'మధుకర్‌కు ఎలాంటి సమస్యలు లేవు' | NRI madhukar reddy health condition is normal, says his US frined | Sakshi
Sakshi News home page

'మధుకర్‌కు ఎలాంటి సమస్యలు లేవు'

Published Fri, Apr 14 2017 5:04 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

'మధుకర్‌కు ఎలాంటి సమస్యలు లేవు' - Sakshi

'మధుకర్‌కు ఎలాంటి సమస్యలు లేవు'

కాలిఫోర్నియా: అమెరికాలో ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గూడూరు మధుకర్‌రెడ్డికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని అతని స్నేహితులు తెలిపారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా అతనికి ఎలాంటి డిప్రెషన్‌ లేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మిత్రుడు అమెరికాలో మీడియాతో మాట్లాడారు.

మధుకర్‌ చిన్ననాటి నుంచి మెరిట్‌ స్టూడెంట్‌ అని, పనిలోనూ ఎంతో నైపుణ్యం ప్రదర్శించారని, అందుకే అతని కాంట్రాక్ట్‌ పదేళ్ల నుంచి కొనసాగుతోందని చెప్పారు. అందరికి ఆప్తమిత్రుడిలా ఉండే మధుకర్‌కు సైలెంట్‌ అనే నిక్‌నేమ్‌ ఉందని.. అయితే నిశబ్దంగా అందరిని విడిచి వెళ్లిపోతాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాయం చేయడంలో ముందుండే మధుకర్‌కు సమస్యలున్నాయంటేనే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. మధుకర్‌తో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు.

మరోవైపు భర్త మధుకర్‌రెడ్డి ఆత్మహత్యకు తానే కారణమంటూ ఆరోపణలతో మనస్తాపం చెందిన అతడి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement