NRI Madhukar Reddy
-
విషమంగానే స్వాతి ఆరోగ్య పరిస్ధితి
-
ఎన్ఆర్ఐ స్వాతిరెడ్డి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఇటీవల అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి ఆత్మహత్యకు యత్నించింది. మంగళవారం భర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెపై అత్తింటివారు దాడి చేయ డంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో హైదరా బాద్‌లోని ఆర్కేపురం సౌభాగ్యపురం కాలనీలో తల్లిదం డ్రుల ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున స్వాతి బాత్రూమ్ క్లీనర్ హార్పిక్ తాగింది. అపస్మారకస్థితికి చేరుకున్న ఆమెను కుటుంబసభ్యులు వెంటనే కొత్తపేటలోని ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోందని, 72 గంటలు గడిస్తేగాని పరిస్థితి చెప్పలేమని, గొంతు ఇన్ఫెక్షన్కు గురైందని, అన్నవాహిక పూర్తిగా దెబ్బతిన్నదని ఓమ్ని ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. అత్తింటివారి వేధింపుల వల్లే.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగి రిగుట్ట మండలం రాళ్లజనగాంకు చెందిన గూడూరు మధుకర్‌రెడ్డి, స్వాతిరెడ్డి దంపతులు కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ నెల 4న మధుకర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ‘మధుకర్‌రెడ్డిని నువ్వే హత్య చేశావని స్వాతిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ వారి బంధువు రవీందర్‌రెడ్డి, మామ బాల్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని స్వాతి తండ్రి నర్సింహారెడ్డి ఆరోపించారు. వారి వేధింపులు తాళలేకనే తన కూతురు ఆత్మహత్యకు యత్నించిందని తెలిపారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, తమకు రక్షణ కల్పించా లని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నలుగురిపై కేసు నమోదు ఎన్ఆర్ఐ స్వాతిరెడ్డి ఆత్మహత్యాయత్నం ఘటనలో చైతన్యపురి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. తనను అత్తింటి వారు బెదిరింపులు, వేధింపులకు గురి చేశారని స్వాతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె అత్త సుగుణ, మామ బాల్‌రెడ్డి, ఆడపడుచు కల్పన, కల్పన భర్త రవీందర్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ గురురాఘవేంద్ర తెలిపారు. -
స్వాతి ముందే చెప్పింది!
మధుకర్ భార్య స్వాతి. అన్ని విషయాలూ ముందే చెప్పింది. భర్త డిప్రెషన్లో ఉన్నాడనీ.. కోపం అదుపులో ఉంచుకోలేకపోయేవాడనీ.. చెయ్యి చేసుకునేవాడనీ.. మధుకర్‌కి తను సైకలాజికల్ సపోర్టు ఇచ్చినా సైకియాట్రిక్ సపోర్టు అవసరమనీ.. ‘మనకు ఆస్తులు వద్దు.. సంతోషంగా ఉందాం’ అనీ.. మధుకర్ చనిపోకముందే స్వాతి ఇద్దరి పేరెంట్స్‌కీ, తన భర్తకు.. ముందే చెప్పింది! ‘సాక్షి’కి కూడా స్వాతి ముందే చెప్పింది. తను ఆత్మహత్యాయత్నం చేయకముందే స్వాతి సాక్షికి అన్నీ చెప్పింది. (అమెరికాలో పది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై మధుకర్‌రెడ్డి భార్య స్వాతి.. అత్తింటి వారు తనపై చేస్తున్న ఆరోపణలకు తీవ్ర మనస్తాపం చెంది నిన్న శుక్రవారం హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకు కొన్ని గంటల ముందు గురువారం నాడు ‘సాక్షి’తో స్వాతి మాట్లాడింది. ఆ వివరాలు.) అసలు ఏం జరిగింది? మేము సియాటెల్‌లో ఉంటాం. అక్కడి నుంచి నేను పనిచేసే చోటుకు మూడు గంటల ప్రయాణం. ఎప్పటిలాగే ఆ రోజూ (ఏప్రిల్ 3) ఆఫీస్‌కి వెళ్లాను. మధ్యాహ్నం రెండు గంటలప్పుడు కాల్ చేశాను మధుకి ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి. ‘మధూ.. రోజూ ఇంత దూరం జర్నీ చేసి రావక్కర్లేదు. ఇకనుంచీ సియాటెల్‌లో ఉన్న బ్రాంచ్‌లోనే నేను వర్క్ చేయొచ్చు అన్నారు మేనేజర్’ అని చెప్పా. ‘గుడ్ న్యూసే. రోజూ పొద్దున్నే లేచి హడావిడిగా కుక్ చేయడం, అంత దూరం జర్నీ చేయడం అన్నీ తప్పుతాయి స్వాతీ’ అని చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత అంటే మధ్యాహ్నం టూ థర్టీకేమో వాళ్ల ఆఫీస్ నుంచి శ్రీనివాస్ నాగేంద్ర అని ఆయన కొలీగ్‌తో చాట్ చేశాడు (ఆ స్క్రీన్ షాట్ ‘సాక్షి’కి చూపించింది స్వాతి). అందులో.. శ్రీనివాస్ అడిగాడు మధుని.. ఎబాప్ (ఎబిఎపి), ఎస్ఏపి తెలిసిన వాళ్లెవరైనా ఉన్నారా? మేనేజర్ అడుగుతున్నాడు’ అని. ‘నన్ను తీసేసే ప్రయత్నం జరుగుతోందా?’.. మధు. ‘అట్లా ఏం కాదు. చాలా వర్క్ ఉంది కదా. అందుకే’.. శ్రీనివాస్.‘ఏం కాదు. నన్ను తీసేస్తారేమో. ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా.. (అప్పటికే యేడాదిగా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నాడు మధు. అతని ఆఫీస్ ఆర్గాన్లో. అప్పుడప్పుడూ ఆఫీస్‌కు వెళుతూ రెగ్యులర్‌గా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నాడు)‘అలా అయితే ముందుగా నన్ను తీసేస్తారు. అబాప్, ఎస్ఏపి తెలిసిన వాళ్లుంటే చెప్పు’.. శ్రీనివాస్. ఈ సంభాషణ రెండున్నర నుంచి మూడున్నర మధ్యలో జరిగింది. మీరు ఇంటికి ఎప్పుడు వచ్చారు? ఎప్పటిలా సాయంత్రం వచ్చాను. అప్పటికే మధు హ్యాంగ్ చేసుకొని ఉన్నాడు! భయమేసి గట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాను. రోడ్డు మీద వెళ్తున్నవాళ్లు ‘ఏమైంది?’ అంటూ అడిగారు. చెప్పాను. వాళ్లు లోపలికి వచ్చారు సాయం చేయడానికి. ఈలోపు నేను 911కి కాల్ చేశాను. రెండు నిమిషాల్లోనే 911 వచ్చింది. వెంటనే సీపీఆర్ చేశారు. రెస్పాండ్ కాలేదు. ఇంకో ఫిప్టీన్ మినిట్స్ ఏవో మెడికల్ టెస్ట్స్ చేసి, చనిపోయాడు అని చెప్పారు. బహుశా 3.30 టు 5.30 మధ్యలో హ్యాంగ్ చేసుకొని ఉండొచ్చన్నారు. జాబ్ గురించి ఏమైనా టెన్షన్ వల్ల అలా చేసి ఉండొచ్చా? కావచ్చు. చాలా కాలంగా ఆయన డిప్రెషన్‌తో ఉన్నారు. 2016 నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తరచు మారే ఆయన మూడ్స్‌తో నేనూ సఫర్ అవుతుంటే.. నేనే చెప్పాను. డాక్టర్ దగ్గరకు వెళ్దామని. ఈ మధ్యనే అలా ఉంటున్నాడా? పెళ్లయినప్పటి నుంచీ అంతే. పెళ్లయిన మూడోరోజు మా ఇంట్లో ఫంక్షనయ్యాక మేమిద్దరం కలిసి వాళ్లింటికి వెళ్లాలి. కాని నన్ను అలా వదిలేసి ఆయన ఒక్కరే వెళ్లిపోయారు. మళ్లీ వన్ అవర్‌కి వచ్చి ‘సారీ.. నాకు ఇక్కడే ఉండాలని ఉంది. ఈ రోజు ఇక్కడే ఉందామన్నారు. మళ్లీ ఒక గంటకు .. ‘వెళ్లిపోదాం’ అన్నారు. ఇలా ఆయన మూడ్ మారడం నాకు చిత్రంగా అనిపించింది. పదిరోజుల తర్వాత మళ్లీ ఇలాగే చేస్తే.. ఏంటి ఇది అని అడిగాను. ‘నేనిలాగే ఉంటా.. నీకు ఇష్టమైతే రా.. లేకపోతే లేదు’ అన్నారు. నేను చాలా హర్ట్ అయ్యాను. మా ఇంటికొచ్చి మా పేరెంట్స్‌కీ చెప్పాను.. ‘ఆయన ప్రవర్తన నాకు అర్థంకావట్లేదు. నేను వెళ్లను’ అని. మా ఆడపడచు (మధు అక్కయ్య) వచ్చి బతిమాలింది. మా అత్తయ్య, మామయ్య కూడా ‘చిన్న విషయానికే అలా అంటే ఎట్లా..? సర్దుకుపోవాలి. మేమూ మా వాడికి నచ్చచెప్తామని’ నన్ను కన్విన్స్చేశారు. అప్పుడు మా ఆడపడచు ఒక మాట అంది.. ‘మధుని ఇన్ని రోజులు మేం భరించాం. ఇప్పటినుంచి నువ్వు భరించాలి’ అని. ఆ మాట అప్పుడు నాకు అర్థంకాలేదు. యూఎస్ ఎప్పుడు వెళ్లారు? మా పెళ్లికి ముందు నుంచే.. అంటే 2007 నుంచే మధు యూఎస్‌లో ఉండేవారు. 2010 డిసెంబర్లో మా పెళ్లయింది. 2011 జనవరిలో తనతో యూఎస్ వెళ్లా. అక్కడ ఎలా ఉండేది ఆయన ప్రవర్తన? అక్కడికెళ్లాక ఫస్ట్ లాస్‌వేగాస్ ట్రిప్‌కి వెళ్లాం. అక్కడా అంతే. నడుస్తూ నడుస్తూ నన్ను వదిలేసి వెళ్లిపోయేవారు. మళ్లీ సారీ అంటూ వెనక్కి వచ్చేవారు. ఇంట్లో కూడా మూడీగా ఉండేవారు. గదిలోకి వెళ్లి తలుపేసుకునేవారు. కోపమొస్తే ఇంట్లో వస్తువులు అన్నీ విసిరేసేవారు. నా మీద చేయి చేసుకునేవారు. మళ్లీ కూల్ అయిపోయి ‘సారీ.. ఇంకెప్పుడూ అలా చేయను’ అని బతిమాలేవారు. అరేంజ్డ్ మ్యారేజా ? లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే! నిశ్చితార్థం అయ్యాక నెలకు పెళ్లి అయింది. ఆ నెల రోజుల్లో మధు మీతో ఎలా ఉన్నారు? అయిదారుసార్లేమో మాట్లాడుకున్నాం. కొత్తకదా.. షై ఫీలింగ్ అనుకున్నా. పెళ్లయినా అంతే. యూఎస్‌లో కూడా అంతే. ఒక్కరు ఉండడానికే ఇష్టపడేవారు. వాళ్లవాళ్లకు చెబితే ‘పెళ్లికి ముందు మూడేళ్లు ఒంటరిగా ఉన్నాడు కదా.. అదే అలవాటైంది’ అన్నారు. అసలు పెళ్లికంటే ముందే ‘మావాడు ఎవరితో ఎక్కువ మాట్లాడడు’ అని చెప్పారు. కావచ్చు అనుకున్నాం. వాళ్ల అన్నయ్య కూడా ఇంతే. ఎప్పుడు బాగుంటాడో.. ఎప్పుడు కోపమొస్తుందో తెలియదు. కోపమొస్తే ముందు ఏది ఉంటే అది విసిరేస్తాడు. ఫిట్స్ కూడా వస్తాయి. అందుకే ఆయన కార్ డ్రైవ్ చేయడు. అతనూ రెండుసార్లు సూసైడ్ ఎంటెంప్ట్ చేశాడట. మొన్నీమధ్యే తెలిసింది. మధు ప్రవర్తన గురించి సీరియస్‌గా ఎప్పుడూ వాళ్లవాళ్లతో కాని, మీ వాళ్లతోకాని చెప్పలేదా మీరు? ఎందుకు చెప్పలేదూ. మా అత్తగారు వాళ్లు నేను చెప్పేదేదీ సీరియస్‌గా తీసుకోలేదు. పైగా నేనే వాళ్ల అబ్బాయిని ఇబ్బంది పెడ్తున్నానని తప్పుడు కామెంట్స్ చేసేవాళ్లు బంధువుల దగ్గర. 2015లో.. ‘ఇక లాభంలేదు.. మనం ఇండియా వెళ్లి మీ వాళ్లతో, మా వాళ్లతో మాట్లాడి ఒక సొల్యూషన్కి వద్దామని’ చెప్పాను. వీసా స్టాంపింగ్ ప్రాబ్లమని ఆయన ఆగిపోయారు. నేను మాత్రం వచ్చాను పాపను తీసుకొని. మా అత్తగారూ వాళ్లకి చెప్పాను మధు విషయం. యాజ్ యూజువల్‌గా వాళ్లు సీరియస్‌గా తీసుకోలేదు. సర్దుకుపొమ్మనే చెప్పారు. మా వాళ్లూ అంతే.. పాప ఉంది కదా.. సర్దుకుపో. ఓపిక పట్టు.. ఆయనే మారతాడు’ అని మళ్లీ కన్విన్స్ చేశారు. తిరిగి యూఎస్ వచ్చాను. మార్పు కనపడిందా? లేదు. సిచ్యువేషన్‌ని నేను కూడా హ్యాండిల్ చేయలేకపోయాను. అందుకే 2016లో డాక్టర్‌కి చూపించుకొమ్మని రిక్వెస్ట్ చేశాను. విన్నాడు. ముందు ఇద్దరం కలిసే ఫిజీషియన్ దగ్గరకు వెళ్లాం. ఫిజీషియన్ సైకియాట్రిస్ట్‌కు సజెస్ట్ చేశారు. సైకియాట్రిస్ట్ దగ్గరకు ఒక్కరే వెళ్లారు. కూడా నేను వెళితే ఓపెన్ కాలేడోమో అని నేను వెళ్లలేదు. ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశాక బాగున్నాడా? మందులు వేసుకుంటే బాగుండేవాడు. నలుగురితో మాట్లాడేవాడు. హుషారుగా ఉండేవాడు. నాతోకూడా బాగానే ఉండేవాడు. కాని డ్రౌజీనెస్ అనిపిస్తోందని అప్పుడప్పుడు మందులు మానేసేవాడు. అప్పుడు మాత్రం మళ్లీ మొదటికొచ్చేది పరిస్థితి. అసలు తనకు డిప్రెషన్ ఉందని ముందు ఆయనే రివీల్ చేశాడు పెళ్లయి యూఎస్ వెళ్లిన కొత్తలో నన్ను కొట్టాక. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా డాక్టర్‌కి చూపించుకొమని. పెళ్లికి ముందు ఈ విషయాన్ని వాళ్ల వాళ్లు గమనించలేదా? అసలాయన ఎప్పుడూ వాళ్ల పేరెంట్స్‌కి దగ్గర లేడు. వాళ్ల సొంతూరు భువనగిరి. చదువు కోసం ఆయనను హైదరాబాద్‌లో వాళ్ల బంధువుల ఇంట్లో పెట్టారు. ఇంటర్‌కి హాస్టల్. తర్వాత బిట్స్ పిలానీలో బీఫార్మసీ చేశాడు. ఆ తర్వాత యూఎస్. వాళ్ల ఫ్యామిలీతో ఆయనకు పెద్దగా అటాచ్మెంట్ కూడా లేదు. మధు చనిపోయాక కూడా వాళ్ల రాద్ధాంతం అంతా ఆస్తి గురించే. నా కూతురి పేర వాటా అడుగుతానని భయం. పాప పేర ఆస్తి ఇవ్వమంటారేమో అని రాద్దాంతం అన్నారు.. ఆమె వాళ్ల కొడుకు కూతురే కదా! ప్రేమ ఉండదా? వాళ్లకు మనవరాలు పుట్టడం ఇష్టం లేదు. అప్పటికే మధు వాళ్లన్నయ్యకు ఇద్దరు పాపలు. మాకూ కూతురే పుట్టేసరికి చాలా నారాజ్ అయ్యారు. మా పేరెంట్స్‌తో అన్నారు కూడా.. వీళ్లకు కూడా కూతురే పుట్టింది. వారసుడు పుడతాడనుకున్నాం. వారసుడు లేకుండా పోయాడు అని. పాప పుట్టినప్పుడు యూఎస్ వచ్చారు. కానీ మొహంలో సంతోషమే లేదు. మధు ఎలా ఉన్నారు? ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ల పేరెంట్స్ బిహేవియర్‌తో నేను బాధపడుతుంటే పట్టించుకోవద్దని చెప్పారు. అసలు మా ఇన్లాస్ చెప్తున్నట్టు నాకు, మధుకి మధ్య ఎలాంటి గొడవలూ లేవు మొదటినుంచీ. ప్రాబ్లం ఆయన హెల్తే. దాన్నీ మెల్లగా పరిష్కరించుకునే మార్గంలోనే ఉన్నాం. ఇల్లు కొనమని బలవంతం చేసింది మీరేనని అంటున్నారు మీ ఇన్లాస్? అదంతా పచ్చి అబద్ధం. అంతకుముందు మేం రెంట్‌కి ఉండేవాళ్లం. నెలకు 2200 డాలర్లు పే చేసేవాళ్లం. సియాటెల్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. నేనూ జాబ్ చేయడం స్టార్ట్ చేశాక.. అంతంత రెంట్ పెట్టడం కన్నా సొంతిల్లు కొనుక్కోవడం బెటర్ అని ఇద్దరమూ అనుకున్నాం. ముందు ఆయనే ప్రపోజ్ తెచ్చాడు. సరే అని వెళ్లి ఇల్లు చూసి ఇప్పుడున్న ఇంటికి అడ్వాన్స్ పే చేశాం. అప్పటినుంచి ఆయన ఇంకా టెన్షన్ పడిపోవడం, ఒకవేళ జాబ్ ఏమన్నా అయితే ఇంటి లోన్ కష్టమవుతుందేమోనని ఒత్తిడి ఫీల్ అవుతుంటే డ్రాప్ అయిపోదామని అన్నాను. అనడమే కాదు డీల్ క్యాన్సిల్ కూడా చేసుకున్నాం. ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చెప్పదలచుకున్నారు? మధు ఉన్నప్పుడు కూడా నా మీద తప్పుడు ప్రచారమే చేశారు.. ఇంట్లో పని చేయిస్తాను, ఇబ్బంది పెడ్తానంటూ. అమెరికాలో ఆడ, మగ ఇద్దరూ కలిసి ఇంటిపని చేసుకుంటారు. మధుతో కూడా అనేవాళ్లు. ‘ఒరేయ్ మగాడివయ్యుండి ఆ పనులేంట్రా?’ అని. అలాంటి మాటలన్నిటినీ మధు కొట్టిపడేసేవాడు. మా వాళ్లంతే. నువ్వు పట్టించుకోకు అని చెప్పేవాడు. ఆయన చనిపోయాక ఇక ఇప్పుడైతే అడ్డు అదుపూ లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్లు వేసే ఆరోపణలన్నీ తప్పని నేను ప్రూవ్ చేస్తున్నాను. నిజమని ఒక్క రుజువు చూపించమనండి? నా భర్త దహన సంస్కారాలకు వెళితే వాళ్ల బంధువు రవీందర్‌రెడ్డితో జుట్టు పట్టుకొని లాగి, కొట్టించారు నన్ను. ఒక స్త్రీననే విచక్షణ కూడా లేకుండా అలా చేయి చేసుకుంటారా? నా భర్తను చివరి చూపు చూసుకునే హక్కు నాకు లేదా? ఇంటికొచ్చేసరికి నిర్జీవంగా పడి ఉన్న భర్తను చూసి ఎలా తట్టుకొని, ఒక్కదాన్ని ఆ శవాన్ని తీసుకొని ఇండియాకు వచ్చాను. ఎంత కుంగిపోయి ఉంటాను? కనీసం ఆ కనికరం కూడా చూపరా? నా చేయి చేసుకున్న వ్యక్తి ముందస్తు బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. స్త్రీ మీద చేయి చేసుకున్న వ్యక్తికి అలా బెయిల్ ఎలా ఇస్తారు? ఇదేనా ఇక్కడ ఆడవాళ్లకు జరిగే న్యాయం? నాకు న్యాయం కావాలి. నా భర్తతో సరిగ్గాలేనని అంటున్నారు. మేమిద్దరం కలిసి ఓ నాలుగు నెలల కిందటే పార్ట్‌టైమ్‌గా ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేశాం. ఆ పనిలో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నెల కిందటే ఓ ఈవెంట్‌ను చేశాం. మేమిద్దరం బాగా లేకపోతే ఇద్దరం కలిసి ఎలా పనిచేసుకుంటాం? నిరాధారమైన ఆరోపణలెన్నో చేస్తున్నారు. అన్నిటికీ ప్రూఫ్స్ చూపించమనండి?.. అంటూ అప్పటిదాకా ఆపుకున్న దుఃఖాన్ని ఇక పట్టలేకపోయింది స్వాతి రెడ్డి. – ఇంటర్వ్యూ: సరస్వతి రమ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో శుక్రవారం అపస్మారక స్థితిలో ఉన్న స్వాతి -
'మధుకర్‌కు ఎలాంటి సమస్యలు లేవు'
కాలిఫోర్నియా: అమెరికాలో ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గూడూరు మధుకర్‌రెడ్డికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని అతని స్నేహితులు తెలిపారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా అతనికి ఎలాంటి డిప్రెషన్ లేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మిత్రుడు అమెరికాలో మీడియాతో మాట్లాడారు. మధుకర్ చిన్ననాటి నుంచి మెరిట్ స్టూడెంట్ అని, పనిలోనూ ఎంతో నైపుణ్యం ప్రదర్శించారని, అందుకే అతని కాంట్రాక్ట్ పదేళ్ల నుంచి కొనసాగుతోందని చెప్పారు. అందరికి ఆప్తమిత్రుడిలా ఉండే మధుకర్‌కు సైలెంట్ అనే నిక్‌నేమ్ ఉందని.. అయితే నిశబ్దంగా అందరిని విడిచి వెళ్లిపోతాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాయం చేయడంలో ముందుండే మధుకర్‌కు సమస్యలున్నాయంటేనే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. మధుకర్‌తో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. మరోవైపు భర్త మధుకర్‌రెడ్డి ఆత్మహత్యకు తానే కారణమంటూ ఆరోపణలతో మనస్తాపం చెందిన అతడి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
మానసిక స్థితి బాగోలేకే నా భర్త ఆత్మహత్య
♦ ఎన్ఆర్ఐ మధుకర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి వెల్లడి ♦ కడసారి చూడనీయకుండా అంత్యక్రియల్లో దాడి చేశారు ♦ ఆస్తి కోసమే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు ♦ ‘పోస్ట్‌మార్టం’ఆధారంగా చట్టప్రకారం ముందుకెళతాం ♦ మాకు ప్రాణహాని ఉంది.. ప్రభుత్వం రక్షణ కల్పించాలి హైదరాబాద్: మానసిక స్థితి సరిగా లేక, ఉద్యోగం పోతుందనే భయంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డా డని యాదాద్రి (భువనగిరి) జిల్లా యాదగిరిగుట్ట మండ లం రాళ్ల జనగాంకు చెందిన ఎన్ఆర్ఐ గూడూరు మధుకర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి చెప్పారు. బుధ వారం ఆర్కేపురం సౌభాగ్యనగర్‌లో తండ్రి నర్సింహారెడ్డితో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడేళ్ల క్రితం మధుకర్‌తో తనకు వివాహమైందని, అమెరికాలోని సియోటెల్ నగరంలో ఉంటూ ఇద్దరం ఉద్యోగం చేసేవారమని, తమకు ఐదేళ్ల పాప ఉం దని స్వాతిరెడ్డి చెప్పారు. సంసారంలో చిన్నచిన్న విషయాలు తప్ప, అంతా సవ్యంగానే ఉండేదని, ఇద్దరం సర్దుకుని పోయే వారమన్నారు. ఈ మధ్యకాలంలోనే ఇల్లు కూడా కొన్నామని చెప్పారు. ఏడాది నుంచి తన భర్త మానసిక పరిస్థితి బాగోలేదని, పనిచేస్తున్న కంపెనీలో ఈ ఏడాది జూన్‌తో గడువు పూర్తవుతుందని, హెచ్1బి వీసా నిబంధనలు కఠినతరం కావడంతో తనకు తిరిగి ఉద్యోగం వస్తుందో రాదోననే భయం తో మానసిక ఆందోళనకు గురయ్యేవాడని ఆమె పేర్కొంది. మధుకర్ అక్క, బాబాయి కుమారుడు రవీందర్‌రెడ్డి తరచుగా ఫోన్లో ఆస్తి గురించి మాట్లాడుకునేవారని, ఈ వ్యవహారంలో కూడా ఆయన తీవ్ర మనో వేదనకు గురయ్యాడని తెలిపింది. మనో వేదనకు సంబంధించి కొంతకాలంగా మెడి సిన్ వాడుతూ వైద్యుల సలహాలు పాటిస్తు న్నాడన్నారు. ఈ విషయాన్ని తన అత్తమామ లకు చెప్పినా వారు స్పందించలేదన్నారు. కొంత కాలంగా తనను కొడుతూ అప్పుడ ప్పుడూ ప్రేమగా చూసేవాడని చెప్పారు. ఈ నెల 4న తాను ఆఫీస్‌కు వెళ్లి వచ్చేసరికి మధుకర్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని, దీంతో తాను షాక్‌కు గురయ్యానని స్వాతిరెడ్డి వివరించారు. ఆస్తి కోసమే నిందారోపణలు.. సొంతూరులో తన భర్త అంత్యక్రియలు చేసేందుకు తీసుకువస్తే తనపై అత్తింటివారు అసత్య ఆరోపణలు చేసి.. మధుకర్‌ను కడసారి చూడనీయకుండా తనను, తన కుమార్తెను కట్టడి చేశారని ఆరోపించారు. తమపై దాడి చేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిం చారు. తాను తప్పు చేసి ఉంటే మధుకర్ మృతదేహాన్ని ఇక్కడకు ఎందుకు తీసుకువస్తానని, అమెరికా ప్రభుత్వం తనను వదిలిపెట్టేది కాదని చెప్పారు. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే ముందస్తు పథకం ప్రకారం తనపై నిందారోపణలు చేస్తున్నారని, వాటిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా చట్టప్రకారం తాము ముం దుకు వెళతామని, తమపై దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవటంతో పాటు, ప్రాణహాని ఉన్నందున తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.