
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై హీరోయిన్ రియా చక్రవర్తిని పోలీసులు సోమవారం ప్రశ్నించారు. ఆదివారం ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు సుశాంత్ మృతదేహాన్ని ముంబైలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు. దీంతో సుశాంత్‌ను చూసేందుకు రియా కూపర్ ఆసుపత్రికి సోమవారం చేరుకున్నారు. అక్కడ ఆమెను చూసిన పోలీసులు సుశాంత్ ఆత్మహత్యకు తనకు సంబంధం ఉందా అనే కోణంలో విచారించారు. (సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ)
దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ఆత్మహత్యకు సంబందించి ఎలాంటి సుసైడ్ నోట్ దొరకకపోవడంతో దర్యాప్తులో భాగంగానే రియాను విచారించామని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ముంబైలోని విలే పార్లే వద్ద పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా గతంలో రియా, సుశాంత్‌లు ప్రేమలో ఉన్నారంటూ బిటౌన్‌లో వీరిద్దరూ చక్కర్లు కొడుతున్న ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతేగాక సుశాంత్ పుట్టిన రోజున రియా వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి ప్రత్యేకంగా శుభకాంక్షలు తెలిపారు. (ఆ ‘దెయ్యమే’ సుశాంత్‌ను పీడించింది!)
అయితే వారిద్దరి ప్రేమాయణం నిజమా..?!
Mumbai: Actor and #SushantSinghRajput's friend Rhea Chakraborty visited Cooper Hospital, where his body has been kept, earlier today. She will be questioned by the Police in connection with the case. pic.twitter.com/SxE4jturor
— ANI (@ANI) June 15, 2020