సంగారెడ్డి మండలం కర్దనూరు గ్రామానికి చెందిన జుట్టు సునీత (25)కు నాలుగేళ్ల క్రితం జిన్నారం మండలం దోమడుగుకు చెందిన పాండుతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. అయితే ఏడాదిగా పాండు అదనపు కట్నం కోసం సునీతను వేధిస్తున్నాడు. అంతే కాకుండా గుమ్మడిదలకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై సునీత తరచూ పాండును అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. అయినా అతను వినలేదు.
పాండు వివాహేతర సంబంధం విషయం సునీతకు తెలియడంతో అదనపు కట్నం తీసుకురావాలని వేధించసాగాడు. దీనిపై శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోని కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. సునీతను కాపాడేందుకు భర్త, చుట్టు పక్కల వారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కాలిన గాయాలతో సునీత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషం తెలుసుకున్న మృతురాలి బంధువులు గ్రామానికి చేరుకున్నారు. సునీత మృతికి కారణమైన పండుపై స్థానికులు మండిపడ్డారు.
సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మృతురాలి తమ్ముడు ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ లాలూనాయక్ తెలిపారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్న పాండుతో పాటు అతని తమ్ముడు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన దోమడుగులో సంచలనం రేపింది. మృతురాలి బంధువులు, తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వేధింపులు తాళలేక..వివాహిత ఆత్మహత్య
Published Sun, Dec 28 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM
Advertisement