సాక్షి,ఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ (జులై 15) విచారణ చేపట్టింది. అయితే విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కేసీఆర్ తరుపు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు. దీంతో ఇతర కేసులు ముగిసిన తర్వాత కేసీఆర్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయ స్థానం విచారణ చేపట్టనుంది.
గతంలో ఈ విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్.
మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్ర చూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసీఆర్ తరుపు న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment