వాణీజయరాంకు పి.సుశీల అవార్డ్
వాణీజయరాంకు పి.సుశీల అవార్డ్
Published Mon, Dec 2 2013 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
ప్రఖ్యాత గాయని పి.సుశీల పేరిట ప్రతి ఏడాదీ అందించే ‘పి.సుశీల అవార్డు’ను ఈ ఏడాది మరో ప్రఖ్యాత గాయని వాణీజయరాం అందుకోనున్నారు. గాయని రావు బాలసరస్వతీదేవి అధ్యక్షురాలిగా, గాయని జమునారాణి, సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్ సభ్యులుగా ఏర్పడిన జ్యూరీ... ఆమెను ఎంపిక చేశారు. అవార్డు పేరిట లక్ష రూపాయిలు నగదు, జ్ఞాపిక, నూతన వస్త్రాలు బహుకరించబడతాయని, ఈ నెల 9న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం మొదలవుతుందని అవార్డు కమిటీ తెలిపింది. ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్పీ శైలజ, ఎం.ఎం.శ్రీలేఖ, సునీత, కౌశల్య తదితర ప్రముఖ గాయనీమణులచే సంగీత విభావరి కూడా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మండలి బుద్ధప్రసాద్, జమున, తనికెళ్ల భరణి, మంజుభార్గవి ఈ కార్యక్రమానికి అతిథులుగా రానున్నారు.
Advertisement
Advertisement