న్యూఢిల్లీ: తమిళనాడులో సంచలనం సృష్టించిన పాఠశాల విద్యార్థి ఆత్మహత్య కేసుకి సంబంధించి ఘటన జరిగిన మరుసటి రోజే మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి మృతి నిరశిసిస్తూ మరోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని ఆదేశించింది. అంతేగాక అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఐతే మెడికల్ ప్యానెల్‌లో తమకు తెలిసిన వైద్యుడిని చేర్చాలన్న తల్లిదండ్రుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
దీంతో వారు తమకు తెలిసిన వైద్యుడితోనే శవపరీక్షలు నిర్వహించాలంటూ బాలిక తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అంతేగాదు ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ సుప్రీంకోర్టుని బాలిక కుటుంబం పట్టుబట్టింది. ఐతే ధర్మాసనం రెండోసారి నిర్వహించే పోస్ట్‌మార్టం పై స్టే ఇచ్చేందుకు నిరాకరిచడమే కాకుండా రేపు విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది.
ఐతే బాలిక తండ్రి తరపు న్యాయవాది రాష్ట్రంలో ఈ విషయమై చాలా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది, పైగా ఈ రోజే పోస్ట్‌మార్టం ప్రారంభమవుతుంది కాబట్టి దయచేసి దానిపై స్టే విధించండి అంటూ పట్టుబట్టారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ స్పందిస్తూ...‘ఈ అంశాన్ని ఇప్పటికే హైకోర్టు సీజ్ చేసింది. మీకు హైకోర్టుపై నమ్మకం లేదా? అని మందలించడమే కాకుండా వారి అభ్యర్థనను తిరస్కరించారు. అదీగాక మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లకు సంబంధించి దాదాపు 300 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(చదవండి: జస్టిస్ ఫర్ శ్రీమతి: టీచర్లు హరిప్రియ, కృతిక అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment