
సాక్షి, న్యూఢిల్లీ: కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండ గా ఉండి ఎంతో శ్రమిం చిన వారికి న్యాయం చేసేందుకు అవసరమైతే తన స్థానాన్ని త్యాగం చేస్తానని మాజీ ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. గురువారం ఆమె ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీని భుజాల మీద మోసిన వారికి న్యాయం జరగడం ముఖ్యమని, దానికి సీనియర్లు త్యాగం చేయాల్సిన అవసరం ఉందని కమిటీకి నివేదించినట్లు తెలిపారు. తాను త్యాగాలకు సిద్ధంగా ఉన్నానని, పార్టీ గెలుపు కోసం శ్రమిస్తానని చెప్పారు.