా మారింది. -
ఆంటోనీతో భేటీ అయిన ఖమ్మం కాంగ్రెస్ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సీట్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్ బుధ వారం ఢిల్లీలో పార్టీ కోర్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీని కలిశారు. జిల్లాలో మెజారిటీ సీట్లను పొత్తులో భాగంగా టీడీపీ, సీపీఐలకే కేటాయిం చారని, ఇతర నియోజకవర్గాల్లో ఎంతో కాలంగా కాంగ్రెస్‌కు సేవచేస్తున్న వారిని విస్మరించారని తెలిపారు. దీనిపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, సీట్ల కేటాయింపులో అధిష్టానంతో తేల్చుకోవాలని కోరుతున్నారన్నారు. సమస్యను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరిస్తానని, అప్పటివరకు వేచిచూడమని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ పార్లమెం టు నియోజకవర్గం పరిధిలో బీసీలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిరాహార దీక్షకు దిగారు. షాద్‌నగర్ నుంచి కడియంపల్లి శ్రీనివాస్, మక్తల్ నుంచి వాకటి శ్రీహరి, దేవర కద్ర నుంచి ప్రదీప్‌గౌడ్‌లు దీక్షలో పాల్గొన్నారు. -
తొలి జాబితా నిరాశ పరిచింది: రేణుకా చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితా అందరినీ తీవ్రం గా నిరాశపరిచిందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన యువతను విస్మరించారని, అభ్యర్థుల ఎం పికలో కొన్ని అవకతవకలు జరిగినట్టు అనిపిస్తోందన్నారు. ఈ విషయంపై తన పరిధిలో ఉన్నంత వరకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఖమ్మం జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి ఇచ్చామని చెప్పడం సరికాదని, కాంగ్రెస్ తరఫున ఆ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘18న ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తా’ సాక్షి, న్యూఢిల్లీ: స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 18న ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ నుంచి ఆ సీటు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి విజయరామారావు ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తే నియోజకవర్గంతో సంబంధం లేని వారికి టికెట్ కేటాయించినందుకు కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేని ఇందిరకు టికెట్ ఇవ్వడం శోచనీయమని, ఆమె ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. -
‘శ్వేతపత్రం విడుదల చేయండి’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలును కేంద్రం ఇటీవల ఒక లేఖలో వివరించిందని, తెలంగాణకు ఇచ్చిన హామీల పురోగతిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బయ్యా రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ నివేదిక ఎందుకు ఇవ్వలేదని పొంగులేటి ప్రశ్నించారు. -
నా స్థానాన్ని త్యాగం చేస్తా: రేణుకాచౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండ గా ఉండి ఎంతో శ్రమిం చిన వారికి న్యాయం చేసేందుకు అవసరమైతే తన స్థానాన్ని త్యాగం చేస్తానని మాజీ ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. గురువారం ఆమె ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీని భుజాల మీద మోసిన వారికి న్యాయం జరగడం ముఖ్యమని, దానికి సీనియర్లు త్యాగం చేయాల్సిన అవసరం ఉందని కమిటీకి నివేదించినట్లు తెలిపారు. తాను త్యాగాలకు సిద్ధంగా ఉన్నానని, పార్టీ గెలుపు కోసం శ్రమిస్తానని చెప్పారు. -
లోక్‌సభ నుంచి శాసనసభకు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సీట్లకు ఫుల్లు గిరాకీ ఏర్పడింది. గత ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసిన చాలా మంది నేతలు ఈసారి అసెంబ్లీ సీట్లపై కన్నేశారు. ఈసారి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాసనసభకు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యోచిస్తున్నారు. ఈ ఆలోచనతోనే తమ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలపై గురిపెట్టి అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీకి పోటీ చేసి ఓడినా మళ్లీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లోక్‌సభ బరిలో ఉండవచ్చనే ఆశతో ఆయా నేతలు ఇప్పుడు శాసన సభ సీట్లపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. చూద్దాం... ఓసారి... అయితే, గత ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది నేతలు అసెంబ్లీ సీట్లపై దృష్టి సారించారు. వీరిలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నుంచి బరిలోకి దిగిన సర్వే సత్యనారాయణ ముందున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి అంశం తెరపైకి వచ్చిన పక్షంలో తాను అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కంటోన్మెంట్ (ఎస్సీ) సీటు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ సీటును తొలుత సర్వే అల్లుడు క్రిశాంక్‌కు కేటాయించి చివరి క్షణంలో మార్పు చేశారు. ఈ సారి కూడా క్రిశాంక్ పేరే ఇప్పటివరకు వినిపించినా.. తాజాగా సర్వే పేరు బలంగా తెరపైకి వస్తుండటం గమనార్హం. నల్లగొండ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరైన రాజగోపాల్‌రెడ్డి కూడా మునుగోడు అసెంబ్లీ స్థానంపై పట్టుపడుతున్నారు. గత ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభకు పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇదే కోవలోకరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. అయితే, తాను లోక్‌సభకే పోటీచేస్తానని అంటున్నా.. అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలుత వేములవాడ నుంచి బరిలో ఉంటారని భావించినా.. అక్కడి నుంచి ఆది శ్రీనివాస్, కొనగాల మహేశ్ సీటు కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. మహేశ్ రాష్ట్రస్థాయితో పాటు తనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలతో సీటు తనకే వచ్చేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, అసెంబ్లీ బరిలో దిగాల్చి వచ్చినా వేములవాడ నుంచి పోటీ చేయనని పొన్నం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనివార్యమైతే కరీంనగర్ అసెంబ్లీ నుంచి బరిలో ఉండవచ్చని సమాచారం. గత ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కూడా రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈయనకు ఈ సీటు దాదాపు ఖరారయిందనే ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సెటిలర్ల దగ్గరా.. ఖమ్మం ఖిల్లా మీదా.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పేరు కూడా అసెంబ్లీ జాబితాలోకి వచ్చి చేరింది. సెటిలర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లోని ఏదో ఒక నియోజకవర్గంలో ఆమెను నిలబెట్టాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు ఖమ్మం అసెంబ్లీ బరి నుంచి కూడా ఆమె రంగంలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జహీరాబాద్ లోక్‌సభ నుంచి బరిలో ఉన్న సురేశ్‌షెట్కార్ ఈసారి నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ మహబూబాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. వీరితో పాటు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన మరో ముగ్గురు, నలుగురు నేతలు కూడా అసెంబ్లీ స్థానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడం గమనార్హం. -
ఖమ్మం కాంగ్రెస్‌లో కుమ్ములాట!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో నాలుగు స్తంభాలాట నడుస్తోంది. జిల్లా నుంచి పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ల మధ్య సమన్వయం కుదరక ఎవరికి వారే వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా సమన్వయ లోపాన్ని నివారించే ప్రయత్నం జరగకపోవడంతో జిల్లా పార్టీలో గ్రూపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. డీసీ సీ అధ్యక్ష పదవి ఖాళీ అయి 4 నెలలవుతున్నా భర్తీలో ఏకాభిప్రాయం కుదరకపోవడం, కొందరు నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో తలో మాట చెబు తుండటం, పార్టీ పెద్దల సమక్షంలోనే బల నిరూపణ కు యత్నించడం, కొందరికి వ్యతిరేకంగా, అనుకూలంగా ఆందోళనలు గాంధీభవన్ మెట్లెక్కడం ఖమ్మం కాంగ్రెస్ కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. అంతా కంగాళీ వాస్తవానికి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో 3 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకు కేటాయించినా 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో కొంత మార్పొచ్చినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ కేడర్ బలంగానే ఉంది. కానీ ఈ కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో మాత్రం జిల్లా నాయకత్వం విఫలమవుతోంది. దీనికి తోడు తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిపై ఆర్థిక ఆరోపణలు చేస్తూ వైరా నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి భార్య గాంధీభవన్‌లో ధర్నా చేయడం ఖమ్మం రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆమెను కొందరు వెనుక ఉండి నడిపిస్తున్నారని, రేణుక చరిష్మాను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని రేణుక వర్గం ఆరోపిస్తోంది. ఈ విషయంలో మిగిలిన కీలక నేతలు గుంభనంగానే ఉన్నా కొందరు స్థానిక నేతలు ప్రోత్సహిస్తుండటం రేణుక వర్గానికి మింగుడు పడటం లేదు. ప్రసాదరావు విషయంలో.. సీనియర్ నేత జలగం ప్రసాదరావును పార్టీలో చేర్చుకునే విషయంలోనూ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ విషయంలో భట్టి తటస్థంగా ఉంటున్నా ప్రసాదరావు చేరికను పొంగులేటి, రేణుక బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ప్రసాదరావు చేరికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియాతో పొంగులేటి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మరోవైపు పార్టీలో తమ చేరికకు లైన్ క్లియర్ అయిందని, వారం రోజుల్లోనే తాము కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం తథ్యమని ప్రసాదరావు వర్గం అంటోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేణుకాచౌదరి, జలగం ప్రసాదరావుల అంశాలను పార్టీ ఎలా పరిష్కరిస్తుందోనని ఆసక్తి నెలకొంది. డీసీసీ కోసం ‘ఢీ’ ఇక ఖమ్మం కాంగ్రెస్‌ను ప్రధానంగా వేధిస్తున్న సమస్య డీసీసీ అధ్యక్ష పదవి. డీసీసీ అధ్యక్షునిగా ఉన్న అయితం సత్యం 4 నెలల క్రితం మరణించడంతో ఖాళీ అయిన ఆ పదవిని తమ వారికే ఇప్పించాలని కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీ రేసులో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన పేరును బహిరంగంగా ఎవరూ వ్యతిరేకించకున్నా తమ వర్గం నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రేసులో రేణుక వర్గానికి చెందిన పోట్ల నాగేశ్వరరావు, దిలిశాల భద్రయ్య, మానుకొండ రాధాకిషోర్, ఎం. శ్రీనివాసయాదవ్, ఎడవెల్లి కృష్ణల పేర్లు వినిపిస్తున్నాయి. భట్టి మాత్రం పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుని హోదాలో హుందాగానే ఉంటూ ఎవరిని నియమించినా అభ్యంతరం లేదంటున్నారు. అయితే స్థానిక నాయకులు నాగుబండి రాంబాబు, పి.దుర్గాప్రసాద్‌లు మాత్రం భట్టి కోటాలో తమకు డీసీసీ పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తన సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు కె.రంగారావు, పరుచూరి మురళి పేర్లూ వినిపిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా పినపాక అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి ఇవ్వాల్సి వస్తే ఎస్టీ కోటాలో రేగా కాంతారావు కూడా డీసీసీ అధ్యక్ష బరిలో ఉండనున్నారు. చాంతాడంత జాబితాతో పదవి ఎవరికివ్వాలో పీసీసీ నాయకత్వానికీ తలనొప్పిగా మారి పెండింగ్‌లో పడిపోవడం గమనార్హం. -
సమాజంలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉంది
-
పార్లమెంట్‌లోనూ కాస్టింగ్ కౌచ్!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన లైంగిక దోపిడీ(కాస్టింగ్ కౌచ్) ఏదో ఒక రంగానికి పరిమితం కాలేదని, పార్లమెంటూ దానికి మినహాయింపు కాదని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ మాదిరిగా ‘మీ టూ’ అని ఇండియా కూడా నినదించాల్సిన సమయం వచ్చిందన్నారు. బాలీవుడ్ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ కాస్టింగ్ కౌచ్‌కు మద్దతుగా నిలవడంపై రేణుక మంగళవారం ఉదయం పై విధంగా స్పందించారు. అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో సాయంత్రం వివరణ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తనని అవమానించడం కూడా కాస్టింగ్ కౌచ్ కిందికే వస్తుందని పేర్కొన్నారు. ‘కాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు పరిమితం కాలేదనేది ఒక చేదు నిజం. అన్ని పని ప్రదేశాల్లోనూ ఇది సాధారణమే. పార్లమెంటు కూడా కాస్టింగ్ కౌచ్‌కు మినహాయింపు అని భావించొద్దు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నటీమణులు కాస్టింగ్ కౌచ్‌పై ‘మీ టూ’ అంటూ తమపై జరిగిన అఘాయిత్యాలను బహిర్గతం చేస్తున్నారు. భారత్‌లో కూడా బాధితులు అలాగే గొంతెత్తాలి’ అని అన్నారు. పార్లమెంటులో కాస్టింగ్ కౌచ్ ఉందనడం ఉదయం నుంచి ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో రేణుక తిరిగి సాయంత్రం వివరణ ఇచ్చారు. ‘గత పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభ సభ్యురాలైన నన్ను ప్రధాని నరేంద్ర మోదీ శూర్పణఖతో పోల్చారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు నా గౌరవానికి భంగం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఒక మహిళగా నా హక్కులు, గౌరవానికి భంగం కలిగించారు కాబట్టి ఇది కూడా కాస్టింగ్ కౌచ్ కిందికే వస్తుంది’ అని రేణుక వివరణ ఇచ్చారు. వారికి ఉపాధి దొరుకుతోంది: సరోజ్‌ఖాన్ కాస్టింగ్ కౌచ్‌ను సరోజ్‌ఖాన్ వెనకేసుకొచ్చారు. మహిళలతో లైంగిక కోరికలు తీర్చుకున్న తరువాత వారిని సినీ పరిశ్రమ గాలికొదిలేయకుండా కనీసం జీవనోపాధి కల్పిస్తోందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి అర్ధ నగ్నంగా నిరసనకు దిగడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సరోజ్ అలా స్పందించారు. ‘కాస్టింగ్ కౌచ్ చాలా ఏళ్లుగా ఉంది. మహిళతో పడక పంచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రభుత్వంలో ఉన్న వారూ అందుకు మినహాయింపు కాదు. కేవలం సినీ పరిశ్రమనే ఎందుకు నిందిస్తారు? అది కనీసం ఉపాధి అయినా కల్పిస్తోంది కదా. మహిళలను వాడుకొని అలా వదిలేయట్లేదు కదా’ అని అన్నారు. ఆ తరువాత సరోజ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించి క్షమాపణ చెప్పారు. -
క్షమాపణ చెప్పాలి...ప్రివిలేజ్ మోషన్
-
క్షమాపణ చెప్పాలి...ప్రివిలేజ్ మోషన్
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. ఆమెపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన ప్రధానిమోదీపై ప్రివిలేజ్ మోషన్ నోటీసులిచ్చేందుకు రడీ అవుతోంది. ఈ మేరకు రేణుకా చౌదరి సహా, కాంగ్రెస్ మహిళాప్రతినిధుల బృందం గురువారం రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ ప్రధానికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చేందుకు యోచిస్తున్నాననీ, పార్టీతో సంప్రదింపుల అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అలాగే తాను నవ్వుతూనే ఉంటాననీ.. దీనికి తాను ఎలాంటి జీఎస్టీ కట్టక్కలేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు అందరూ రాజ్యసభ అధ్యక్షుడిని కలిసి ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశామని కాంగ్రెస్ ప్రతినిధి కుమారి శైలజ మీడియాకు వివరించారు. కాంగ్రెస్ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని, అయితే వివాదం రేపవద్దని ఎన్సీపీ నాయకుడు డీపీ త్రిపాఠి తెలిపారు. మరోవైపు మోదీ వ్యాఖ్యలపై రాజ్యసభలో గురువారం తీవ్ర దుమారం చెలరేగింది. కేంద్ర మంత్రి , కాంగ్రెస్ ఎంపీ రేణుకపై ప్రధాని అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం ట్వీట్ చేసింది. కాగా బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. ఎంపీ రేణుకా చౌదరి అడ్డుపడిన సందర్భంగా ప్రధాని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
కలహాల ‘కాంగ్రెస్’
సాక్షిప్రతినిధి, ఖమ్మం : వర్గ పోరుతో కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న పార్టీ ఉమ్మడి జిల్లాలో ఐక్యతారాగం ఆలపించలేకపోతోంది. మూడు గ్రూపులు.. ఆరు విభేదాలు అన్న చందంగా ఉంది పార్టీ పరిస్థితి. కార్యకర్తలకు ఉన్న నిబద్ధత.. కలిసికట్టుగా పనిచేసే విషయంలో నేతల మధ్య లేకపోవడం తమకు తలనొప్పిగా మారిందనే భావన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో పార్టీ బలోపేతమయ్యే సూచనలున్నా.. నేతలు మాత్రం ఎవరికి వారే యమునాతీరే అనే రీతిన వ్యవహరిస్తూ.. కొన్ని నియోజకవర్గాలపై మాత్రమే ప్రత్యేక దృష్టి సారించి.. మరికొన్నింటిని నిర్లక్ష్యం చేస్తున్నారని.. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వివిధ నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు అధికార టీఆర్ఎస్లో చేరారు. అయితే ఆది నుంచి కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న వర్గాలు మాత్రం ఎన్ని కష్టాలొచ్చినా అధిగమించి మంచి రోజులు వస్తాయన్న భావనతో కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన ముఖ్య నేతలు కార్యకర్తలను సైతం గ్రూపుల వారీగానే గుర్తిస్తుండటం.. ఒకరి వద్దకు వెళ్తే మరొకరికి కంటగింపుగా మారడం.. వారికి జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సభలు, సమావేశాలకు కార్యకర్తలు వర్గ రహితంగా హాజరవుతున్నా.. కొందరు ముఖ్య నేతలు మాత్రం వర్గాలవారీగానే జన సమీకరణ చేసి జిల్లాలో తమ పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఏ సభకు వెళ్తే ఏం తంటానో..? వెళ్లకపోతే ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియని అయోమయ పరిస్థితి తమదని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదింటికి.. నాలుగు.. ఉమ్మడి జిల్లాలో 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 10 స్థానాలకు.. నాలుగు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పాలేరు నుంచి గెలుపొందిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన మధిర ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఒక్కరే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సత్తుపల్లి, వైరా, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పార్టీ మళ్లీ జవసత్వాలు పుంజుకునే అవకాశం ఉన్నా.. నాయకత్వం పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో స్థానిక నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఇక మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, శాసన మండలి ఉప నాయకుడిగా జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలిగా రేణుకా చౌదరి కాంగ్రెస్ నుంచి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి జిల్లాలో అనేక పర్యటనలు చేస్తున్న సందర్భంలో.. భట్టి విక్రమార్క జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలోనూ కార్యకర్తలు హాజరవుతున్నా.. ఒక వర్గం సమావేశానికి మరో వర్గం దూరంగా ఉంటోందని, తమకు సమాచారం లేదని ఒక వర్గం చెబుతుండగా.. తమను ఆహ్వానించడం లేదని మరో వర్గం ఆయా సమావేశాలకు దూరంగా ఉంటుండటంతో కాంగ్రెస్‌లో వర్గ పోరుకు అద్దం పడుతోంది. రేణుకా చౌదరి ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు హాజరైనా.. భట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడైన డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యంతోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కాలేదు. ఇదే తరహాలో మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలోనూ.. ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో రేణుక వర్గం దూరంగా ఉంటోందని కాంగ్రెస్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లాలో కాంగ్రెస్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందన్న ఆలోచనతో పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నా.. ఏ వర్గంలో మనగలుగుతామో..? ఎవరితో ఇమడ గలుగుతామో..? తేల్చుకోలేక వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నాయకుడు పోట్ల నాగేశ్వరరావు మాజీ మంత్రి రేణుకా చౌదరి నేతత్వంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ.. ఆ పార్టీ నుంచి ఖమ్మం, పాలేరు, వైరా, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట వంటి నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ‘కొత్త’లో కుతకుత! ఇక కాంగ్రెస్‌కు గట్టి పట్టుకున్న కొత్తగూడెం నియోజకవర్గంలోనూ పార్టీ వర్గ పోరుతో కుతకుతలాడుతోంది. అక్కడ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మరో కాంగ్రెస్ నేత ఎడవల్లి కృష్ణ వేర్వేరు శిబిరాలు ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తుండటం.. ప్రతి కార్యక్రమాన్ని పోటాపోటీగా నిర్వహిస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా వంటి గిరిజన నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలను కన్నెత్తి చూసే నాయకుడే లేరని, ఇప్పటివరకు పార్టీ బలంగా ఉన్నా.. తమ నాయకుడు ఎవరో తెలియని పరిస్థితి అక్కడి కార్యకర్తల్లో ఉంది. ఇల్లెందు నుంచి గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన హరిప్రియ కాంగ్రెస్‌లో చేరగా.. ఆమె ఇల్లెందు టికెట్ ఆశిస్తున్నారు. అలాగే భూక్యా దళ్‌సింగ్ సైతం ఈసారి ఇల్లెందు టికెట్‌పై ఆశలు పెట్టుకుని.. తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఖమ్మం నియోజకవర్గంపై అనేక మంది ప్రముఖులు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోని నేతలతోపాటు చిరకాలంగా పార్టీలో కొనసాగుతున్న నేతలు, ఇందుకోసమే పార్టీలో చేరిన నేతలు అనేక మంది ఈ స్థానాన్ని ఆశిస్తుండటంతో ఖమ్మం రాజకీయం రసకందాయంలో పడింది. పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పోటీ చేస్తారని ఆయన అనుచరులు ఆశిస్తుండగా.. అదే నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కందాల ఉపేందర్‌రెడ్డి ఈసారి టికెట్ కోసం భారీస్థాయిలో ప్రయత్నం చేస్తూ.. క్షేత్రస్థాయిలో ఇప్పటికే కార్యకర్తలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభలు ఎక్కడ పెట్టినా విజయవంతం అవుతున్నాయని, నేతల వైఖరి వల్ల ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక తారుమారైతే ఎన్నికల ఫలితాల్లో తేడా వచ్చే అవకాశం ఉందని, పార్టీ కోసం పనిచేసే నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం జిల్లా కాంగ్రెస్ పరిస్థితిపై దృష్టి సారించి నేతలను ఏకతాటిపై నడిపించేందుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఖమ్మం జిల్లాకు ముగ్గురు నేతలతో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో ఈ కమిటీని నియమించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ఆ జాకెట్ 70వేలా.. 700లకే కొనిస్తా!
-
హహ్హహా.. ఆ జాకెట్ 70వేలా.. 700లకే కొనిస్తా!
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై ‘సూటు-బూటు’ సర్కారు అంటూ విమర్శలు చేసే రాహుల్ గాంధీ ఏకంగా రూ. 70వేలు ఖరీదు చేసే జాకెట్‌ను తొడుక్కున్నారని బీజేపీ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. రాహుల్ జాకెట్ విషయంలో బీజేపీ చేస్తున్న విమర్శలను తేలికగా కొట్టిపారేసింది. ఆ జాకెట్ రూ. 70 వేలు.. రూ. 700లకు సైతం దొరుకుతుంది.. కావాలంటే ప్రధాని మోదీకి కొనిస్తామని వేలాకోళం చేసింది. రాహుల్ ఖరీదైన జాకెట్ వేసుకున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరీ ఈ మేరకు స్పందించారు. బీజేపీ ఆరోపణలపై మీడియా ప్రశ్నించగానే.. రేణుక అమాంతం నవ్వేశారు. బీజేపీ నిస్పృహకు ఈ ఆరోపణలు అద్దం పడుతున్నాయని, కొందరు వ్యక్తులు ఆన్లైన్లో వెతికి.. ఇలా రేట్లు ఊహించుకుంటున్నారని విమర్శించారు. అదే జాకెట్ రూ. 700లకే దొరుకుతుందని, కావాలంటే ప్రధాని మోదీకి పంపిస్తామని, 56 ఇంచుల ఛాతి అంటూ పేర్కొనే మోదీ కొలతలు తమకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. మంగళవారం షిల్లాంగ్‌లో జరిగిన ఓ సంగీత కార్యక్రమానికి రాహుల్ గాంధీ ఓ ఖరీదైన జాకెట్‌ను ధరించి హాజరయ్యారు. దీన్ని తమకు అవకాశంగా మలుచుకున్న బీజేపీ మేఘాలయ విభాగం ట్విటర్లో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దాదాపు 70 వేల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ జాకెట్ ధరించారని ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేసింది. మేఘాలయ ప్రజల గురించి పట్టించుకోకుండా, రాష్ట్రంలో ఉన్న అసమర్థ సర్కారుకు వంతపాడతారా అని రాహుల్‌ను ప్రశ్నించింది. రాహుల్ చూపిస్తున్న పక్షపాతం మేఘాలయ ప్రజలను వెక్కిరిస్తున్నట్టుగా ఉందని ధ్వజమెత్తింది. -
బంగారు తెలంగాణ ‘కేసీఆర్’కే పరిమితం
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందని ఎంపీ రేణుకాచౌదరి విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ జీఎస్టీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతివ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల నాలుకలకు జీఎస్టీ వేస్తే అబద్ధాలకు బ్రేకులు పడేవని రేణుకాచౌదరి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడిన వాటిలో 90 శాతం అబద్ధాలేనన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. నకిలీ విత్తనాలను పంపిణీ చేసిన వారిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేవీ అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. నకిలీ విత్తనాలను అందించిన కంపెనీలకే ప్రభుత్వం మరోసారి అనుమతిని ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. -
అభీష్ట శృంగారానికి కోర్టుల అనుమతి అక్కర్లేదు: రేణుక
న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనే విషయంలో మహిళలకు కోర్టుల ఆమోదం అవసరం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. 18 ఏళ్లు నిండిన యువతులు తమ అభీష్టం మేరకు శృంగారంలో పాల్గొనవచ్చని ఆమె శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. కొందరు యువతులు మొదట్లో శృంగారానికి అంగీకరించి ఆ తర్వాత అత్యాచారానికి గురయ్యామని ఫిర్యాదులు చేస్తున్నారని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రేణుక పైవిధంగా స్పందించారు. అత్యాచారానికి, ఆమోద శృంగారానికి మధ్య చాలా తేడా ఉందన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో మహిళలు అయోమయానికి లోనుకావద్దని సూచించారు. అయితే తాను కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించదలచుకోలేదని ఆమె చెప్పారు. అత్యాచారానికి గురైన యువతులు అలా ఫిర్యాదులు చేస్తున్నారనడం సరికాదన్నారు. అత్యాచారం అంటే అత్యాచారమేనని, అది క్రూరమైనదని, అత్యాచారంలో మహిళ ఆక్రమణకు గురవుతుందని చెప్పారు. వైవాహిక జీవి తంలో కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని వాపోయారు. -
రేణుక ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ఎలా అవుతుంది?
ఖమ్మం : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ఎలా అవుతుందో నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఆడబిడ్డల మనోభావాలు దెబ్బతిసే హక్కు ఎవరికీ లేదని రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈనెల 21న ఖమ్మంలో జరిగే సమావేశానికి రేణుకను ఆహ్వానించే విషయంలో తెలంగాణ మంత్రుల కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఇక ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు పొడచూపుతున్నాయి. ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తమ అనుంగు శిష్యులకు ఖమ్మం సీటు ఇప్పించడానికి అప్పుడే హామీలిస్తున్నారనే చర్చ జోరందుకుంది. అయితే తెలంగాణ విభజన వ్యవహారంలో రేణుకాచౌదరి వ్యవహారం మింగుడు పడని నేతలు ఆమెను జిల్లాకు శాశ్వతంగా దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తూ ఆదిశగా పావులు కదుపుతున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడుతున్న రేణుకకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలని ద్వితీయ శ్రేణి నాయకులు మరోవైపు తమ ముఖ్యనేతలను ప్రశ్నిస్తున్నారు. -
రేణుకాచౌదరికి ఖమ్మంతో రాజకీయ బంధం తెగిపోనుందా?
ఖమ్మం, సాక్షి ప్రతినిధి: ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరికి ఖమ్మంతో రాజకీయ బంధం తెగిపోనుందా? జిల్లాతో ఆమెకున్న 14 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ముగియనుందా? తెలంగాణ ఆడబిడ్డనంటూ జిల్లాలో చెలాయిస్తున్న పెత్తనానికి ఇక బ్రేక్ పడనుందా? జిల్లా కాంగ్రెస్‌లోని నాయకులే ఈమేరకు అంతా సిద్ధం చేస్తున్నారా? తెలంగాణ ప్రకటన వెలువడ్డాకా జరుగుతున్న పరిణామాల క్రమంలో జరుగుతున్న చర్చ ఇది. 1999లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచినప్పటి నుంచి రేణుకాచౌదరి ఇక్కడే తిష్టవేశారు. రెండోసారి గెలిచి కేంద్రమంత్రి కూడా అయ్యారు. ఇలా 14 ఏళ్లుగా జిల్లాలో ఆమె తిరుగులేని నాయకురాలిగా ఆధిపత్యం చెలాయించారు. కాంగ్రెస్ నేతల్ని తన కనుసన్నల్లో తిప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నప్పటికీ... వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి మళ్లీ లోక్‌సభకు పోటీచేయాలనే కోరికను పలు సందర్భాలలో ఆమె బయటపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని ఆపార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆమెకు జిల్లాలో స్థానం ఇక అనుమానమేనని, ఇంతకు ముందు పార్టీ నిర్ణయం మేరకు ఆంధ్రా నుంచి వచ్చి ఖమ్మంలో పోటీ చేసి గెలిచి ఉండొచ్చని, ఇప్పుడు రాష్ట్ర విభజన అయ్యాక ఆపరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు. అంతేకాక ఇటీవల ఢిల్లీలో సమైక్య ఎంపీలతో కలిసి ఆమె ఆంటోని కమిటీ ముందుకు వె ళ్లారనే వార్తలు, మరోవైపు ఆ కమిటీని కలిసేందుకు తమతో రానివ్వడానికి తెలంగాణ ఎంపీలు వ్యతిరేకించారన్న వార్తలు వచ్చిన విషయాన్ని కూడా జిల్లా నేతలు గుర్తు చేస్తున్నారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ఆమె ఇంకా తాను తెలంగాణ బిడ్డనేనని చెప్పుకోవడం ఎవరిని నమ్మించడం కోసం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐక్యత ప్రదర్శిస్తున్న జిల్లా నేతలు... ఇంతకాలం జిల్లాలో రేణుక ఆధిపత్యాన్ని భరిస్తూ వచ్చిన పలువురు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ‘ఇంకానా ఈ పెత్తనం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఖరారయ్యాకా కూడా ఇలాంటివి సహించేది లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా నేతలంతా ఐక్యంగా ఉండాలని కూడా పలువురు అంటుండడం గమనార్హం. దీనికి తగినట్లుగానే జరిగిన సంఘటన కూడా రేణుకకు జిల్లాలో ప్రాధాన్యం తగ్గిపోతోందా అనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తెలంగాణ ప్రకటన తర్వాత ఈనెల 15న రేణుక జిల్లా పర్యటన ఖరారు చేసుకున్నారు. ఆ మేరకు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తన అనుచరులకు హుకుం జారీచేసినట్లు, స్వాగత కార్యక్రమాలు భారీగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. కానీ నాయకులంతా కలిసికట్టుగా వ్యవహరించడంతోనే ఆమె పర్యటన రద్దయినట్లు సమాచారం. తెలంగాణ ప్రకటన వచ్చాక కూడా ఆమెకు ఘనస్వాగతం పలికితే విమర్శలు వస్తాయని నేతలు భావించి ఆమె రాకుండా అడ్డుకున్నారని సమాచారం. ఇప్పటివరకు రేణుకాచౌదరితో మంచి సంబంధాలున్న నాయకులు సైతం ఇప్పుడు ఆమెకు దూరంగా ఉండాలని, ఆమెను జిల్లాకు దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తుండడం రాజకీయవర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. షాకిచ్చిన మంత్రి... తెలంగాణ ప్రకటనకు ముందు కాంగ్రెస్ ఖమ్మం పట్టణ కమిటీని రేణుకాచౌదరి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మాట్లాడి ఏర్పాటు చేయించారు. దీంతో ఆగ్రహంతో కుతకుతలాడిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి బొత్సకు లేఖ రాసి ఆ కమిటీని రద్దు చేయించారు. ఇలా రేణుక చౌదరి ఆధిపత్యానికి గండి కొట్టే కార్యక్రమం మొదలై కొనసాగుతోందనే వాదనను పార్టీ వర్గాలు సైతం తోసిపుచ్చకపోవడం గమనార్హం.