ఎన్‌ఆర్‌ఐ స్వాతిరెడ్డి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఇటీవల అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి ఆత్మహత్యకు యత్నించింది. మంగళవారం భర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెపై అత్తింటివారు దాడి చేయ డంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో హైదరా బాద్‌లోని ఆర్‌కేపురం సౌభాగ్యపురం కాలనీలో తల్లిదం డ్రుల ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున స్వాతి బాత్‌రూమ్ క్లీనర్ హార్పిక్ తాగింది. అపస్మారకస్థితికి చేరుకున్న ఆమెను కుటుంబసభ్యులు వెంటనే కొత్తపేటలోని ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోందని, 72 గంటలు గడిస్తేగాని పరిస్థితి చెప్పలేమని, గొంతు ఇన్ఫెక్షన్‌కు గురైందని, అన్నవాహిక పూర్తిగా దెబ్బతిన్నదని ఓమ్ని ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
అత్తింటివారి వేధింపుల వల్లే..
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగి రిగుట్ట మండలం రాళ్లజనగాంకు చెందిన గూడూరు మధుకర్‌రెడ్డి, స్వాతిరెడ్డి దంపతులు కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ నెల 4న మధుకర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ‘మధుకర్‌రెడ్డిని నువ్వే హత్య చేశావని స్వాతిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ వారి బంధువు రవీందర్‌రెడ్డి, మామ బాల్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని స్వాతి తండ్రి నర్సింహారెడ్డి ఆరోపించారు. వారి వేధింపులు తాళలేకనే తన కూతురు ఆత్మహత్యకు యత్నించిందని తెలిపారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, తమకు రక్షణ కల్పించా లని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నలుగురిపై కేసు నమోదు
ఎన్‌ఆర్‌ఐ స్వాతిరెడ్డి ఆత్మహత్యాయత్నం ఘటనలో చైతన్యపురి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. తనను అత్తింటి వారు బెదిరింపులు, వేధింపులకు గురి చేశారని స్వాతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె అత్త సుగుణ, మామ బాల్‌రెడ్డి, ఆడపడుచు కల్పన, కల్పన భర్త రవీందర్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ గురురాఘవేంద్ర తెలిపారు.