Vani Jayaram
-
నేను పాడిన చాలా పాటలు బయటకు రానివ్వలేదు..!
-
కె. విశ్వనాథ్ గారు చాలా మంచి వేత్తి : గాయని వాణీ జయరామ్
-
పాట ఎంత బాగా పాడిందో మీరు ఒక్కసారి వినండి
-
మంచి పాటలకు అవార్డ్స్ ఇవ్వరు..
-
ఒక రోజుకి 24 గంటలు కాకుండా 72 గంటలు ఉంటే బాగుండు అనిపించింది..
-
లెజెండరి సింగర్ వాణీ జయరాంకు అమూల్ ఘన నివాళి
లెజెండరి సింగర్ వాణీ జయరాం శనివారం(ఫిబ్రవరి 4న) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆమె ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. 5 దశాబ్దాలుగా 14 భాషల్లో తన గాత్రాన్ని అందించారు వాణీ జయరాం. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. తెలగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. చదవండి: వచ్చే వారమే ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ అలాగే ఆమె మృతికి ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా నివాళులు తెలిపింది. ఆమెకు ప్రత్యేకంగా డూడుల్‌తో సంతాపం తెలిపింది. వాణీ జయరాం పాట పాడుతున్న ఫొటోను డూడుల్‌లో డిజైన్ చేసి ఘన నివాళి అర్పించింది అమూల్. దీనిని తన అధికారిక ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ప్రతి రాగంలో ఆమె కవిత వికసించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. రిప్ వాణీ జయరాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ప్రస్తుతం అమూల్ ట్వీట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆమె డూడుల్ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 37వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్స్ వచ్చాయి. చదవండి: ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత #Amul Topical: Tribute to legendary playback singer of South Indian cinema pic.twitter.com/jSuzQfndkz — Amul.coop (@Amul_Coop) February 5, 2023 -
వీడిన వాణీ జయరామ్ డెత్ మిస్టరీ.. ఆ గాయాలకు కారణమిదే!
ప్రముఖ నేపథ్య గాయని వాణీజయరామ్ మృతిపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఆమె బెడ్రూంలో వాణీజయరామ్ తన గదిలోని అద్దంతో కూడిన టీపాయ్‌పై పడటంతో తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల మృతి చెందినట్లు ఫోరెన్సిక నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వాణీ జయరామ్ నివసిస్తున్న అపార్ట్మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని స్పష్టం చేశారు. దీంతో ఆమె మృతిపై ఎలాంటి సందేహాలు లేవని ,విచారణ అనంతరం ఆమెది సహజ మరణ మేనని పోలీసులు ధ్రువీకరించారు. కాగా అంతకుముందు వాణీజయరామ్ తలకు బలమైన గాయం కావడం, ముఖం రక్తసిక్తమై ఉండటం, చేతి రేఖలు వంటి ఆధారాలను తుడిచి వేయడంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం వాణీ జయరామ్ మృతి వెనుకున్న మిస్టరీ వీడింది. కాగా ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో ప్రభుత్వ లాంఛనాలతో వాణీ జయరామ్ అంత్యక్రియలు నిర్వహించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థివేదేహానికి నివాళులు అర్పించారు. కాగా ప్రఖ్యాత గాయని పి.సుశీల వాణీజయరామ్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఆదివారం ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో తనకు ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని హైదరాబాద్‌లో ఉన్న తన మనవరాలు ఫోన్ చేసి వాణీజయరామ్ కన్నుమూసిన విషయం తెలుసా అని అడిగిందన్నారు. దాంతో తాను షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. వాణీజయరామ్‌తో కలిసి తాను 100 పాటలు పాడినట్లు గుర్తు చేసుకున్నారు. ఆమె పెద్దగా నవ్వే వారు కాదని, తాను జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కలిసి ఉన్నప్పుడు మాత్రమే వాణీ జయరామ్ నవ్వేవారని చెప్పారు. ఏడు స్వరాల పాటను ఆమె మినహా ఎవరు పాడలేరని, వాణీజయరామ్ది ప్రత్యేక స్వరం అని పి.సుశీల కొనియాడారు. -
వాణి జయరామ్ పోస్ట్ మార్టం పూర్తి..తలకు ఒకటిన్నర ఇంచు గాయం!
ప్రముఖ గాయని వాణీ జయరామ్ శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చెన్నైలోని ఒమేదురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాణీ జయరామ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆమె తలకు ఒకటిన్నర ఇంచు గాయం అయినట్లు గుర్తించారు. అయితే ఆ గాయంపై ఇప్పటికి ఎలాంటి నిర్ధారణకు రాలేమని పోలీసులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని అన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని వాణీ జయరామ్ నివసింసే అపార్ట్‌మెంట్‌కు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాణీ జయరామ్ పోస్ట్ మార్టంలో ఏం రాబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
వాళ్లు నన్ను పట్టించుకోలేదు.. అలా ఎవరకీ జరగకూడదు: వాణీ జయరామ్
ఏ వృత్తిలో అయినా పోటీ సహజం. అలా వాణీ జయరామ్ బాలీవుడ్‌కి తన వాణి వినిపించడానికి వెళ్లినప్పుడు అప్పటికే అక్కడ ‘స్టార్ సింగర్స్’గా వెలుగుతున్న అక్కచెల్లెళ్లు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల నుంచి గట్టి పోటీ ఎదురైంది. హిందీ చిత్రం ‘గుడ్డి’ (1971)లో పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాట ద్వారా బాలీవుడ్‌కి పరిచయమై ‘మధురమైన కంఠం’ అని శ్రోతల నుంచి కితాబులు అందుకున్నారు వాణీ జయరామ్. అయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. లత, ఆశాలు వాణీకి అవకాశాలు రాకుండా చేశారనే ఓ టాక్ ఇప్పటికీ ఆ నోటా ఈ నోటా వినిపిస్తుంటుంది. (చదవండి: మూగబోయిన వాణి) ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో వాణీ జయరామ్ మాట్లాడుతూ – ‘‘కెరీర్ పరంగా నేను ఎవరి పేర్లూ ఉద్దేశించి మాట్లాడను. లతాజీ, ఆశాజీ గొప్ప గాయనీమణులు. వాళ్లు నాకేమైనా చేశారా? చేయలేదా? అనే విషయం గురించి నేను మాట్లాడను. ఒకరు ఏం చేశారనే విషయంపై నేను ఓ నిర్ణయానికి రాకూడదు. అయితే హిందీలో నేను విజయాలు సాధించినప్పటికీ నన్ను పెద్దగా పట్టించుకోలేదు. అది దురదృష్టం. అలా ఎవరికీ జరగకూడదు’’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆమె గాయనీమణులు శంషాద్ బేగం, సుమన్ కల్యాణ్‌పూర్‌ల పేర్లను ప్రస్తావించారు. ‘‘శంషాద్, సుమన్‌లు మంచి సింగర్స్ అయినప్పటికీ అనుకున్నంతగా రీచ్ కాలేకపోయారు. ఇలా ఎందరికో జరిగి ఉండి ఉంటుంది. వారిలో నేను ఒకదాన్ని... అంతే. అయితే ఇలా జరగడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది’’ అని కూడా వాణి అన్నారు. -
వాణీ జయరామ్‌కి వాణీ అని ఎందుకు పెట్టారంటే?
దాదాపు ఐదు దశాబ్దాలుగా తన గొంతుతో సంగీత ప్రియుల్ని అలరించిన వాణీ జయరామ్(78) మరణంతో చిత్ర సీమలో విషాదం నెలకొంది. వాణీ జయరామ్ అసలు పేరు ‘కలైవాణి’. పదకొండు మంది పిల్లల్లో ఎనిమిదో సంతానం అయిన వాణి నామకరణ వేడుక చేయడానికి ఆమె తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలొచ్చాయట. దీంతో వాణి పదిరోజుల పాపగా ఉన్నప్పుడు ఓ సిద్ధాంతి దగ్గరకు వెళ్లి మా పాపకు ఏదైనా పేరు సూచించమని అడిగితే ‘పాపకు పూర్వజన్మ పుణ్యఫలం ఉంది. దేవుణ్ణి తేనెతో అభిషేకాలు చేసింది. అందుకే ‘కలైవాణి’ అని పేరు పెట్టండి’ అని ఆ సిద్ధాంతి చెప్పారట. ఆ సమయంలో సిద్ధాంతి మాటలకు దురైస్వామి హాయిగా నవ్వుకున్నప్పటికీ, పాప భవిష్యత్తు గురించి ఇప్పుడే కలలు కనడం ఎందుకని అనుకున్నారట. కానీ పేరు మాత్రం కలైవాణి అని పెట్టారు. సిద్ధాంతి చెప్పినది నిజం అయింది. సినీ గాయనిగా, భక్తి గీతాల గాయనిగా వాణి ఎంతటి విశేష ప్రతిభ కనబరిచారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక తన తల్లి పద్మావతి తెలుగువారు కాబట్టి తెలుగులోనూ మంచి పాటలు పాడటం పట్ల వాణి పలు సందర్భాల్లో ఆనందం వ్యక్తం చేశారు. ఇంట్లో ఒప్పించి సినీ గాయనిగా... వాణీ జయరామ్ సంగీత ప్రియుల కుటుంబంలోనే జన్మించినప్పటికీ వారి కుటుంబ సభ్యులకు సినిమా సంగీతం పట్ల మంచి అభిప్రాయం ఉండేది కాదు. సినిమాలు, సినిమా పాటలు వారి ఇంట్లో నిషేధం. సంగీతం అంటే వారి దృష్టిలో శాస్త్రీయ సంగీతమే. అయితే వాణీకి సినిమాల్లో నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకోవాలని కల. కానీ ఆమె తల్లి పద్మావతి ఇష్టపడలేదు. ఇంట్లో ఒప్పించి, స్వయంకృషితో తన కలను నెరవేర్చుకున్నారు వాణి. కూతురి కీర్తి చూసి, తల్లి సంతోషించారు. అయితే వాణి విజయాలను ఆమె తండ్రి దురైస్వామి చూడలేకపోయారు. 1969లోనే ఆయన మరణించారు. తన సక్సెస్‌ను తండ్రి చూడలేకపోవడం కాస్త బాధ కలిగించిందని వాణి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. -
మూగబోయిన వాణి
‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’.. ఎంత కమ్మని గొంతు. ఉషోదయం వేళ మనసుని ఉల్లాసంగా తట్టిలేపే మృదు మధురమైన కంఠస్వరం వాణీ జయరామ్ సొంతం.. అలాంటి ఆ కంఠస్వరం మూగబోయింది. ప్రముఖ గాయని వాణీ జయరామ్ (78) కన్నుమూశారు. చెన్నైలోని నుంగంబాక్కమ్లో ఉన్న తన సృగృహంలో అనుమానాస్పద స్థితిలో మరణించారామె. వాణి నుదురు, భుజంపై రక్తపు గాయాలు ఉండడంతో ఆమె మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు ఐపీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంటిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వాణి మృతదేహానికి ఓమందూరార్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం కేసు విచారణ ముమ్మరం అయ్యే సూచనలున్నాయి. తమిళనాడులోని వెల్లూరులో దురైస్వామి, పద్మావతిలకు 1945 నవంబరు 30న జన్మించారు వాణీ జయరామ్. ఆమె అసలు పేరు కలైవాణి. పదకొండు మంది పిల్లల్లో వాణి ఎనిమిదో సంతానం. ఆమె తల్లి పద్మావతి కర్నూలులో జన్మించడంతో వాణికి తెలుగులో పాడటం అలవాటైంది. రంగరామానుజ అయ్యంగార్ వారి వద్ద పద్మావతి సంగీత శిక్షణ పొందారు. తన కుమార్తె వాణిని కూడా ఆయన వద్దే కర్ణాటక సంగీత శిక్షణ కోసం చేర్పించారామె. వెల్లూరులో వాణి నాలుగో తరగతి పూర్తయ్యాక, ఆమెకు మరింత మంచి సంగీత శిక్షణ ఇప్పించేందుకు వారి కుటుంబం చెన్నైకి తరలి వెళ్లింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు జీఎన్ బాలసుబ్రహ్మణ్యం శిష్యుడైన టీఆర్ బాలసుబ్రహ్మణ్యం వద్ద సంగీతం నేర్చుకున్నారు వాణి. తన ఎనిమిదవ ఏటనే మద్రాసులో ఆకాశవాణిలో పాడారు. పదేళ్ల నుంచే పూర్తి స్థాయి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారామె. స్కూలులో 22 వేర్వేరు కళలతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన స్టూడెంట్‌గా అవార్డును పొందారు వాణి. బీఏ ఎకనామిక్స్ చదువుతున్న సమయంలో కళాశాలల స్థాయిలో డిబేట్ కార్యక్రమాల్లో బహుమతులు పొందారామె. చదువు పూర్తయ్యాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై బ్రాంచిలో ఉద్యోగంలో చేరారు వాణి. 1967లో ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆ తర్వాత 1969లో జయరామ్‌ని వివాహం చేసుకుని, ముంబయ్‌కి వెళ్లారు వాణి. భర్త జయరామ్ ప్రోత్సాహంతో ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ వద్ద హిందుస్తానీ శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారామె. ఆ సమయంలోనే బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయి సంగీత సాధనకు సమయాన్ని వెచ్చించారామె. కర్ణాటిక్, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె 1969లో ముంబయ్‌లో తొలి కచేరి ఇచ్చారు. సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్‌కి ఆమె గొంతు నచ్చడంతో 1971లో హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్డి’ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశమిచ్చారు. ఆ చిత్రం కోసం వాణీ జయరామ్ పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాటకు మంచి స్పందన వచ్చింది. వాణికి ‘తాన్సేన్ సమ్మాన్, బెస్ట్ ప్రామిసింగ్ సింగర్, ఆలిండియా సినీగోయర్స్’ వంటి అవార్డులు దక్కాయి. ఇక ‘అభిమానవంతుడు’ (1973) చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీ జయరామ్‌తో పాడించారు దర్శకుడు ఎస్.పి. కోదండపాణి. తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం. 1974లో ముంబయ్ నుండి చెన్నైకి వచ్చి స్థిరపడిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్‌పురి, మరాఠీ, ఒరియా.. ఇలా 14 భాషల్లో పదివేలకుపైగా పాటలు పాడారు. కేవీ మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాథన్ , ఇళయరాజా, పెండాల్య, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు వంటి సంగీత దర్శకుల సినిమాల్లో ఎక్కువ పాటలు పాడారామె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రానికి తొలిసారి జాతీయ పురస్కారం అందుకున్నారామె. ఆ తర్వాత ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే..’ గీతానికి ఆమెకు రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నీయరా హరా..’ పాటకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు వాణి. జాతీయ స్థాయిలోనే తెలుగు, గుజరాతీ, ఒడియా, తమిళ భాషల్లో ప్రాంతీయ స్థాయి ఉత్తమ గాయని అవార్డులు పొందారామె. ‘కలైమామణి, సంగీత పీఠ్ సమ్మాన్, ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవన సాఫల్య పురస్కారం, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, కాముకర అవార్డు, సుబ్రహ్మణ్య భారతి అవార్డు, ఘంటసాల జాతీయ పురస్కారం, దక్షిణ భారత మీరా అవార్డు’ వంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు వాణీ జయరామ్. సినిమా పాటలే కాదు.. ఎన్నో భక్తి గీతాలను, లలిత గీతాలను ఆలపించారు వాణి. ‘మొరటోడు’ చిత్రంలోని ‘హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే’ పాటతో పాటు ‘ప్రేమలేఖలు’లోని ‘ఈరోజు మంచిరోజు’ అంటూ సుశీలతో కలసి పాడిన పాట తనకెంతో ఇష్టం అని వాణి గతంలో పేర్కొన్నారు. తమకు పిల్లలు లేకున్నా ఆ లోటును సంగీతమే తీర్చిందని చెప్పేవారామె. వాణి భర్త జయరామ్ 2018లో మృతి చెందారు. కాగా సంగీత రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022కిగాను ఇటీవల ‘పద్మ భూషణ్’ అవార్డు ప్రకటించింది. అయితే ఆ పురస్కారాన్ని స్వీకరించకుండానే వాణి ఈ లోకాన్ని వదిలి వెళ్లడం బాధాకరం. ఆమె మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భర్త ప్రోత్సాహంతో... ప్రతి మగాడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు. కానీ వాణీ జయరామ్ విజయం వెనక ఆమె భర్త జయరామ్ ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా సంగీతంలో ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ముంబయ్‌లోని ఇండో–బెల్జియం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా చేసిన జయరామ్ సంగీతప్రియులు. పండిట్ రవిశంకర్ దగ్గర ఆరేళ్లు ఆయన సితార్ నేర్చుకున్నారు. వాణీతో వివాహం తర్వాత తన భార్యలోని సంగీత ప్రావీణ్యతను గుర్తించారు జయరామ్. ఆల్రెడీ కర్ణాటిక్, శాస్త్రియ సంగీతాలను ఔపోసన పట్టిన ఆమెను హిందుస్థానీ సంగీతాన్ని కూడా నేర్చుకోవాలని కోరారు జయరామ్.కేవలం నేర్చుకోమని చెప్పడమే కాకుండా.. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ దగ్గర సంగీత పాఠాలు నేర్పించారు. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ శిష్యరికంలో ఆరు నెలల కఠోర శిక్షణ తర్వాత హిందుస్థానీ సంగీతంలో కూడా వాణి ప్రతిభ చూపారు. 18 గంటల పాటు ఏకధాటిగా శిక్షణ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక బ్రహ్మాండంగా కచేరీలు చేసుకోవచ్చని వాణీకి భరోసా ఇచ్చారు రహమాన్. ఆత్మవిశ్వాసం, గురువు రహమాన్ ఇచ్చిన భరోసాతో చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి పలికారు వాణి. 1969లో తొలిసారిగా ముంబయ్‌లో కచేరి ఇచ్చారామె. ఆ తర్వాత సినీ గాయనిగా ఎంతో బిజీ అయ్యారు. సంగీతమే సంతానం... వాణీ జయరామ్ దంపతులకు సంతానం లేరు. సంగీతాన్నే సంతానంలా భావించారు. ‘‘సంగీతంతో సంతానం లేని లోటు తీరిపోయిందనుకుంటాం’’ అని పలు సందర్భాల్లో వాణి పేర్కొన్నారు. కొత్త నాయికలకు ఆ వాణీయే... ఓ కొత్త హీరోయిన్ వెండితెరకు పరిచయం అవుతుందంటే వెంటనే వాణీ జయరామ్‌కు కబురు వెళ్లేది. అలా పలువురు హీరోయిన్లు నటించిన తొలి సినిమాకు పాటలు పాడారు వాణీ జయరామ్. శ్రీదేవి హీరోయిన్గా పరిచయమైన తొలి తమిళ (‘మూండ్రు ముడుచ్చు – ‘ఆడి వెళ్లి’), హిందీ (సోల్వా సావన్ – గోరియా హో గోరియా) చిత్రాల్లో పాటలు పాడారు వాణీ జయరామ్. అలాగే షబానా ఆజ్మీ, జూహీ చావ్లా, పర్విన్ బాబీ, జయబాధురీ హీరోయిన్లుగా పరిచయం అయిన తొలి చిత్రాలకు వాణీ జయరామ్ పాటలు పాడారు. వాణి తెలుగు హిట్ సాంగ్స్ కొన్ని... ► అభిమానవంతులు – ‘ఎప్పటివలె కాదురా నా సామి...’ ► ‘స్వాతి కిరణం’ – తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఆనతినీయరా హరా.., శివానీ భవానీ.. ► ‘శంకరాభరణం’ – దొరకునా ఇటువంటి సేవ.., ఏ తీరుగ నను.., ► పలుకే బంగారమాయెనా.. ► ‘పూజ’ – పూజలు చేయ పూలు తెచ్చాను... ► ‘సీతామాలక్ష్మి’ – ఏ పాట నే పాడను... ► శ్రుతిలయలు – ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్... ► ‘తిరుపతి’ – తప్పెట్లోయి తాళాలోయి ► ‘సీతాకోక చిలుక’ – సాగర సంగమమే..., అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి ► ‘స్వర్ణకమలం’ – అందెల రవమిది పదములదా... ► ‘మంగమ్మగారి మనవడు’ – శ్రీ సూర్యనారాయణ మేలుకో... ► ‘గుప్పెడు మనసు’ – నేనా పాడనా పాట.. మీరా అన్నదీ మాట.. ► ‘ఘర్షణ’– ఒక బృందావనం సోయగం... అది దైవ సంకల్పం 1970 నుంచి 1990 వరకూ బిజీ గాయనిగా సాగిన వాణీ జయరామ్ ఆ తర్వాత కాస్త స్లో అయ్యారు. కాగా పలు భాషల సినిమాలకు పాడుతూనే మరోవైపు ఎన్నో భజన పాటలు కూడా పాడారు వాణి. ‘అది పూర్తిగా దైవ సంకల్పం. ఆ దేవుడికి ధన్యవాదాలు. భజనలు పాడినప్పుడు నా మనసెంతో ఆనందంగా ఉంటుంది’ అని పలు సందర్భాల్లో ఆమె పేర్కొన్నారు. హిందీలో తొలి చిత్రం ‘గుడ్డి’కి తొలుత ఆమె పాడినది భజన పాటే. అయితే సినిమా విడుదల తర్వాత చూస్తే సిల్వర్ స్క్రీన్‌పై ఆ పాట వినబడలేదు. అలా ఎందుకు జరిగిందో ఎప్పటికీ అర్థం కాలేదని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు. ఈ ఒక్క పాటే కాదు.. వాణి పాడిన పాటల్లో తెరపై వినిపించనవి ఎన్నో ఉన్నాయి. ‘ఇలాంటివాటి గురించి తలచుకుంటే బాధ రెట్టింపు అవుతుందే కానీ, తగ్గదు. అందుకే వాటి గురించి ఆలోచించను’ అని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు. వాణీ జయరామ్ అంత పాజిటివ్ పర్సన్. ప్రముఖుల నివాళి తన మధురమైన గాత్రంతో సినీ సంగీతానికి విశేష సేవలందించి ఎంతోమంది హృదయాలను గెలిచారు వాణీ జయరామ్‌గారు. పాన్ ఇండియా స్థాయిలో బలమైన శాస్త్రీయ పునాదిని నిర్మించారామె. వాణీగారి మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి.. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాణీ జయరామ్‌గారి మృతి బాధాకరం. 14 భాషల్లో 10 వేలకుపైగా పాటలు పాడిన ఆమె సినీ రంగానికి అందించిన సేవలు మరువలేనివి. ఆమె మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రఖ్యాత భారతీయ సినీ సంగీత గాయనీమణిగా ఖ్యాతి సంపాదించుకున్న ‘కలైమామణి’ వాణీ జయరామ్ మరణ వార్త చాలా బాధించింది. ఆమె లేని లోటును భారతీయ సినిమాలో ఎవరూ భర్తీ చేయలేరు. వాణీ జయరామ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి పదాలకు పదోన్నతి చేకూరేలా ఒక వినూత్నమైన బాణీతో ప్రపంచానికి ఎన్నో పాటలను బహుమతిగా ఇచ్చిన కోకిలలా జీవించిన వాణీ జయరామ్‌గారు ఇప్పుడు ప్రశాంతించారు. ఆవిడ పాటలు మనతోనే ఉంటాయి. – కమల్‌హాసన్ మీరు (వాణీని) నాకు పాడిన తొలి పాటనే మీకు నివాళిగా అర్పిస్తున్నాను. ‘మేఘమే మేఘమే.. పాల్ నిలా తేయందదే. దేగమే తేయినుమ్ తేనొళీ వీసుదే.. ఎనక్కొరు మలర్ మాలై నీ వాంగ వేండుమ్’ (తమిళ చిత్రం ‘పాలవన్న చోలై’లోని పాట.. ఈ చిత్రం తెలుగులో ‘మంచు పల్లకి’గా రీమేక్ అయింది. తెలుగులో ‘మేఘమా..’ పాటని ఎస్. జానకి పాడారు). పాటలో ‘ఎనక్కొరు మలర్ మాలై నీ వాంగ వేండుమ్’ అంటే నాకోసం నువ్వొక పూలదండ కొనాలని అర్థం. ఈ సాహిత్యాన్ని ‘ఉనక్కొరు మలర్ మాలై నాన్ వాంగ వేండుమ్’.. (నీకోసం నేనో పూలదండ కొనాలని అర్థం) అని మార్చి... ‘ఆ పూలదండ దీనికోసమేనా?’ (వాణి మరణాన్ని ఉద్దేశించి) అంటూ ముగించారు. తమిళ ప్రముఖ రచయిత వైరముత్తు. చాలా షాక్‌కి గురి చేసే వార్త ఇది. నమ్మశక్యంగా లేదు. జస్ట్ రెండు రోజుల క్రితమే వాణీ అమ్మతో మాట్లాడాను. నిజమైన లెజెండ్. బలమైన శాస్త్రీయ పునాదితో బహుముఖ ప్రతిభ గల బహు భాషా గాయనిని కోల్పోయాం. – చిత్ర నిన్న (శుక్రవారం) రాత్రే కె. విశ్వనాథ్ సార్ సినిమాల్లో వాణీగారి పాటలు వింటూ, ‘ఎంత అద్భుతంగా పాడారో వినండీ.. అని మా ఆయన (నటుడు శరత్‌కుమార్)తో అన్నాను. ఆ మర్నాడే ఆమె మరణ వార్త విని షాకయ్యాను. – రాధికా శరత్‌కుమార్ ఎంత గొప్ప గాత్రం. చివరిసారిగా ఆమెను కలిసినప్పుడూ ఆ గాత్రంలో అదే స్పష్టత. ‘ఏళు స్వరంగళ్, మల్లిగై, నానే నానా వంటి పాటలతో పాటు నాకు పాడిన ‘మేఘమే మేఘమే’... ఇలా ఆమె పాడిన ఎన్నో పాటలు హృదయాల్లో నిలిచిపోతాయి. – సుహాసినీ మణిరత్నం ► భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రసంశలు పొందారు వాణీ జయరామ్. ఓ కచేరీలో ఇందిరా గాంధీ తన ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నట్లు పలు సందర్భాల్లో వాణి స్వయంగా చెప్పారు. ► హేమమాలిని, వినోద్ ఖన్నా ప్రధాన తారాగణంగా గుల్జార్ దర్శకత్వంలో 1979లో హిందీలో ‘మీరా’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాలో ఉన్న 13 పాటల్లో 12 పాటలను వాణీ జయరామ్ పాడటం విశేషం. ► గంగామహోత్సవ్, స్వామి హరిదాస్ ఫెస్టివల్, ఛండీఘడ్‌లోని పంచకుల, ఛిత్తోడ్ఘడ్లో మీరా ఫెస్టివల్స్.. ఇలా పలు పండగలకు ఆమె కచేరిలు చేశారు. బద్రినాథ్‌లో రెండుసార్లు పాడారు. -
హైదరాబాద్‌తో నాది జన్మజన్మల అనుబంధం: వాణీ జయరాం
సుప్రసిద్ధ గాయని వాణీ జయరాం మరణంతో అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఐదు దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో వేలాది పాటలు ఆలపించిన ఆ గొంతు.. ఆగిపోయిందన్న విషయాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె పుట్టి పెరిగింది చెన్నైలో అయినప్పటికీ.. హైదరాబాద్‌తో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది. వాణీ జయరాం అన్నయ్య హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేసేవాడు. ఆమె కూడా కోఠీలోని ఎస్బీఐ బ్యాంకులో పని చేశారు. వాణీ జయరాం పెళ్లి కూడా సికింద్రాబాద్‌లోనే జరిగింది. ‘నా మనసులో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ నగరంతో నాది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంటుంది. నా అసలు పేరు కలైవాణి. జయరామ్‌తో పెళ్లి తర్వాత వాణీ జయరామ్‌గా మారాను. జయరామ్ ఉద్యోగరీత్యా ఆయనతో పాటే బాంబే వెళ్లాను. అయితే, పీబీ శ్రీనివాస్ పురస్కారం, పి.సుశీల ట్రస్టు పురస్కారం, ఫిలింఫేర్ ఫర్ సౌత్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వంటి సత్కారాలను హైదరాబాద్‌లోనే అందుకున్నాను’ అని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వాణీ జయరాం చెప్పారు. -
గాయని వాణీ జయరాం మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: గాయని వాణీ జయరాం మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. పాన్-ఇండియా స్థాయిలో వాణీ జయరాం బలమైన శాస్త్రీయ పునాదిని నిర్మించారని సీఎం జగన్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రముఖ సింగర్ వాణీ జయరాం హఠాన్మరణం చెందారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం ఆమె తుదిశ్వాస విడిచారు. కళాతపస్వి విశ్వానాథ్ మరణం నుంచి కోలుకోకముందే వాణీజయరాం మరణంతో మరోసారి సినీ పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. కాగా చెన్నైలో జన్మించిన ఆమె దాదాపు వెయ్యి సినిమాల్లో పది వేలకుపైగా పాటలు పాడారు. తెలుగు, తమిళంతో కలిపి 14 భాషల్లో 5 దశాబ్దాలుగా వాణీ జయరాం వెండితెరకు తన గ్రాత్రాన్ని అందించారు. ఇక సినీ పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గానూ ఇటీవల భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషన్ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డును అందుకోకముందే వాణీ మృతి చెందడం విచారకరం. చదవండి: వాణీ జయరాం ముఖంపై తీవ్రగాయాలు.. అసలేం జరిగింది! కాగా 1945 నవంబర్ 30న తమిళనాడులోని వేలూరులో జన్మించారు వాణీ జయరాం. ఆమె అసలు పేరు కలైవాణి. 1971లో ఆమె గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. రంగరామానుజా అయ్యంగార్ వద్ద ఆమె శాస్త్రీయ సంగీతంతో శిక్షణ తీసుకున్నారు. -
వాణీ జయరామ్ కుటుంబ నేపథ్యం ఏంటి? ఒంటరిగా ఎందుకు ఉన్నారు?
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూసిన ఘటన మరవకు ముందే ప్రముఖ గాయని వాణీ జయరామ్ హఠాన్మరణం ఇప్పుడు చిత్ర పరిశ్రమను షాక్‌కి గురిచేస్తుంది. ఇటీవలె ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించగా, ఆ అవార్డు తీసుకోకముందే ఇలా మృతిచెందడం విషాదకరం. తెలుగు, తమిళం, హిందీ సహా సుమారు 14 భాషల్లో 20వేలకు పైగా పాటలు పాడిన ఆమె తన అద్భుతమైన గాత్రంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించిన వాణీ జయరామ్ అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీజయరాం ఐదో సంతానం. పదేళ్ల వయస్సులోనే ఆలిండియా రేడియోలో పాటలు పాడిన ఆమె 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేసింది. తాను గాయనిగా ఇంత ఎత్తు ఎదగడానికి తన భర్త జయరామ్ అందించిన ప్రోత్సహమే కారణమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది వాణీ జయరామ్. 1969లో ఆమెకు వివాహం అయినా పిల్లలు లేరు. అయితే ఆ లోటుని సంగీతమే తీర్చిందని సగర్వంగా చెబుతుండేవారామె. ఇక వాణీ జయరామ్ భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. తాజాగా వాణీ జయరామ్ అనుమానాస్పద మృతి దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. చెన్నైలోని నుంగంబాకం ప్రాంతంలో ఇంటిరిగా ఉంటున్న వాణీ జయరామ్‌ది సహజ మరణం కాదని.. ఎవరో హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. -
మిస్టరీగా వాణీ జయరాం మరణం.. హత్య చేశారా?
ప్రముఖ గాయని వాణీ జయరాం(78) మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నుదురు, ముఖంపై తీవ్రగాయాలు ఉండడంతో అమెది సహజ మరణం కాదని.. ఎవరో హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తొలుత ఆమె ఆపస్మారక స్థితిలో పడి చనిపోయారని భావించారు. కానీ ఆమె ముఖంపై ఉన్న గాయాలు, పని మనిషి చెబుతున్న వివరాలు చూస్తుంటే వాణీ జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కూడా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని.. ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అసలేం జరిగింది? చెన్నైలోని నుంగంబాకం ప్రాంతంలో నివాసం ఉంటున్న వాణీ జయరాం చనిపోయిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని పని మనిషి చెబుతున్నారు. శనివారం ఉదయం ఎప్పటి మాదిరిగానే ఇంట్లో పని చేసేందుకు పని మనిషి వాణీ జయరాం ఫ్లాట్‌కి వచ్చింది. తలుపులు మూసి ఉండడంతో కాలింగ్ బెల్ కొట్టారు. అయినా తలుపులు తీయలేదు. దాంతో పనిమనిషి భర్త తన ఫోన్లోంచి వాణీ జయరాం ఫోన్‌కు కాల్ చేశాడు. అయినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన పనిమనిషి పోలీసులకు ఫోన్ చేసి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాణీ జయరాం స్పృహ లేకుండా కింద పడిపోయి ఉన్నారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. అయితే ఆమె ముఖంపై తీవ్ర గాయాలు ఉండడంతో ఎవరో కొట్టి చంపారని పోలీసులు భావిస్తున్నారు. పనిమనిషి చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్లాట్‌ను ఆధీనంలోకి తీసుకుని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ టీవి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వారం రోజులుగా ఏం జరిగిందనేది పోలీసులు ఆరా తీస్తున్నాన్నట్లు తెలుసోంది. ఆమె పేరుమీద ఏవైనా విలువైన ఆస్తులున్నాయా? ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం హఠాన్మరణం చెందారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం ఆమె తుదిశ్వాస విడిచారు. కళాతపస్వి విశ్వానాథ్ మరణం నుంచి కోలుకోకముందే వాణీజయరాం మరణంతో మరోసారి సినీ పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. కాగా చెన్నైలో జన్మించిన ఆమె దాదాపు వెయ్యి సినిమాల్లో పది వేలకుపైగా పాటలు పాడారు. తెలుగు, తమిళంతో కలిపి 14 భాషల్లో 5 దశాబ్దాలుగా వాణీ జయరాం వెండితెరకు తన గ్రాత్రాన్ని అందించారు. ఇక సినీ పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గానూ ఇటీవల భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషన్ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డును అందుకోకముందే వాణీ మృతి చెందడం విచారకరం. కాగా 1945 నవంబర్ 30న తమిళనాడులోని వేలూరులో జన్మించారు వాణీ జయరాం. ఆమె అసలు పేరు కలైవాణి. 1971లో ఆమె గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. రంగరామానుజా అయ్యంగార్ వద్ద ఆమె శాస్త్రీయ సంగీతంతో శిక్షిణ తీసుకున్నారు. కర్ణాటక సంగీతంలో సాధన చేసిన ఆమె 8 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా రెడియోలో పాట పాడి మురిపించారు. కె విశ్వనాథ్ తీసిన స్వాతికిరణం చిత్రంలో ఆమె 8 పాటలు పాడారు. ఇక ఆమె పాడిన తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అంటూ ఆమె కంఠం స్వరమాధుర్యాలను వెదజల్లింది. భక్తి సంగీత ప్రధానమైన పాట అనగానే దర్శకులకు గుర్తొచ్చేది వాణీ జయరాం. అంతగా తన గాత్రంతో 5 దశాబ్దాలుగా సంగీత ప్రియులను మైమరిపించారు వాణీ జయరాం. చదవండి: మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? -
మద్రాసు అమ్మాయితో హిందీలో పాట..
మల్లెలు, గులాబీల మధ్య ఎప్పుడూ ఒక సన్నజాజి పువ్వు ఉంటుంది. కోకిలలు, మైనాల మధ్య పేరును పట్టించుకోని ఒక పిట్ట గానం ఉంటుంది. పూజలు చేయ పూలు తెచ్చాను... విధి చేయు వింతలెన్నో... ఇన్ని రాశుల యునికి... తెలిమంచు కరిగింది తలుపు తీయరా... ఇన్ని పాటలతో వాణి జయరామ్ తెలుగు ప్రేక్షకులతో ఎన్నెన్నో జన్మల బంధం వేశారు. చెన్నైలో చదువుకుని, హైదరాబాద్‌లో బ్యాంక్ ఉద్యోగం చేసిన వాణి జయరాం తెలుగువారి ఇష్టగాయనిగా మారి దశాబ్దాలు అవుతోంది. నవంబర్ 30న ఆమెకు 75 నిండుతాయి. ప్రతి వసంతంలోనూ పాటల కొమ్మలను విస్తరించుకుంటూ వెళ్లిన ఈ నిరాడంబర వృక్షం తల ఎత్తి చూడదగ్గది. ఈ సందర్భాన తలుచుకోదగ్గది. రేడియో సిలోన్లో బినాకా గీత్‌మాలా ఊపేస్తోంది. అమిన్ సయానీ మొదలెట్టిన షో ప్రతి వారం హిందీలో విడుదలైన జనరంజకమైన పాటల్ని ప్లే చేసి టాప్ లిస్ట్‌ను ఇస్తూ ఉంటుంది. మేల్ సింగర్స్ అయితే దాదాపుగా రఫీ ఉంటాడు. ఫిమేల్ సింగర్స్ అయితే లతా మంగేష్కర్ సింహాసనం వేసుకుని కూచుని ఉంటుంది. అలాంటి షోలో ఒకవారం అయినా తమ పాట వినపడాలని ప్రతి గాయని, గీత కర్తా, సంగీత దర్శకుడు భావిస్తున్న సమయాన ఒక మద్రాసు అమ్మాయి హిందీలో ఒక పాట పాడింది. ఆ పాట ఆ అమ్మాయికి మొదటి పాట. అది బయటకు విడుదల అయ్యింది. లతా కాకుండా, ఆశా భోంస్లే కాకుండా హిందీలో మరొకరు, అందునా ఒక సౌత్ అమ్మాయి పాడటమా అని జనానికి వింత. అది బినాకాకు ఎక్కడం మరీ వింత. ఒక వారం కాదు రెండు వారాలు కాదు 16 వారాలు ఆ పాట చార్ట్ బస్టర్‌గా నిలవడం ఇంకా వింత. ఆ వింతను సాధించిన గాయని వాణి జయరామ్. బాలీవుడ్ ఎగిరిన తొలి దక్షిణాది గాన పతాక. ఆ సినిమా ‘గుడ్డి’. ఆ పాట ‘బోల్రే పపీ హరా’. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుదని అంటారు పెద్దలు. ఎదిగే బుద్ధి ఉన్న వారు మౌనంగా ఉంటారని కూడా అంటారు. వాణి జయరామ్‌కు సంగీతం ఎంత తెలుసో చాలామందికి తెలియదు. ఆమె ఎప్పుడూ పెద్దగా చెప్పుకోదు. కాని పాటను సాంతం తన చేతిలోకి తీసుకున్నట్టుగా ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె తల్లి గాయని. తమిళనాడులోని వేలూరులో తన 9 మంది సంతానంలో ఐదవ బాలికగా జన్మించి వాణిలో ఆమె సంగీతాన్ని పసిగట్టింది. ఐదేళ్లకే వాణి కీర్తనలు పాడేది. చెదరకుండా ఆలాపన కొనసాగించేది. నేను అంతగా సక్సెస్ చూడలేకపోయాను నా కూతురైనా చూడాలి అని వాణికి పదేళ్లు వచ్చేసరికి కుటుంబాన్ని మద్రాసుకు మార్చిందామె. అక్కడే వాణి క్లాసికల్ గురుముఖతా నేర్చుకుంది. మరో ఒకటి రెండేళ్లకే మూడు గంటల కచేరీ ఇవ్వడం కూడా మొదలెట్టింది. మద్రాసులోని మహా సంగీతకారుల దగ్గర వాణి పాఠాలు నేర్చుకుని వచ్చిన విద్యను ఆడంబరంగా ప్రదర్శించరాదని గ్రహించి వినయంగా ఉండటం నేర్చుకుంది. వాణి చాలా చురుకైన స్టూడెంట్. మద్రాసులో బి.ఏ ఎకనామిక్స్ చేసింది. ఎన్నడూ ఏమీ మాట్లాడనట్టుగా కనిపించే ఆమె కాలేజీలో డిబేట్స్ కోసం వేదిక ఎక్కితే అవతలి పక్షం ఓటమి అంగీకరించి నోరు మెదపక దిగిపోయేది. చదువులో టాపర్ అయిన వాణికి స్టేట్ బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఏదో కచేరిలో పాడుతుంటే చూసిన ఒకామె ఈమె నా కోడలు అని నిశ్చయించుకుని తన కుమారుడు జయరామ్‌ను ఆమెకు భర్తగా ఇచ్చింది. వాణి కొన్నాళ్లు హైదరాబాద్‌లో కూడా ఉద్యోగం చేసి ఆ తర్వాత ముంబై ట్రాన్స్ఫర్ అయితే ముంబైకి వెళ్లింది. అక్కడే ఆమె గాయనిగా మొదటిసారి వెలిగింది. వాణి భర్త జయరామ్‌కు సంగీతప్రియుడు. ఆయనకు సితార్ వాదన తెలుసు. ‘వాణి జయరామ్’గా మారిన భార్యకు హిందూస్తానీ కూడా వచ్చి ఉంటే బాగుంటుందని అక్కడే ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ ఖాన్ దగ్గర సంగీత పాఠాలకు పెట్టాడు. ఉస్తాద్ ఆమె పాటలు విని అమ్మా... ఇంకా ఆ దండగమారి బ్యాంకు ఉద్యోగం ఎందుకు... బంగారం లాంటి నీ గొంతు ఉండగా అని సంగీతం నేర్పించి, సంగీత దర్శకుడు వన్రాజ్ భాటియాకు ఆమెను పరిచయం చేశాడు. వన్రాజ్ భాటియా అప్పుడే తాను సంగీతం చేస్తున్న ‘గుడ్డి’ సినిమా కోసం దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ, రచయిత గుల్జార్‌లను వాణి జయరామ్ తొలి పరిచయానికి ఒప్పించాడు. అలా వాణి జయరామ్ దేశానికి ఒక ప్రభాత గీతంగా, భక్తి గీతంగా దేశానికి తెలిసింది. కాని లతా మంగేశ్కర్, ఆశా భోంస్లే కెరీర్లో పోటాపోటీగా ఉన్న సమయంలో మరో చెల్లెలు ఇలా ప్రత్యక్షం కావడం అంత ప్రసన్నం కలిగించే విషయంగా భావించలేకపోయారు. సంగీత దర్శకుల, గాయకుల లాబీలో గొప్ప ప్రతిభ ఉన్నా అక్కడ వాణి జయరామ్ నిలువలేకపోయింది. పోనీ.. ఈ గంధం దక్షణాది గడపలకే సొంతమని విధి రాసి పెట్టి ఉందేమో మద్రాసుకు వచ్చేసింది. అటు పిమ్మట వాణి జయరామ్ గొంతు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో పాలు కలిపిన మామిడి పండు రసం రుచిని పాటలలో పంచింది. ఎస్.పి.బాలూకు పాడే అవకాశం ఇచ్చిన కోదండపాణీయే ‘అభిమానవంతులు’ సినిమాతో వాణి జయరామ్‌కు తొలి అవకాశం ఇచ్చాడు. కాని ఈ గొంతు గాన పూజకు వచ్చిందని ‘పూజ’ సినిమాయే తెలుగు ప్రేక్షకులకు చెప్పింది. రాజన్ – నాగేంద్ర చేసిన ‘పూజ’ పాటలు తెలుగు దేశాన మోగిపోయాయి. ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ పాటను ప్రతి ఉదయం నాష్టా పొయ్యి మీద పెడుతూ, మధ్యాహ్నం భోజనాలు వడ్డిస్తూ, రాత్రిళ్లు పిల్లలకు పక్కలు సిద్ధం చేస్తూ ఇల్లాళ్లు వేలాదిసార్లు విన్నారు. వింటున్నారు. ఆ సినిమాలోని ‘నింగి నేలా ఒకటాయెనే’, ‘పూజలు చేయ పూలు తెచ్చాను’... పాటలూ వాణి జయరామ్ గొంతు గిరాకీని శ్రోతల్లో పెంచాయి. అయితే తెలుగులో ఆమె ప్రవేశం, కొనసాగింపు స్థిరంగా లేదు. సుశీల, జానకీ ‘హీరోయిన్ల గొంతు’గా స్థిరపడి ఉన్నారు. వారిని దాటి వాణి జయరామ్‌కు చోటు దొరకడం అన్నిసార్లు జరిగేది కాదు. కాని జరిగిన ప్రతిసారీ చిన్న చిరునవ్వుతో, గోరింటాకు పెట్టుకుని పండిన ఎడమ చేతిని ఊపుతూ పాడి మార్కులు ఎగరేసుకొని పోయేది. ‘ఈ రోజు మంచి రోజు’ (ప్రేమ లేఖలు), ‘విధి చేయు వింతలెన్నో’ (మరో చరిత్ర), ‘నువ్వు వస్తావని బృందావని’ (మల్లెపూవు), ‘హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే’ (మొరటోడు), ‘నీలి మేఘమా జాలి చూపుమా’ (అమ్మాయిల శపథం), ‘సీతే రాముడి కట్నం’ (మగధీరుడు)... ఈ పాటలన్నీ సిగన మల్లెలు ముడుచుకున్న వనితలా గుమగుమలాడుతూ భావతరంగాల కిందా మీదకు కారణమయ్యేవి. వాణి జయరామ్ గొంతులోని విశిష్టత ఏమిటంటే అది స్త్రీలకూ సరిపోయేది. యంగ్ అడల్ట్స్కూ సరిపోయేది. ఇది గమనించిన దర్శకుడు కె.విశ్వనాథ్ ‘శంకరాభరణం’, ‘స్వాతికిరణం’, ‘శృతిలయలు’ సినిమాలలో ఆమె గొంతును సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఆ సినిమాలకు ఆమె గొంతు కేవలం పాటగా మాత్రమే కాదు కథాబలంగా కూడా ఉపయోగపడింది. ‘శంకరాభరణం’లో ‘బ్రోచే వారెవరురా’, ‘మానస సంచరరే’, ‘ఏ తీరుగ నను దయ చూసెదవో’.. ఈ పాటలన్నీ ఆమెకు అవార్డులు తెచ్చి పెట్టాయి. ‘స్వాతి కిరణం’లో మాస్టర్ మంజునాథ్‌కు మేచ్ అయ్యేలా వాణి జయరామ్ పాడిన ‘తెలి మంచు కరిగింది’, ‘ఆనతినీయరా’, ‘ప్రణతి ప్రణతి ప్రణతి’, ‘కొండ కోనల్లో లోయల్లో’... అద్భుతం. పునరావృతం లేని కళ అది. వాణి జయరామ్ గొంతు భిన్న సందర్భాల పాటగా వెలిగింది. ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా’ (వయసు పిలిచింది), ‘మిన్నేటి సూరీడు వచ్చెను మా పల్లె’ (సీతాకోకచిలుక), ‘నేనా పాడనా పాట’ (గుప్పెడు మనసు), గీతా ఓ గీతా (శివమెత్తిన సత్యం)... వీటన్నింటికి గట్టి అభిమానులు ఉన్నారు. స్ట్రయిట్ పాటలే కాదు తెలుగు డబ్బింగ్ గీతాలు కూడా వాణి జయరామ్‌ను తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంచాయ్. ఆమె పాడిన ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ) చిత్రలహరిలో జనం వేయిసార్లు చూశారు. వాణి జయరామ్ సింపుల్‌గా ఉండటమే ఘనత అని నమ్ముతారు. ఆమెకు చాలా భాషలు వచ్చు. కవిత్వం రాస్తారు. భజనలు రాస్తారు. సినిమా కథలు కూడా తయారు చేస్తారు. ఆమె జగతితో తానుగా కాక పాటతో సంభాషించాలని కోరుకుంటారు. తీయటి గాయని వాణి జయరామ్ పాటకు ప్రత్యక్షంగా సేవ చేసి పరోక్షంగా మానవ స్వాంతనకు దోహదపడ్డారు. ఆమె 75 ఏళ్లు నిండిన సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. హృదయాలను సంగీతమయం చేస్తూనే ఉండమని కోరుకోవాలి. దొరకునా ఇటువంటి సేవ..నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ...– సాక్షి ఫ్యామిలీ -
గాయని వాణిజయరామ్కు పతీవియోగం
సినిమా: ప్రఖ్యాత గాయని వాణీజయరామ్ భర్త జయరామ్ సోమవా రం ఉదయం చెన్నై సమీపంలోని వేలూ రులో కన్నుమూశా రు. వేలూరుకు చెంది న వాణిజయరామ్ అసలు పేరు కలైవాణి. వివాహానంతరం తన పేరులోని వాణికి భర్త పేరును చేర్చుకుని వాణీజయరామ్గా మార్చుకున్నారు. వివాహానంతరం వాణిజయరామ్ గాయనిగా మరింత ఎదిగారు. ఆయన వాణిజయరామ్ను గాయనిగా ఎంతగానో ప్రోత్సహించారు. వివాహానంతరం వాణిజయరామ్ భర్తతో కలిసి కొంత కాలం ముంబయిలో మకాం పెట్టారు. అనంతరం మళ్లీ వేలూ రుకు తిరిగి వచ్చేశారు. వాణిజయరామ్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో 10 వేలకు పైకా పాటలు పాడారు. కాగా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జయరామ్ సోమవారం తుది శ్వాస విడిచారు.ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
నవంబర్ 30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: వాణీజయరామ్ (గాయని), నిషాకొటారి (బాలీవుడ్ నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. వీరు ఈ సంవత్సరం స్థిరాస్తులు కొంటారు. వారసత్వ ఆస్తిపాస్తులు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు వస్తాయి. కోర్టుకేసుల నుండి విముక్తి లభిస్తుంది. అయితే న్యాయసంబంధమైన వివాదాలలో ఇరుక్కుంటే బయట పడటం అంత సులభం కాదు కాబట్టి రాజీ ధోరణితో వ్యవహరించడం మంచిది. మేనేజ్మెంట్ రంగంలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లు, ఫైనాన్స్ రంగ ంలోని వారు, పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పుంజుకుంటారు. వీరి పుట్టిన తేదీ 30. ఇది బృహస్పతి సంఖ ్య కాబట్టి జన్మతః నిశిత పరిశీలన, సృజనాత్మకత కలిగి ఉండి, మేధావిగా, కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. ఆపేసిన చదువును, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్లు: 1,2, 4,5,6,8; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, శాండల్ బ్లూ, వయోలెట్; లక్కీ డేస్: గురు, శుక్ర, శని, ఆది, సోమ వారాలు. సూచనలు: కోపాన్ని, నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవడం, సర్పసూక్త సహిత రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం, మతగురువులను, పెద్దలను గౌరవించటం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఎన్నెన్నో జన్మల బంధం
భాగ్యనగరంతో తనది ‘ఎన్నెన్నో జన్మలబంధం’ అంటున్నారు సుప్రసిద్ధ గాయని వాణీ జయరామ్. ైప్రెడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు అందుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. నగరంతో తనకు గల అనుబంధంపై ‘సిటీప్లస్’తో వాణీ జయరామ్ పంచుకున్న జ్ఞాపకాలు ఆమె మాటల్లోనే... - వాణీజయరామ్ మా అన్నయ్య హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవారు. అందుకని ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండేవాళ్లం. నేను కోఠీ ఎస్బీఐలో పనిచేశా. నా పెళ్లి సికింద్రాబాద్‌లో జరిగింది. నా మనసులో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. హైదరాబాద్‌తో నాది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంటుంది. నా అసలు పేరు కలైవాణి. జయరామ్‌తో పెళ్లి తర్వాత వాణీ జయరామ్‌గా మారాను. జయరామ్ ఉద్యోగరీత్యా ఆయనతో పాటే బాంబే వెళ్లాను. అయితే, పీబీ శ్రీనివాస్ పురస్కారం, పి.సుశీల ట్రస్టు పురస్కారం, ఫిలింఫేర్ ఫర్ సౌత్ నుంచి గత ఏడాది లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వంటి సత్కారాలను హైదరాబాద్‌లోనే అందుకున్నాను. తెలుగులో నా పాటలన్నీ హిట్... తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు సహా 19 భాషల్లో పాడాను. తెలుగులో నా పాటలన్నీ హిట్ అయ్యాయి. ‘శంకరాభరణం’ వంటి మహోన్నతమైన సినిమాలో పాడాను. రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారం అందుకున్నాను. అయితే, నాకు తొలి హిట్ ఇచ్చింది తమిళ సాంగ్... అసలంతా దేవుడి దయ. నేను పుట్టిన పది రోజులకు మా నాన్న ఒక జ్యోతిషుడిని సంప్రదించారు. గత జన్మలో కార్తికేయునికి ఎక్కువసార్లు పంచామృతాభిషేకం చేసింది కాబట్టి, ఈ జన్మలో వాయిస్ తేనెలా ఉంటుందని, పెద్ద సింగర్ అవుతుందని అప్పుడే చెప్పారట. ఆ జ్యోతిషుడు చెప్పినట్లే జరిగింది. తెలుగువారంటే ప్రేమ..! ఏ రాష్ట్రంలో ఉన్నా, నాకు తెలుగు వారంటే ఎంతో ప్రేమ. ఆంధ్రా ఫుడ్ కారంగా ఉంటుంది. బాంబే, చెన్నైలలో ప్రజలు తెలుగు కల్చర్ అంటే ఇష్టపడతారు. తెలుగు గాయనీ గాయకుల్లో నాకు సుశీల, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే అభిమానం. అలాగే, ఇక్కడి వస్త్రాలంటే నాకు ఇష్టం. ముఖ్యంగా గద్వాల, చీరాల తదితర ప్రాంతాల చీరలంటే చాలా ప్రీతి. - కోన సుధాకర్‌రెడ్డి -
వాణీజయరాంకు పి.సుశీల అవార్డ్
ప్రఖ్యాత గాయని పి.సుశీల పేరిట ప్రతి ఏడాదీ అందించే ‘పి.సుశీల అవార్డు’ను ఈ ఏడాది మరో ప్రఖ్యాత గాయని వాణీజయరాం అందుకోనున్నారు. గాయని రావు బాలసరస్వతీదేవి అధ్యక్షురాలిగా, గాయని జమునారాణి, సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్ సభ్యులుగా ఏర్పడిన జ్యూరీ... ఆమెను ఎంపిక చేశారు. అవార్డు పేరిట లక్ష రూపాయిలు నగదు, జ్ఞాపిక, నూతన వస్త్రాలు బహుకరించబడతాయని, ఈ నెల 9న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం మొదలవుతుందని అవార్డు కమిటీ తెలిపింది. ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్పీ శైలజ, ఎం.ఎం.శ్రీలేఖ, సునీత, కౌశల్య తదితర ప్రముఖ గాయనీమణులచే సంగీత విభావరి కూడా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మండలి బుద్ధప్రసాద్, జమున, తనికెళ్ల భరణి, మంజుభార్గవి ఈ కార్యక్రమానికి అతిథులుగా రానున్నారు.