
సాక్షి, గుంటూరు : అమరావతిలో ప్రేమ జంట శ్రీనివాస రావు- జ్యోతిపై జరిగిన దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. గుర్తు తెలియని దుండగులు జరిపిన ఈ దాడిలో యువతి జ్యోతి మృతి చెందగా.. శ్రీనివాసరావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసు దర్యాప్తుపై జ్యోతి సోదరుడు ప్రభాకర్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును సరిగా విచారించడం లేదని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో అసలు ఏమి జరిగిందన్నదానిపై పోలీసులు దర్యాప్తు జరపడంలేదన్నారు. (రాజధానిలో ప్రేమజంటపై దాడి)
‘బుధవారం ఉదయం మంగళగిరి పోలీసులు ఫోన్ చేసి మృతదేహంపై ఉన్న బట్టలు, వాచ్ కావాలన్నారు. దీంతో సమాధి చేసిన మృతదేహాన్ని బయటకు తీసి బట్టలు, వాచ్ పోలీసులకు ఇచ్చాం. అయితే ఈ విషయాన్ని మీడియాకి చెప్పకుండా గోప్యంగా ఉంచమని చెప్పారు. దీంతో నాకు పోలీసులు దర్యాప్తుపై అనుమానం కలుగుతోంది. అసలు జ్యోతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయలేదని భావిస్తున్నా. ఈ కేసును పోలీసులు తప్పదోవ పట్టించేలా ఉన్నారు’ అని ప్రభాకర్ అనుమానం వ్యక్తం చేశారు. (మాజీ ప్రియుడి పనేనా ?)
ఇది చదవండి : జ్యోతి మృతిపై అనుమానాలున్నాయి
Comments
Please login to add a commentAdd a comment