
భర్త జయరామ్‌తో వాణిజయరామ్ (ఫైల్‌ఫోటో)
సినిమా: ప్రఖ్యాత గాయని వాణీజయరామ్ భర్త జయరామ్ సోమవా రం ఉదయం చెన్నై సమీపంలోని వేలూ రులో కన్నుమూశా రు. వేలూరుకు చెంది న వాణిజయరామ్ అసలు పేరు కలైవాణి. వివాహానంతరం తన పేరులోని వాణికి భర్త పేరును చేర్చుకుని వాణీజయరామ్‌గా మార్చుకున్నారు. వివాహానంతరం వాణిజయరామ్ గాయనిగా మరింత ఎదిగారు. ఆయన వాణిజయరామ్‌ను గాయనిగా ఎంతగానో ప్రోత్సహించారు. వివాహానంతరం వాణిజయరామ్ భర్తతో కలిసి కొంత కాలం ముంబయిలో మకాం పెట్టారు.
అనంతరం మళ్లీ వేలూ రుకు తిరిగి వచ్చేశారు. వాణిజయరామ్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో 10 వేలకు పైకా పాటలు పాడారు. కాగా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జయరామ్ సోమవారం తుది శ్వాస విడిచారు.ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.