సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితా అందరినీ తీవ్రం గా నిరాశపరిచిందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన యువతను విస్మరించారని, అభ్యర్థుల ఎం పికలో కొన్ని అవకతవకలు జరిగినట్టు అనిపిస్తోందన్నారు. ఈ విషయంపై తన పరిధిలో ఉన్నంత వరకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఖమ్మం జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి ఇచ్చామని చెప్పడం సరికాదని, కాంగ్రెస్ తరఫున ఆ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
‘18న ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తా’
సాక్షి, న్యూఢిల్లీ: స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 18న ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ నుంచి ఆ సీటు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి విజయరామారావు ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తే నియోజకవర్గంతో సంబంధం లేని వారికి టికెట్ కేటాయించినందుకు కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేని ఇందిరకు టికెట్ ఇవ్వడం శోచనీయమని, ఆమె ఎలా గెలుస్తారో చూస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment