తన సర్వీస్ రివాల్వర్‌తో భార్యను కాల్చి అనంతరం తాను కాల్చుకుని మృతి చెందిన దుబ్బాక చిట్టిబాబు దంపతుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది.
మెదక్ : తన సర్వీస్ రివాల్వర్‌తో భార్యను కాల్చి అనంతరం తాను కాల్చుకుని మృతి చెందిన దుబ్బాక చిట్టిబాబు దంపతుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్ చందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.... భార్య సరోజను కాల్చిన తర్వాత ఎస్‌ఐ తాను కాల్చుకున్నారన‍్నారు. తమ పోస్ట్‌మార్టం ప్రకారం ఎస్‌ఐ చిట్టిబాబు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. ఘటనపై ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. మరింత లోతుగా తెలుసుకునేందుకు చిట్టిబాబు దంపతుల కొన్ని శరీరా భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు.
కాగా ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక, తాను చేయని తప్పును తనపై వేసుకోలేక సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్సై చిట్టిబాబు (54) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సర్వీసు రివాల్వర్‌తో తన భార్యను కాల్చి తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గత తొమ్మిది నెలల్లో ఒకే పోలీసు డివిజన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న రెండో ఎస్సై చిట్టిబాబు కావడం గమనార్హం.