పాలమూరు: ‘ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు.. హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఉండే వసతులు ఏంటీ? మన దగ్గర లేనివేంటీ.. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే కేసులన్నింటినీ పదేపదే ఇక్కడ చేయకుండా హైదరాబాద్‌కు ఎందుకు రెఫర్ చేస్తున్నారు? అని వైద్యులు, వైద్యశాఖ అధికారులపై కలెక్టర్ ఫైర్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రెవెన్యూ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, జనరల్ ఆస్పత్రి అధికారులతో మలేరియా, మాతా శిశుమరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెల అధిక సంఖ్యలో కేసులను రెఫర్ చేయడం వల్ల పేద రోగుల ఖర్చు పెట్టుకొని వెళ్తే వారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతారో ఆలోచన చేయాలన్నారు. ఏదైనా సౌకర్యాలు, వసతులు కావాలంటే అడగాలి తప్ప పేద రోగులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. మాతా శిశుమరణాలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో డీఎంహెచ్‌వో రజిని, సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్, మలేరియా అధికారి విజయ్‌కుమార్, మాస్‌మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, ఉమాదేవి, రాజాగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment