అభీష్ట శృంగారానికి కోర్టుల అనుమతి అక్కర్లేదు: రేణుక | Women don't need court endorsement for consensual sex: Renuka Chowdhary | Sakshi
Sakshi News home page

అభీష్ట శృంగారానికి కోర్టుల అనుమతి అక్కర్లేదు: రేణుక

Published Sat, Oct 19 2013 2:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

అభీష్ట శృంగారానికి కోర్టుల అనుమతి అక్కర్లేదు: రేణుక

అభీష్ట శృంగారానికి కోర్టుల అనుమతి అక్కర్లేదు: రేణుక

న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనే విషయంలో మహిళలకు కోర్టుల ఆమోదం అవసరం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. 18 ఏళ్లు నిండిన యువతులు తమ అభీష్టం మేరకు శృంగారంలో పాల్గొనవచ్చని ఆమె శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. కొందరు యువతులు మొదట్లో శృంగారానికి అంగీకరించి ఆ తర్వాత అత్యాచారానికి గురయ్యామని ఫిర్యాదులు చేస్తున్నారని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రేణుక పైవిధంగా స్పందించారు. అత్యాచారానికి, ఆమోద శృంగారానికి మధ్య చాలా తేడా ఉందన్నారు.
 
కోర్టు తీర్పు నేపథ్యంలో మహిళలు అయోమయానికి లోనుకావద్దని సూచించారు. అయితే తాను కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించదలచుకోలేదని ఆమె చెప్పారు. అత్యాచారానికి గురైన యువతులు అలా ఫిర్యాదులు చేస్తున్నారనడం సరికాదన్నారు. అత్యాచారం అంటే అత్యాచారమేనని, అది క్రూరమైనదని, అత్యాచారంలో మహిళ ఆక్రమణకు గురవుతుందని చెప్పారు. వైవాహిక జీవి తంలో కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement