ప్రముఖ నటి శ్రీదేవి మరణవార్తతో భారతీయ చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి నిన్న రాత్రి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందారు. దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రిలో ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. ఇంకా దానికి సంబంధించిన నివేధిక రావాల్సి ఉంది. డెత్ సర్టిఫికేట్ ఆలస్యంగా విడుదల చేయనున్నారు. దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికాయం తరలింపు ఆలస్యమవుతోంది. శ్రీదేవి భౌతికాయం తెల్లవారుజామున ముంబై చేరుకునే అవకాశం ఉంది. శ్రీదేవి భౌతికాయం కోసం బంధువులు, అభిమానులు ముంబైలో ఎదురుచూస్తున్నారు.