జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం | Re Postmortem To Guntur Love Couple Murder Victim Jyoti | Sakshi
Sakshi News home page

జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం

Published Wed, Feb 13 2019 10:28 PM | Last Updated on Wed, Feb 13 2019 10:31 PM

Re Postmortem To Guntur Love Couple Murder Victim Jyoti - Sakshi

సాక్షి, గుంటూరు: అమరావతిలో ప్రేమ జంట శ్రీనివాస రావు- జ్యోతిపై జరిగిన దాడి కేసు విచారిస్తున్న పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు సరిగా విచారించడం లేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఏఎస్పీ లక్ష్మీనారాయణ.. జ్యోతి మృతదేహానికి గురువారం రీపోస్టుమార్టం నిర్వహించనున్నట్టు తెలిపారు. పోస్టుమార్టంపై జ్యోతి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. పోస్టుమార్టంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హత్యకేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ బాలజీని సస్పెండ్‌ చెస్తామని ప్రకటించారు. 

గత సోమవారం రాత్రి తాడేపల్లి పట్టణంలోని మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అంగడి జ్యోతిలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో యువతి జ్యోతి మృతి చెందగా..  శ్రీనివాసరావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement