స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) శుక్రవారం థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ ఆకస్మిక మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన థాయ్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. వార్న్ మరణించిన గదిలో ఫ్లోర్, టవల్స్‌పై అధిక మోతాదులో రక్తపు మరకలు గుర్తించామని పేర్కొన్నారు. వార్న్ మరణించడానికి ముందు భయాందోళనలకు గురై, నరక యాతన అనుభవించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి, ఆసుపత్రికి తరలించడానికి ముందు సీపీఆర్ చేశామని, గుండెపై ఒత్తిడి తెచ్చే క్రమంలో అతను రక్తపు వాంతులు చేసుకున్నాడని వార్న్ స్నేహితులు ప్రాధమిక విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఆదివారం థాయ్ అధికారులు వార్న్ భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు సోమవారం వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ వార్న్‌ది అసాధారణ మరణం అయితే పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
పోస్టుమార్టం అనంతరం ఆదివారమే వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం స్పిన్ దిగ్గజం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, 1992-2007 మధ్య 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌కు సేవలందించిన వార్న్..145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా వార్న్ రికార్డుల్లో నిలిచాడు.
చదవండి: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment