సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందని ఎంపీ రేణుకాచౌదరి విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ జీఎస్టీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతివ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల నాలుకలకు జీఎస్టీ వేస్తే అబద్ధాలకు బ్రేకులు పడేవని రేణుకాచౌదరి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడిన వాటిలో 90 శాతం అబద్ధాలేనన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. నకిలీ విత్తనాలను పంపిణీ చేసిన వారిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేవీ అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. నకిలీ విత్తనాలను అందించిన కంపెనీలకే ప్రభుత్వం మరోసారి అనుమతిని ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment