Kamepally
-
ఖమ్మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణలు..
సాక్షి, ఖమ్మం జిల్లా: కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆర్టీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన హనుమంతరావు, అతని అనుచరులతో కలిసి కాంగ్రెస్‌కు చెందిన మేకపోతుల మహేష్ గౌడ్‌పై కత్తులతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహేష్‌కు తీవ్ర గాయాలవ్వడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా గతంలోనూ మహేష్‌పై అనేకసార్లు దాడికి యత్నించినట్లు తెలిసింది. పలుమార్లు పలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో పండితాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
ఖమ్మం: కామేపల్లి మండలంలోని గోవింద్రాల బంజర గ్రామం మస్జీద్ సెంటర్లో ‘హెల్పింగ్ హ్యాండ్స్ ఆఫ్ బంజర యూత్’ ఆధ్వర్యంలో ఆదివారం నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయాలు కామేపల్లి ఎస్ఐ స్రవంతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు యూత్ సభ్యులు నెల రోజుల నుంచి కూరగాయలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు షేక్ ఇషాఖ్, పింగళి పృథ్వీరిషీ, ఎల్.సంతోష్, గంగారపు ప్రశాంత్, షేక్ ఇమ్రాన్, సయ్యద్ రహిమతుల్లా, సయ్యద్ సలీం, సయ్యద్ హుస్సేన్ షా, బంక ప్రేమ్, గోపి ప్రశాంత్, సయ్యద్ నజీర్ పాషా, బీ శ్రీను, బానోత్ రవి, సయ్యద్ అన్వర్, సయ్యద్ ముస్తఫా, షేక్ ఆజాద్, షేక్ హుస్సేన్, సయ్యద్ అమీర్, పవన్‌కల్యాణ్, విక్రమ్, ఎస్.ఎన్.పాషా పాల్గొన్నారు. -
వాగు దాటుతూ వ్యక్తి మృతి
కామేపల్లి (ఖమ్మం) : వాగు దాటుతూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పెంజరమడుగు గ్రామం సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్ము మల్లయ్య (40) రోజూ మాదిరిగానే శనివారం కూలి పనికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నాడు. దారిలో బుగ్గవాగు దాటుతున్న సమయంలో కాళ్లకు రాళ్లు బలంగా తాకడంతో గాయపడి పడిపోయాడు. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.