
ఢిల్లీలో కాంగ్రెస్ వార్ రూం బయట రేణుకా చౌదరి, పొంగులేటి మాటామంతీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలును కేంద్రం ఇటీవల ఒక లేఖలో వివరించిందని, తెలంగాణకు ఇచ్చిన హామీల పురోగతిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బయ్యా రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ నివేదిక ఎందుకు ఇవ్వలేదని పొంగులేటి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment