సుప్రసిద్ధ గాయని వాణీ జయరాం మరణంతో అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఐదు దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో వేలాది పాటలు ఆలపించిన ఆ గొంతు.. ఆగిపోయిందన్న విషయాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె పుట్టి పెరిగింది చెన్నైలో అయినప్పటికీ.. హైదరాబాద్‌తో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది. వాణీ జయరాం అన్నయ్య హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేసేవాడు. ఆమె కూడా కోఠీలోని ఎస్‌బీఐ బ్యాంకులో పని చేశారు. వాణీ జయరాం పెళ్లి కూడా సికింద్రాబాద్‌లోనే జరిగింది.
‘నా మనసులో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ నగరంతో నాది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంటుంది. నా అసలు పేరు కలైవాణి. జయరామ్‌తో పెళ్లి తర్వాత వాణీ జయరామ్‌గా మారాను. జయరామ్ ఉద్యోగరీత్యా ఆయనతో పాటే బాంబే వెళ్లాను. అయితే, పీబీ శ్రీనివాస్ పురస్కారం, పి.సుశీల ట్రస్టు పురస్కారం, ఫిలింఫేర్ ఫర్ సౌత్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వంటి సత్కారాలను హైదరాబాద్‌లోనే అందుకున్నాను’ అని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వాణీ జయరాం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment