కామేపల్లి (ఖమ్మం) : వాగు దాటుతూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పెంజరమడుగు గ్రామం సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్ము మల్లయ్య (40) రోజూ మాదిరిగానే శనివారం కూలి పనికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నాడు. దారిలో బుగ్గవాగు దాటుతున్న సమయంలో కాళ్లకు రాళ్లు బలంగా తాకడంతో గాయపడి పడిపోయాడు. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.