మెదక్ : మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ దాడి ఘటనలో మృతి చెందిన బీడీ కంపెనీ యజమాని శ్రీహరి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం అతడి మృతదేహాన్ని సిరిసిల్ల మండలం జిల్లెల్లకు పోలీసులు తరలించారు. అయితే స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జిల్లెల్ల - ఇబ్రహీంపూర్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. అలాగే ఇబ్రహీంపూర్ సర్పంచ్ ఇంటిపై దాడి కేసులో ఇప్పటి వరకు చెర్లుమద్ది సర్పంచ్ సహా 30 మంది యువకులను సిద్ధిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే జిల్లెల్లలో శ్రీహరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఐజీ నవీన్ చంద్ మాత్రం శుక్రవారం ఇరుగ్రామాలను సందర్శించి... పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షించారు.