Veteran Singer Vani Jayaram Postmortem Complete, Details Inside - Sakshi
Sakshi News home page

వాణి జయరామ్‌ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి..తలకు ఒకటిన్నర ఇంచు గాయం!

Published Sun, Feb 5 2023 9:28 AM | Last Updated on Sun, Feb 5 2023 11:17 AM

Postmortem Of Vani Jayaram Body Completed - Sakshi

ప్రముఖ గాయని వాణీ జయరామ్‌ శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చెన్నైలోని ఒమేదురార్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వాణీ జయరామ్‌ మృతదేహానికి పోస్ట్‌ మార్టం నిర్వహించారు. ఆమె తలకు ఒకటిన్నర ఇంచు గాయం అయినట్లు గుర్తించారు. అయితే ఆ గాయంపై ఇప్పటికి ఎలాంటి నిర్ధారణకు రాలేమని పోలీసులు చెబుతున్నారు.

పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని అన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని వాణీ జయరామ్‌ నివసింసే అపార్ట్‌మెంట్‌కు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాణీ జయరామ్‌ పోస్ట్ మార్టంలో ఏం రాబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement