ఖమ్మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణలు.. | BRS Congress paty Flowers Fight At Pandithapuram In Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణలు..

Published Tue, Jul 4 2023 11:23 AM | Last Updated on Tue, Jul 4 2023 11:34 AM

BRS Congress paty Flowers Fight At Pandithapuram In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం జిల్లా: కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఆర్టీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన హనుమంతరావు, అతని అనుచరులతో కలిసి కాంగ్రెస్‌కు చెందిన మేకపోతుల మహేష్‌ గౌడ్‌పై కత్తులతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహేష్‌కు తీవ్ర గాయాలవ్వడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

కాగా గతంలోనూ మహేష్‌పై అనేకసార్లు దాడికి యత్నించినట్లు తెలిసింది. పలుమార్లు పలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాల  నేపథ్యంలో పండితాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement