Sushant Singh Rajput Sister Reacts To Autopsy Staff Shocking Claim On SSR Murder - Sakshi
Sakshi News home page

Sushant Singh Rajput: 'నిజనిజాలు ఏంటో చెప్పండి'.. సీబీఐ విచారణ కోరిన సుశాంత్‌ సోదరి

Published Tue, Dec 27 2022 12:58 PM | Last Updated on Tue, Dec 27 2022 1:31 PM

Sushant Singh Rajput Sister Reacts To Shocking Claim SSR Was Murdered - Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయి రెండేళ్లు దాటినా, అతడి మృతికి గల కారణాలు ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్యేనంటూ పోస్టుమార్టం చేసిన బృందంలోని రూప్‌కుమార్ షా అనే వ్యక్తి  సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది.  

సుశాంత్ బాడీపై పలు గాయాలు ఉన్నాయని పేర్కొన్న రూప్‌కుమార్‌.. పోస్టుమార్టం జరిగేటప్పుడు వీడియో రికార్డు చేయకుండా కేవలం ఫోటోలు మాత్రమే తీశారని, పైఅధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు త్వరగా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశామని వెల్లడించారు. దీంతో సుశాంత్‌ మరణంపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి.

తాజాగా ఇదే విషయమై ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ సుశాంత్‌ సోదరి ట్వీట్‌ చేసింది. రూప్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలను స్క్రీన్‌షాట్స్‌లో జోడించి.. సుశాంత్‌ కేసును సీబీఐ విచారణ జరిపి నిజనిజాలు ఏంటో బయటకు వెల్లడిస్తారని ఎప్పటినుంచో మేం ఎదురుచూస్తున్నాము. సుశాంత్‌కు న్యాయం జరగాలి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా 2020 జూన్‌14న ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్‌ మరణించిన సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement