
పాతిపెట్టిన మృతదేహానికి 22 రోజుల తర్వాత పోస్టుమార్టం
కోహీర్ : పాతిపెట్టిన మృతదేహానికి 22 రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన మండలంలోని దిగ్వాల్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోయిని నరసింహులు భార్య కమలమ్మ (48) ఈ నెల 2న మృతి చెందింది.
దీంతో ఆమెను సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. కాగా జగద్గిరిగుట్టలో ఉంటున్న తల్లి సులోచనమ్మ తన కుమార్తెది సహజ మరణం కాదని అల్లుడు నరసింహులు, ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ కోహీర్ పోలీసులకు ఫిర్యాదు చే సింది. దీంతో తహశీల్దార్ ఫర్హిన్‌షేక్ సమక్షంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ప్రొఫెసర్ విజయ్ సాగర్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ చంద్రశేఖర్ వివరించారు.