
సాక్షి, గుంటూరు : రాజధానిలో ప్రేమ జంటపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జ్యోతి మృతి చెందగా.. శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే జ్యోతి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె సోదరుడు ప్రభాకర్. మీడియాతో మాట్లాడిన ప్రభాకర్.. ‘రెండేళ్ల క్రితమే వీరిద్దరి విషయం శ్రీనివాస్ తండ్రితో మాట్లాడను. తర్వాత వారు ఊరు వదిలి వెళ్లిపోయారు. కానీ శ్రీనివాస్ రహస్యంగా జ్యోతిని కలుస్తుండేవాడు’ అని తెలిపాడు.
అంతేకాక ‘హత్య జరిగిన రోజు కూడా శ్రీనివాస్ వేరే అమ్మాయితో పదేపదే ఫోన్ చేయించి.. జ్యోతిని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఎనిమిదిన్నర వరకు జ్యోతి ఫోన్ రింగయ్యింది. తొమ్మిది తర్వాత స్విచ్ఛాఫ్ వచ్చింది. దుండగులు వీరి మీద దాడి చేశారంటున్నారు. అయితే శ్రీనివాస్‌కు చాలా చిన్న దెబ్బలే తగిలాయి. కానీ జ్యోతి మాత్రం చనిపోయింది. వీటన్నింటిని చూస్తుంటే పథకం ప్రకారమే దాడి జరిగినట్లు అనిపిస్తుంది. పోలీసులు ఆ కోణంలో విచారణ జరపాల’ని ప్రభాకర్ కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment