![Ponmudi To Swear In As Minister In Tamilnadu Cabinet - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/22/ponmudi.jpg.webp?itok=c6u_hqan)
చెన్నై: డీఎంకే నేత కె.పొన్ముడి తమిళనాడు మంత్రిగా శుక్రవారం(మార్చ్ 22) మధ్యాహ్నం 3.30గంటలకు మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పొన్ముడి ప్రమాణస్వీకారాన్ని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 24 గంటల్లో గవర్నర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం కూడా జారీ చేసింది.
ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో పొన్ముడి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా చేయడం గమనార్హం. అక్రమాస్తుల కేసులో పొన్ముడికి పడిన మూడేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అనంతరం పొన్ముడిని సీఎం స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే పొన్ముడితో ప్రమాణస్వీకారం చేయించడానికి గవర్నర్ రవి నిరాకరించారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు కన్నెర్ర జేయడంతో గవర్నర్ దిగిరాక తప్పలేదు.
కాగా, తమిళనాడు ప్రభుత్వంలో గతంలో మంత్రిగా ఉన్న పొన్ముడిని అక్రమాస్తుల కేసులో దోషిగా తేలుస్తూ మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన తన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. శిక్షపై సుప్రీంస్టే తర్వాత ఆయన తన శాసనసభ్యత్వాన్ని తిరిగి పొందారు. ఆ వెంటనే పొన్ముడిని మంతత్రివర్గంలోకి తిరిగి తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment