హహ్హహా.. ఆ జాకెట్‌ 70వేలా.. 700లకే కొనిస్తా! | Congress reaction on Rahul Gandhi 70k jacket | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 31 2018 3:36 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress reaction on Rahul Gandhi 70k jacket - Sakshi

షిల్లాంగ్‌లో జరిగిన కార్యక్రమానికి ఖరీదైన జాకెట్‌ ధరించి హాజరైన రాహుల్‌ గాంధీ

సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై ‘సూటు-బూటు’ సర్కారు అంటూ విమర్శలు చేసే రాహుల్‌ గాంధీ ఏకంగా రూ. 70వేలు ఖరీదు చేసే జాకెట్‌ను తొడుక్కున్నారని బీజేపీ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్‌ పార్టీ తోసిపుచ్చింది. రాహుల్‌ జాకెట్‌ విషయంలో బీజేపీ చేస్తున్న విమర్శలను తేలికగా కొట్టిపారేసింది. ఆ జాకెట్‌ రూ. 70 వేలు.. రూ. 700లకు సైతం దొరుకుతుంది.. కావాలంటే ప్రధాని మోదీకి కొనిస్తామని వేలాకోళం చేసింది.

రాహుల్‌ ఖరీదైన జాకెట్‌ వేసుకున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రేణుకా చౌదరీ ఈ మేరకు స్పందించారు. బీజేపీ ఆరోపణలపై మీడియా ప్రశ్నించగానే.. రేణుక అమాంతం నవ్వేశారు. బీజేపీ నిస్పృహకు ఈ  ఆరోపణలు అద్దం పడుతున్నాయని, కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో వెతికి.. ఇలా రేట్లు ఊహించుకుంటున్నారని విమర్శించారు. అదే జాకెట్‌ రూ. 700లకే దొరుకుతుందని, కావాలంటే ప్రధాని మోదీకి పంపిస్తామని, 56 ఇంచుల ఛాతి అంటూ పేర్కొనే మోదీ కొలతలు తమకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు.

మంగళవారం షిల్లాంగ్‌లో జరిగిన ఓ సంగీత కార్యక్రమానికి రాహుల్‌ గాంధీ ఓ ఖరీదైన జాకెట్‌ను ధరించి హాజరయ్యారు. దీన్ని తమకు అవకాశంగా మలుచుకున్న బీజేపీ మేఘాలయ విభాగం ట్విటర్‌లో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దాదాపు 70 వేల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ జాకెట్‌ ధరించారని ట్విటర్‌లో ఫొటోలు పోస్ట్‌ చేసింది. మేఘాలయ ప్రజల గురించి పట్టించుకోకుండా, రాష్ట్రంలో ఉన్న అసమర్థ సర్కారుకు వంతపాడతారా అని రాహుల్‌ను ప్రశ్నించింది. రాహుల్‌ చూపిస్తున్న పక్షపాతం మేఘాలయ ప్రజలను వెక్కిరిస్తున్నట్టుగా ఉందని ధ్వజమెత్తింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement