
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం నగరంలోని సిద్ధారెడ్డి కళాశాల పోలింగ్ కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయించారని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఆరోపించారు. గురువారం పోలింగ్ జరుగుతున్న తరుణంలో కొద్ది మంది దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారం అందటంతో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించానని తెలిపారు. అనంతరం ఆమె పోలింగ్ సరళిని తెలుసుకొని అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో పసి పిల్లలతో వచ్చిన వాళ్లను, వృద్ధులను పోలింగ్ కేంద్రంలోకి పంపించాలన్నారు. ఈ క్రమంలోనే సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించగా.. దొంగ ఓట్లు వేస్తున్నారని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
Comments
Please login to add a commentAdd a comment