Vani Jairam
-
హిందీ మూవీలో నేను పాడితే వారం తర్వాత వేరే పాట రీప్లేస్ చేశారు
-
తెలుగు నుంచి వెళ్లి బాలీవుడ్ లో స్టార్ అవ్వడానికి కారణం ఇదే
-
ఈ రోజుల్లో సింగర్స్ చేసే తప్పు అదే: సింగర్ వాణీ జైరామ్
-
లెజెండరి సింగర్ వాణీ జయరాంకు అమూల్ ఘన నివాళి
లెజెండరి సింగర్ వాణీ జయరాం శనివారం(ఫిబ్రవరి 4న) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆమె ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. 5 దశాబ్దాలుగా 14 భాషల్లో తన గాత్రాన్ని అందించారు వాణీ జయరాం. ఇక ఆమె మృతితో భారత చలన చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. తెలగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. చదవండి: వచ్చే వారమే ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్ అలాగే ఆమె మృతికి ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ ఇండియా వినూత్నంగా నివాళులు తెలిపింది. ఆమెకు ప్రత్యేకంగా డూడుల్‌తో సంతాపం తెలిపింది. వాణీ జయరాం పాట పాడుతున్న ఫొటోను డూడుల్‌లో డిజైన్ చేసి ఘన నివాళి అర్పించింది అమూల్. దీనిని తన అధికారిక ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ప్రతి రాగంలో ఆమె కవిత వికసించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. రిప్ వాణీ జయరాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ప్రస్తుతం అమూల్ ట్వీట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆమె డూడుల్ ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 37వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్స్ వచ్చాయి. చదవండి: ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత #Amul Topical: Tribute to legendary playback singer of South Indian cinema pic.twitter.com/jSuzQfndkz — Amul.coop (@Amul_Coop) February 5, 2023 -
ముగిసిన వాణీజయరాం అంత్యక్రియలు.. నివాళులర్పించిన సీఎం
అధికారిక లాంఛనాలతో ప్రముఖ గాయని వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. చెన్నైలోని బేసంట్నగర్ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతకముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. వాణీజయరాం మృతిపై సీఎం సంతాపం తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. ' ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందా. వాణీజయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డ్ కూడా ప్రకటించింది. ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె మరణించడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని అన్నారు. కాగా.. శనివారం చెన్నైలోని ఆమె నివాసంలో మరణించారు. దేశవ్యాప్తంగా దాదాపు 19 భాషల్లో 10 వేలకు పైగా పాటలు ఆలపించారు. అయితే ఆమె మృతిపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆమె ముఖంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. వాణీ భర్త జయరామ్ ఐదేళ్ళ క్రితం (2018లో) మరణించారు. ఈ దంపతులకు పిల్లలు ఎవరూ లేరు. సంగీతమే తమకు పిల్లలు లేని లోటు తీర్చిందని ఆమె చెబుతూ ఉండేవారు. బంధువులే వారసులై ఈ రోజు వాణీ జయరామ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
వాణీ జయరామ్‌కి వాణీ అని ఎందుకు పెట్టారంటే?
దాదాపు ఐదు దశాబ్దాలుగా తన గొంతుతో సంగీత ప్రియుల్ని అలరించిన వాణీ జయరామ్(78) మరణంతో చిత్ర సీమలో విషాదం నెలకొంది. వాణీ జయరామ్ అసలు పేరు ‘కలైవాణి’. పదకొండు మంది పిల్లల్లో ఎనిమిదో సంతానం అయిన వాణి నామకరణ వేడుక చేయడానికి ఆమె తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలొచ్చాయట. దీంతో వాణి పదిరోజుల పాపగా ఉన్నప్పుడు ఓ సిద్ధాంతి దగ్గరకు వెళ్లి మా పాపకు ఏదైనా పేరు సూచించమని అడిగితే ‘పాపకు పూర్వజన్మ పుణ్యఫలం ఉంది. దేవుణ్ణి తేనెతో అభిషేకాలు చేసింది. అందుకే ‘కలైవాణి’ అని పేరు పెట్టండి’ అని ఆ సిద్ధాంతి చెప్పారట. ఆ సమయంలో సిద్ధాంతి మాటలకు దురైస్వామి హాయిగా నవ్వుకున్నప్పటికీ, పాప భవిష్యత్తు గురించి ఇప్పుడే కలలు కనడం ఎందుకని అనుకున్నారట. కానీ పేరు మాత్రం కలైవాణి అని పెట్టారు. సిద్ధాంతి చెప్పినది నిజం అయింది. సినీ గాయనిగా, భక్తి గీతాల గాయనిగా వాణి ఎంతటి విశేష ప్రతిభ కనబరిచారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక తన తల్లి పద్మావతి తెలుగువారు కాబట్టి తెలుగులోనూ మంచి పాటలు పాడటం పట్ల వాణి పలు సందర్భాల్లో ఆనందం వ్యక్తం చేశారు. ఇంట్లో ఒప్పించి సినీ గాయనిగా... వాణీ జయరామ్ సంగీత ప్రియుల కుటుంబంలోనే జన్మించినప్పటికీ వారి కుటుంబ సభ్యులకు సినిమా సంగీతం పట్ల మంచి అభిప్రాయం ఉండేది కాదు. సినిమాలు, సినిమా పాటలు వారి ఇంట్లో నిషేధం. సంగీతం అంటే వారి దృష్టిలో శాస్త్రీయ సంగీతమే. అయితే వాణీకి సినిమాల్లో నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకోవాలని కల. కానీ ఆమె తల్లి పద్మావతి ఇష్టపడలేదు. ఇంట్లో ఒప్పించి, స్వయంకృషితో తన కలను నెరవేర్చుకున్నారు వాణి. కూతురి కీర్తి చూసి, తల్లి సంతోషించారు. అయితే వాణి విజయాలను ఆమె తండ్రి దురైస్వామి చూడలేకపోయారు. 1969లోనే ఆయన మరణించారు. తన సక్సెస్‌ను తండ్రి చూడలేకపోవడం కాస్త బాధ కలిగించిందని వాణి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. -
మూగబోయిన వాణి
‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’.. ఎంత కమ్మని గొంతు. ఉషోదయం వేళ మనసుని ఉల్లాసంగా తట్టిలేపే మృదు మధురమైన కంఠస్వరం వాణీ జయరామ్ సొంతం.. అలాంటి ఆ కంఠస్వరం మూగబోయింది. ప్రముఖ గాయని వాణీ జయరామ్ (78) కన్నుమూశారు. చెన్నైలోని నుంగంబాక్కమ్లో ఉన్న తన సృగృహంలో అనుమానాస్పద స్థితిలో మరణించారామె. వాణి నుదురు, భుజంపై రక్తపు గాయాలు ఉండడంతో ఆమె మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు ఐపీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంటిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వాణి మృతదేహానికి ఓమందూరార్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం కేసు విచారణ ముమ్మరం అయ్యే సూచనలున్నాయి. తమిళనాడులోని వెల్లూరులో దురైస్వామి, పద్మావతిలకు 1945 నవంబరు 30న జన్మించారు వాణీ జయరామ్. ఆమె అసలు పేరు కలైవాణి. పదకొండు మంది పిల్లల్లో వాణి ఎనిమిదో సంతానం. ఆమె తల్లి పద్మావతి కర్నూలులో జన్మించడంతో వాణికి తెలుగులో పాడటం అలవాటైంది. రంగరామానుజ అయ్యంగార్ వారి వద్ద పద్మావతి సంగీత శిక్షణ పొందారు. తన కుమార్తె వాణిని కూడా ఆయన వద్దే కర్ణాటక సంగీత శిక్షణ కోసం చేర్పించారామె. వెల్లూరులో వాణి నాలుగో తరగతి పూర్తయ్యాక, ఆమెకు మరింత మంచి సంగీత శిక్షణ ఇప్పించేందుకు వారి కుటుంబం చెన్నైకి తరలి వెళ్లింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు జీఎన్ బాలసుబ్రహ్మణ్యం శిష్యుడైన టీఆర్ బాలసుబ్రహ్మణ్యం వద్ద సంగీతం నేర్చుకున్నారు వాణి. తన ఎనిమిదవ ఏటనే మద్రాసులో ఆకాశవాణిలో పాడారు. పదేళ్ల నుంచే పూర్తి స్థాయి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారామె. స్కూలులో 22 వేర్వేరు కళలతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన స్టూడెంట్‌గా అవార్డును పొందారు వాణి. బీఏ ఎకనామిక్స్ చదువుతున్న సమయంలో కళాశాలల స్థాయిలో డిబేట్ కార్యక్రమాల్లో బహుమతులు పొందారామె. చదువు పూర్తయ్యాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై బ్రాంచిలో ఉద్యోగంలో చేరారు వాణి. 1967లో ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆ తర్వాత 1969లో జయరామ్‌ని వివాహం చేసుకుని, ముంబయ్‌కి వెళ్లారు వాణి. భర్త జయరామ్ ప్రోత్సాహంతో ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ వద్ద హిందుస్తానీ శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారామె. ఆ సమయంలోనే బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయి సంగీత సాధనకు సమయాన్ని వెచ్చించారామె. కర్ణాటిక్, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె 1969లో ముంబయ్‌లో తొలి కచేరి ఇచ్చారు. సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్‌కి ఆమె గొంతు నచ్చడంతో 1971లో హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్డి’ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశమిచ్చారు. ఆ చిత్రం కోసం వాణీ జయరామ్ పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాటకు మంచి స్పందన వచ్చింది. వాణికి ‘తాన్సేన్ సమ్మాన్, బెస్ట్ ప్రామిసింగ్ సింగర్, ఆలిండియా సినీగోయర్స్’ వంటి అవార్డులు దక్కాయి. ఇక ‘అభిమానవంతుడు’ (1973) చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీ జయరామ్‌తో పాడించారు దర్శకుడు ఎస్.పి. కోదండపాణి. తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం. 1974లో ముంబయ్ నుండి చెన్నైకి వచ్చి స్థిరపడిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్‌పురి, మరాఠీ, ఒరియా.. ఇలా 14 భాషల్లో పదివేలకుపైగా పాటలు పాడారు. కేవీ మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాథన్ , ఇళయరాజా, పెండాల్య, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు వంటి సంగీత దర్శకుల సినిమాల్లో ఎక్కువ పాటలు పాడారామె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రానికి తొలిసారి జాతీయ పురస్కారం అందుకున్నారామె. ఆ తర్వాత ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే..’ గీతానికి ఆమెకు రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నీయరా హరా..’ పాటకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు వాణి. జాతీయ స్థాయిలోనే తెలుగు, గుజరాతీ, ఒడియా, తమిళ భాషల్లో ప్రాంతీయ స్థాయి ఉత్తమ గాయని అవార్డులు పొందారామె. ‘కలైమామణి, సంగీత పీఠ్ సమ్మాన్, ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవన సాఫల్య పురస్కారం, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, కాముకర అవార్డు, సుబ్రహ్మణ్య భారతి అవార్డు, ఘంటసాల జాతీయ పురస్కారం, దక్షిణ భారత మీరా అవార్డు’ వంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు వాణీ జయరామ్. సినిమా పాటలే కాదు.. ఎన్నో భక్తి గీతాలను, లలిత గీతాలను ఆలపించారు వాణి. ‘మొరటోడు’ చిత్రంలోని ‘హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే’ పాటతో పాటు ‘ప్రేమలేఖలు’లోని ‘ఈరోజు మంచిరోజు’ అంటూ సుశీలతో కలసి పాడిన పాట తనకెంతో ఇష్టం అని వాణి గతంలో పేర్కొన్నారు. తమకు పిల్లలు లేకున్నా ఆ లోటును సంగీతమే తీర్చిందని చెప్పేవారామె. వాణి భర్త జయరామ్ 2018లో మృతి చెందారు. కాగా సంగీత రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022కిగాను ఇటీవల ‘పద్మ భూషణ్’ అవార్డు ప్రకటించింది. అయితే ఆ పురస్కారాన్ని స్వీకరించకుండానే వాణి ఈ లోకాన్ని వదిలి వెళ్లడం బాధాకరం. ఆమె మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భర్త ప్రోత్సాహంతో... ప్రతి మగాడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు. కానీ వాణీ జయరామ్ విజయం వెనక ఆమె భర్త జయరామ్ ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా సంగీతంలో ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ముంబయ్‌లోని ఇండో–బెల్జియం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా చేసిన జయరామ్ సంగీతప్రియులు. పండిట్ రవిశంకర్ దగ్గర ఆరేళ్లు ఆయన సితార్ నేర్చుకున్నారు. వాణీతో వివాహం తర్వాత తన భార్యలోని సంగీత ప్రావీణ్యతను గుర్తించారు జయరామ్. ఆల్రెడీ కర్ణాటిక్, శాస్త్రియ సంగీతాలను ఔపోసన పట్టిన ఆమెను హిందుస్థానీ సంగీతాన్ని కూడా నేర్చుకోవాలని కోరారు జయరామ్.కేవలం నేర్చుకోమని చెప్పడమే కాకుండా.. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ దగ్గర సంగీత పాఠాలు నేర్పించారు. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ శిష్యరికంలో ఆరు నెలల కఠోర శిక్షణ తర్వాత హిందుస్థానీ సంగీతంలో కూడా వాణి ప్రతిభ చూపారు. 18 గంటల పాటు ఏకధాటిగా శిక్షణ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక బ్రహ్మాండంగా కచేరీలు చేసుకోవచ్చని వాణీకి భరోసా ఇచ్చారు రహమాన్. ఆత్మవిశ్వాసం, గురువు రహమాన్ ఇచ్చిన భరోసాతో చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి పలికారు వాణి. 1969లో తొలిసారిగా ముంబయ్‌లో కచేరి ఇచ్చారామె. ఆ తర్వాత సినీ గాయనిగా ఎంతో బిజీ అయ్యారు. సంగీతమే సంతానం... వాణీ జయరామ్ దంపతులకు సంతానం లేరు. సంగీతాన్నే సంతానంలా భావించారు. ‘‘సంగీతంతో సంతానం లేని లోటు తీరిపోయిందనుకుంటాం’’ అని పలు సందర్భాల్లో వాణి పేర్కొన్నారు. కొత్త నాయికలకు ఆ వాణీయే... ఓ కొత్త హీరోయిన్ వెండితెరకు పరిచయం అవుతుందంటే వెంటనే వాణీ జయరామ్‌కు కబురు వెళ్లేది. అలా పలువురు హీరోయిన్లు నటించిన తొలి సినిమాకు పాటలు పాడారు వాణీ జయరామ్. శ్రీదేవి హీరోయిన్గా పరిచయమైన తొలి తమిళ (‘మూండ్రు ముడుచ్చు – ‘ఆడి వెళ్లి’), హిందీ (సోల్వా సావన్ – గోరియా హో గోరియా) చిత్రాల్లో పాటలు పాడారు వాణీ జయరామ్. అలాగే షబానా ఆజ్మీ, జూహీ చావ్లా, పర్విన్ బాబీ, జయబాధురీ హీరోయిన్లుగా పరిచయం అయిన తొలి చిత్రాలకు వాణీ జయరామ్ పాటలు పాడారు. వాణి తెలుగు హిట్ సాంగ్స్ కొన్ని... ► అభిమానవంతులు – ‘ఎప్పటివలె కాదురా నా సామి...’ ► ‘స్వాతి కిరణం’ – తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఆనతినీయరా హరా.., శివానీ భవానీ.. ► ‘శంకరాభరణం’ – దొరకునా ఇటువంటి సేవ.., ఏ తీరుగ నను.., ► పలుకే బంగారమాయెనా.. ► ‘పూజ’ – పూజలు చేయ పూలు తెచ్చాను... ► ‘సీతామాలక్ష్మి’ – ఏ పాట నే పాడను... ► శ్రుతిలయలు – ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్... ► ‘తిరుపతి’ – తప్పెట్లోయి తాళాలోయి ► ‘సీతాకోక చిలుక’ – సాగర సంగమమే..., అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి ► ‘స్వర్ణకమలం’ – అందెల రవమిది పదములదా... ► ‘మంగమ్మగారి మనవడు’ – శ్రీ సూర్యనారాయణ మేలుకో... ► ‘గుప్పెడు మనసు’ – నేనా పాడనా పాట.. మీరా అన్నదీ మాట.. ► ‘ఘర్షణ’– ఒక బృందావనం సోయగం... అది దైవ సంకల్పం 1970 నుంచి 1990 వరకూ బిజీ గాయనిగా సాగిన వాణీ జయరామ్ ఆ తర్వాత కాస్త స్లో అయ్యారు. కాగా పలు భాషల సినిమాలకు పాడుతూనే మరోవైపు ఎన్నో భజన పాటలు కూడా పాడారు వాణి. ‘అది పూర్తిగా దైవ సంకల్పం. ఆ దేవుడికి ధన్యవాదాలు. భజనలు పాడినప్పుడు నా మనసెంతో ఆనందంగా ఉంటుంది’ అని పలు సందర్భాల్లో ఆమె పేర్కొన్నారు. హిందీలో తొలి చిత్రం ‘గుడ్డి’కి తొలుత ఆమె పాడినది భజన పాటే. అయితే సినిమా విడుదల తర్వాత చూస్తే సిల్వర్ స్క్రీన్‌పై ఆ పాట వినబడలేదు. అలా ఎందుకు జరిగిందో ఎప్పటికీ అర్థం కాలేదని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు. ఈ ఒక్క పాటే కాదు.. వాణి పాడిన పాటల్లో తెరపై వినిపించనవి ఎన్నో ఉన్నాయి. ‘ఇలాంటివాటి గురించి తలచుకుంటే బాధ రెట్టింపు అవుతుందే కానీ, తగ్గదు. అందుకే వాటి గురించి ఆలోచించను’ అని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు. వాణీ జయరామ్ అంత పాజిటివ్ పర్సన్. ప్రముఖుల నివాళి తన మధురమైన గాత్రంతో సినీ సంగీతానికి విశేష సేవలందించి ఎంతోమంది హృదయాలను గెలిచారు వాణీ జయరామ్‌గారు. పాన్ ఇండియా స్థాయిలో బలమైన శాస్త్రీయ పునాదిని నిర్మించారామె. వాణీగారి మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి.. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాణీ జయరామ్‌గారి మృతి బాధాకరం. 14 భాషల్లో 10 వేలకుపైగా పాటలు పాడిన ఆమె సినీ రంగానికి అందించిన సేవలు మరువలేనివి. ఆమె మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రఖ్యాత భారతీయ సినీ సంగీత గాయనీమణిగా ఖ్యాతి సంపాదించుకున్న ‘కలైమామణి’ వాణీ జయరామ్ మరణ వార్త చాలా బాధించింది. ఆమె లేని లోటును భారతీయ సినిమాలో ఎవరూ భర్తీ చేయలేరు. వాణీ జయరామ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి పదాలకు పదోన్నతి చేకూరేలా ఒక వినూత్నమైన బాణీతో ప్రపంచానికి ఎన్నో పాటలను బహుమతిగా ఇచ్చిన కోకిలలా జీవించిన వాణీ జయరామ్‌గారు ఇప్పుడు ప్రశాంతించారు. ఆవిడ పాటలు మనతోనే ఉంటాయి. – కమల్‌హాసన్ మీరు (వాణీని) నాకు పాడిన తొలి పాటనే మీకు నివాళిగా అర్పిస్తున్నాను. ‘మేఘమే మేఘమే.. పాల్ నిలా తేయందదే. దేగమే తేయినుమ్ తేనొళీ వీసుదే.. ఎనక్కొరు మలర్ మాలై నీ వాంగ వేండుమ్’ (తమిళ చిత్రం ‘పాలవన్న చోలై’లోని పాట.. ఈ చిత్రం తెలుగులో ‘మంచు పల్లకి’గా రీమేక్ అయింది. తెలుగులో ‘మేఘమా..’ పాటని ఎస్. జానకి పాడారు). పాటలో ‘ఎనక్కొరు మలర్ మాలై నీ వాంగ వేండుమ్’ అంటే నాకోసం నువ్వొక పూలదండ కొనాలని అర్థం. ఈ సాహిత్యాన్ని ‘ఉనక్కొరు మలర్ మాలై నాన్ వాంగ వేండుమ్’.. (నీకోసం నేనో పూలదండ కొనాలని అర్థం) అని మార్చి... ‘ఆ పూలదండ దీనికోసమేనా?’ (వాణి మరణాన్ని ఉద్దేశించి) అంటూ ముగించారు. తమిళ ప్రముఖ రచయిత వైరముత్తు. చాలా షాక్‌కి గురి చేసే వార్త ఇది. నమ్మశక్యంగా లేదు. జస్ట్ రెండు రోజుల క్రితమే వాణీ అమ్మతో మాట్లాడాను. నిజమైన లెజెండ్. బలమైన శాస్త్రీయ పునాదితో బహుముఖ ప్రతిభ గల బహు భాషా గాయనిని కోల్పోయాం. – చిత్ర నిన్న (శుక్రవారం) రాత్రే కె. విశ్వనాథ్ సార్ సినిమాల్లో వాణీగారి పాటలు వింటూ, ‘ఎంత అద్భుతంగా పాడారో వినండీ.. అని మా ఆయన (నటుడు శరత్‌కుమార్)తో అన్నాను. ఆ మర్నాడే ఆమె మరణ వార్త విని షాకయ్యాను. – రాధికా శరత్‌కుమార్ ఎంత గొప్ప గాత్రం. చివరిసారిగా ఆమెను కలిసినప్పుడూ ఆ గాత్రంలో అదే స్పష్టత. ‘ఏళు స్వరంగళ్, మల్లిగై, నానే నానా వంటి పాటలతో పాటు నాకు పాడిన ‘మేఘమే మేఘమే’... ఇలా ఆమె పాడిన ఎన్నో పాటలు హృదయాల్లో నిలిచిపోతాయి. – సుహాసినీ మణిరత్నం ► భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రసంశలు పొందారు వాణీ జయరామ్. ఓ కచేరీలో ఇందిరా గాంధీ తన ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నట్లు పలు సందర్భాల్లో వాణి స్వయంగా చెప్పారు. ► హేమమాలిని, వినోద్ ఖన్నా ప్రధాన తారాగణంగా గుల్జార్ దర్శకత్వంలో 1979లో హిందీలో ‘మీరా’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాలో ఉన్న 13 పాటల్లో 12 పాటలను వాణీ జయరామ్ పాడటం విశేషం. ► గంగామహోత్సవ్, స్వామి హరిదాస్ ఫెస్టివల్, ఛండీఘడ్‌లోని పంచకుల, ఛిత్తోడ్ఘడ్లో మీరా ఫెస్టివల్స్.. ఇలా పలు పండగలకు ఆమె కచేరిలు చేశారు. బద్రినాథ్‌లో రెండుసార్లు పాడారు. -
ఆమె వల్లే వాణీ జయరాం మద్రాస్‌కు వచ్చేశారు..!
వాణీ జయరాం గొంతు దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని అలరించింది. దేశంలోని పలు భాషల్లో ఆమె తన గాత్రాన్ని వినిపించింది. ఇటీవలే ఆమె కృషికి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. అయితే ఆమె హఠాన్మరణంతో అవార్డు స్వీకరించకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇవాళ చెన్నైలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలిన వాణీ జయరాం గురించి తెలుసుకుందాం. మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారాలు అందుకున్న వాణీ జయరాం 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరులో ఓ సంగీత కుటుంబంలో వాణీ జయరాం జన్మించారు. పద్మావతి, దొరైస్వామి ఆమె తల్లిదండ్రులు. వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా.. ‘మీ పాప భవిష్యత్తులో సుమధుర గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరు పెట్టమని చెప్పారట. ఆ మాట వినగానే అప్పుడు వాణీ తండ్రి నవ్వుకున్నారు కానీ.. ఆ మాటలు నిజమని తేలడానికి ఎన్నో ఏళ్లు పట్టలేదు. ఆమె దాదాపు 19 భాషల్లో పాటలు పాడింది. 1971లో జయా బచ్చన్ చిత్రం గుడ్డితో అరంగేట్రం చేసిన బోలే రే పాపిహరా పాటతో జైరామ్ సంగీతంలోకి ప్రవేశించారు. అప్పట్లో బాలీవుడ్లో లతా మంగేష్కర్, తెలుగులో సుశీల, జానకి లాంటి గాయకురాలు జోరు కొనసాగుతోంది. అదే సమయంలో తన ప్రత్యేకమైన కంఠస్వరంతో గుర్తింపు సాధించింది వాణీ. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు పదేళ్లపాటు సంగీత ప్రపంచాన్ని శాసించారు. వాణీ జయరాం కెరీర్ హిందీలోనే ప్రారంభమైంది. అందువల్లే ఆమె హీందీ పాటలంటే మొదటి నుంచి ఇష్టం. ఆమె పాటలకు మంచి ఆదరణ రావడంతో తనకు ఎక్కడా పోటీగా వస్తుందేమోనని లతా మంగేష్కర్ చాలా భయపడ్డారు. తొలి చిత్రం గుడ్డితో పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో లతా ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లింది వాణీ జయరాం. కానీ ఆమెను కలిసేందుకు లతా నిరాకరించారు. లతా మంగేష్కర్తో వైరం ఆ తర్వాత 1979లో విడుదలైన మీరా సినిమాతో వారిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. మీరా సినిమాకు రవిశంకర్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు గుల్జార్. అయితే అది లతా మంగేష్కర్‌కు నచ్చలేదు. తన సోదరుడిని సంగీత దర్శకునిగా తీసుకోకపోతే తాను పాటలు పాడేది లేదని తేల్చి చెప్పారు. దీంతో వాణీ జయరాంతో పాటలన్నీ పాడించారు గుల్జార్. అలా వాణీపై లతా మధ్య వైరం పెరిగింది. కొన్నాళ్ల తర్వాత బాలీవుడ్లో రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేశారు వాణీ. తెలుగులో 'అభిమానవంతులు' సినిమాలో 'ఎప్పటివలె కాదురా' అనే పాటతో నన్ను ఎస్పీ కోదండపాణి పరిచయం చేశారు. తెలుగులో పాడిన పాటలు తక్కువే అయినా.. అవన్నీ సూపర్ హిట్ సాంగ్సే. -
హైదరాబాద్‌తో నాది జన్మజన్మల అనుబంధం: వాణీ జయరాం
సుప్రసిద్ధ గాయని వాణీ జయరాం మరణంతో అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఐదు దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో వేలాది పాటలు ఆలపించిన ఆ గొంతు.. ఆగిపోయిందన్న విషయాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె పుట్టి పెరిగింది చెన్నైలో అయినప్పటికీ.. హైదరాబాద్‌తో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది. వాణీ జయరాం అన్నయ్య హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేసేవాడు. ఆమె కూడా కోఠీలోని ఎస్బీఐ బ్యాంకులో పని చేశారు. వాణీ జయరాం పెళ్లి కూడా సికింద్రాబాద్‌లోనే జరిగింది. ‘నా మనసులో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ నగరంతో నాది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంటుంది. నా అసలు పేరు కలైవాణి. జయరామ్‌తో పెళ్లి తర్వాత వాణీ జయరామ్‌గా మారాను. జయరామ్ ఉద్యోగరీత్యా ఆయనతో పాటే బాంబే వెళ్లాను. అయితే, పీబీ శ్రీనివాస్ పురస్కారం, పి.సుశీల ట్రస్టు పురస్కారం, ఫిలింఫేర్ ఫర్ సౌత్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వంటి సత్కారాలను హైదరాబాద్‌లోనే అందుకున్నాను’ అని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వాణీ జయరాం చెప్పారు. -
మిస్టరీగా వాణీ జయరాం మరణం.. హత్య చేశారా?
ప్రముఖ గాయని వాణీ జయరాం(78) మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నుదురు, ముఖంపై తీవ్రగాయాలు ఉండడంతో అమెది సహజ మరణం కాదని.. ఎవరో హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తొలుత ఆమె ఆపస్మారక స్థితిలో పడి చనిపోయారని భావించారు. కానీ ఆమె ముఖంపై ఉన్న గాయాలు, పని మనిషి చెబుతున్న వివరాలు చూస్తుంటే వాణీ జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కూడా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని.. ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అసలేం జరిగింది? చెన్నైలోని నుంగంబాకం ప్రాంతంలో నివాసం ఉంటున్న వాణీ జయరాం చనిపోయిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని పని మనిషి చెబుతున్నారు. శనివారం ఉదయం ఎప్పటి మాదిరిగానే ఇంట్లో పని చేసేందుకు పని మనిషి వాణీ జయరాం ఫ్లాట్‌కి వచ్చింది. తలుపులు మూసి ఉండడంతో కాలింగ్ బెల్ కొట్టారు. అయినా తలుపులు తీయలేదు. దాంతో పనిమనిషి భర్త తన ఫోన్లోంచి వాణీ జయరాం ఫోన్‌కు కాల్ చేశాడు. అయినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన పనిమనిషి పోలీసులకు ఫోన్ చేసి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాణీ జయరాం స్పృహ లేకుండా కింద పడిపోయి ఉన్నారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. అయితే ఆమె ముఖంపై తీవ్ర గాయాలు ఉండడంతో ఎవరో కొట్టి చంపారని పోలీసులు భావిస్తున్నారు. పనిమనిషి చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్లాట్‌ను ఆధీనంలోకి తీసుకుని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ టీవి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వారం రోజులుగా ఏం జరిగిందనేది పోలీసులు ఆరా తీస్తున్నాన్నట్లు తెలుసోంది. ఆమె పేరుమీద ఏవైనా విలువైన ఆస్తులున్నాయా? ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. -
వాణీ జయరాం ముఖంపై తీవ్రగాయాలు.. అసలేం జరిగింది!
ప్రముఖ గాయని వాణీ జయరాం మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నుదురు, ముఖంపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నైలోని ఆమె ఇంటిని స్వాధీనం చేసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పని మనిషి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె ఇంటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరీశీలిస్తున్నారు. ఆమెది సాధారణ మృతి కాదని, ఎవరో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కాలింగ్ బెల్ కొట్టినా తలుపులు తీయకపోవడంతో పగలగొట్టి లోపలికి వెళ్లినట్లు పనిమనిషి పోలీసులకు తెలిపింది. ఇటీవలే ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. -
పాట ఏదైనా సరే.. ఆమె పాడితే ఆణిముత్యమే
వాణీ జయరాం గళం పాడితే ఏ పాటైనా అపురూపమైన ఆణిముత్యంలా జాలు వారాల్సిందే. దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని అలరించింది ఆమె. ఆమె కృషికి ఫలితంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. అయితే ఆమె హఠాన్మరణంతో అవార్డు స్వీకరించకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇవాళ చెన్నైలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలిన వాణీ జయరాం గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని వేలూరులో జననం 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరులో ఓ సంగీత కుటుంబంలో వాణీ జయరాం జన్మించారు. పద్మావతి, దొరైస్వామి ఆమె తల్లిదండ్రులు. వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా.. ‘మీ పాప భవిష్యత్తులో సుమధుర గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరు పెట్టమని చెప్పారట. ఆ మాట వినగానే అప్పుడు వాణీ తండ్రి నవ్వుకున్నారు కానీ.. ఆ మాటలు నిజమని తేలడానికి ఎన్నో ఏళ్లు పట్టలేదు. ఆమె దాదాపు 19 భాషల్లో పాటలు పాడింది. 1971లో జయా బచ్చన్ చిత్రం గుడ్డితో అరంగేట్రం చేసిన బోలే రే పాపిహరా పాటతో జైరామ్ సంగీతంలోకి ప్రవేశించారు. మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారాలు కూడా అందుకుంది. కళా రంగానికి చేసిన సేవలకు గాను జనవరి 25న పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. పదేళ్లకే ఆల్ ఇండియా రేడియోలో అవకాశం ఐదేళ్ల వయసులో కడలూరు శ్రీనివాస అయ్యంగార్ అనే విద్వాంసుని దగ్గర తొలిసారి సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత టి.ఆర్.బాలసుబ్రమణియన్, త్రివేండ్రం ఆర్.ఎస్.మణి లాంటి సంగీత విద్వాంసుల శిక్షణతో మరింత రాటు దేలింది. పదేళ్ల వయసులో తొలిసారి ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకున్నారు వాణీ జయరా.. అక్కడి నుంచే మొదటిసారి తన అమృత స్వరాన్ని బయటి ప్రపంచానికి రుచి చూపించారు. దాదాపు పదేళ్ల పాటు రేడియోలో వరుసగా నాటకాలు వేస్తుండటం.. కవితలు చదవడం.. పాడటం వ్యాపకంగా మారిపోయింది. రేడియో పాటలు పాడిన వాణీ చిన్న వయసులోనే స్కూల్లో ఓ సెలబ్రిటీగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె మనసు సినిమా పాటల వైపు అడుగులు వేసింది. అయితే శాస్త్రీయ సంగీతాన్ని తప్ప సినీ గీతాలు ఆలపించడాన్ని వాణీ కుటుంబసభ్యులు అవమానంగా భావించేవారు. అందుకే రేడియోలో వచ్చే సినిమా పాటల్ని ఎవరికీ వినిపించకుండా తక్కువ సౌండ్ పెట్టుకొని కంఠస్థం చేసేవారట. పెళ్లి తర్వాత భర్త జయరాం ప్రోత్సాహంతో కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె.. 1969లో బాంబేలో తొలి కచేరి ఇచ్చారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. కొత్తగా పాడాలంటే ఆమె తర్వాతే ఎవరైనా ఆమె పాట పాడటం నచ్చి ఎన్నో సంస్థలు కచేరీలకు ఆహ్వానించేవారు. అలా ఓ సందర్భంలోనే సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్ కంటపడ్డారు వాణీజయరాం. ఆయనకు ఆమె గొంతు బాగా నచ్చడంతో ఆమెను గుల్జార్‌కు పరిచయం చేశారు. అనంతరం 1971లో ‘గుడ్డీ’ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశం కల్పించారు. అందులో ఆమె పాడిన ‘బోలే రే’ పాట అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ పాటకు నాలుగు అవార్డులు వచ్చాయి. అలా మొదలైన ఆమె సినీ ప్రస్థానం ఓ ప్రవాహంలా కొనసాగింది. వాణీ జయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు పది వేలకు పైగా పాటలు ఆలపించారు. తెలుగు పరిచయం చేసింది ఆయనే.. వాణీ జయరాం గొంతును తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది మాత్రం ఎస్.పి.కోదండపాణి. ‘అభిమానవంతుడు’ అనే చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీజయరాంతో పాడించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోఫుల్ బిజీ అయిపోయారు వాణీ. కె.బాలచందర్ తీసిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్ర పాటలు వాణీకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ సినిమా పాటలకు తొలిసారి జాతీయ అవార్డు దక్కింది. తెలుగులో ‘శంకరాభరణం’ సినిమాలోని పాటలకు, ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నియ్యరా హరా’.. పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. అప్పట్లో ఏదైనా కొత్తగా పాడించాలంటే వాణీతోనే పాడించాలనుకునేవారట సంగీత దర్శకులు. -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం హఠాన్మరణం చెందారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం ఆమె తుదిశ్వాస విడిచారు. కళాతపస్వి విశ్వానాథ్ మరణం నుంచి కోలుకోకముందే వాణీజయరాం మరణంతో మరోసారి సినీ పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. కాగా చెన్నైలో జన్మించిన ఆమె దాదాపు వెయ్యి సినిమాల్లో పది వేలకుపైగా పాటలు పాడారు. తెలుగు, తమిళంతో కలిపి 14 భాషల్లో 5 దశాబ్దాలుగా వాణీ జయరాం వెండితెరకు తన గ్రాత్రాన్ని అందించారు. ఇక సినీ పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గానూ ఇటీవల భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషన్ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డును అందుకోకముందే వాణీ మృతి చెందడం విచారకరం. కాగా 1945 నవంబర్ 30న తమిళనాడులోని వేలూరులో జన్మించారు వాణీ జయరాం. ఆమె అసలు పేరు కలైవాణి. 1971లో ఆమె గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. రంగరామానుజా అయ్యంగార్ వద్ద ఆమె శాస్త్రీయ సంగీతంతో శిక్షిణ తీసుకున్నారు. కర్ణాటక సంగీతంలో సాధన చేసిన ఆమె 8 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా రెడియోలో పాట పాడి మురిపించారు. కె విశ్వనాథ్ తీసిన స్వాతికిరణం చిత్రంలో ఆమె 8 పాటలు పాడారు. ఇక ఆమె పాడిన తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు అంటూ ఆమె కంఠం స్వరమాధుర్యాలను వెదజల్లింది. భక్తి సంగీత ప్రధానమైన పాట అనగానే దర్శకులకు గుర్తొచ్చేది వాణీ జయరాం. అంతగా తన గాత్రంతో 5 దశాబ్దాలుగా సంగీత ప్రియులను మైమరిపించారు వాణీ జయరాం. చదవండి: మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? -
'లాబీయింగ్ చేయకపోవడం వల్లే ఆస్కార్ రాలేదు'
చెన్నై : ప్రఖ్యాత ఎంఎస్ సుబ్బలక్ష్మీ అవార్డును ప్రముఖ గాయని వాణీజయరామ్ శనివారం అందుకున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మీ అవార్డు అందుకోవటం పూర్వజన్మ సుకృతమని వాణీజయరామ్ అన్నారు. తన పాటలను ఆదరిస్తున్న అభిమానులకు ఆమె ధన్య వాదాలు తెలిపారు. తాను పాడిన పులిమురుగన్( తెలుగులో మన్యం పులి) చిత్రం టైటిల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్ కు ఎంపిక కావటం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తనకు పూజలు చేయటమే తెలుసని, అవార్డుల కోసం లాబీయింగ్ తెలియకపోవడం వల్లే అస్కార్ అందలేదన్నారు. -
స్వర వాణి
-
ఎమ్మెస్ విశ్వనాథన్, వాణీ జయరామ్‌లకు పీబీఎస్ పురస్కారం
అమరగాయకుడు పీబీ శ్రీనివాస్ పురస్కారం-2013 ప్రదానోత్సవం ఆదివారం హైదరా బాద్‌లో జరిగింది. అరుణా అండ్ నృత్య గోపాల్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్‌కు పీబీఎస్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అదే విధంగా ప్రముఖ గాయని వాణీజయరామ్కు పీబీఎస్ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ విద్యాభవన్ వైస్‌ఛైర్మన్ డాక్టర్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ... వెన్నెల రేయిని తలపించేలా వేడుకలు జరిగాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అరుణా అండ్ నృత్యగోపాల్ ఫౌండేషన్ నిర్వాహకులు నృత్యగోపాల్ మాట్లాడుతూ... పీబీఎస్ శ్రీనివాస్ ఆశీర్వాదంతోనే వేదికపై ప్రేక్షకుల ముందు నిలబడే భాగ్యం దక్కిందన్నారు. 2015లోనే చేయాలనుకున్న ఈ కార్యక్రమం 2013లో రెండేళ్లకు ముందుగా దైవ సంకల్పంతోనే చేపట్టినట్లు వివరించారు. ప్రతీయేటా డాక్టర్. పీబీ శ్రీనివాస్ పేరిట జీవిత సాఫల్య పురస్కారం, వార్షిక పురస్కారాలను అందజేస్తామని తెలిపారు. అంతకు ముందు పీబీఎస్ గాన విభావరి జరిగింది. పురస్కారగ్రహీత ఎంఎస్ విశ్వనాథన్ అందరికీ నమస్కారాలు తెలిపారు. పీబీఎస్ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని వాణీజయరామ్ అన్నారు. ఈ సందర్భంగా అరుణా అండ్ నృత్యగోపాల్ ఫౌండేషన్ వారిని అభినందించారు. నటి మంజుభార్గవి మాట్లాడుతూ... నగరంలో ఎన్నో ఆటంకాలు ఉన్నా పురస్కార కార్యక్రమానికి ఇంత పెద్ద స్థాయిలో ప్రేక్షకులు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రముఖ గాయనీ వాణీజయరాం తన గానంతో ప్రేక్షకులను అలరించారు. డ్రమ్స్ విధ్వాంసుడు ఎ. శివమణి తన తనయులైన కుమారన్, సుబేరన్లతో కలిసి చేసిన సంగీత కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్‌తేజ, గుండు హనుమంతరావు, లోటస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ వి.ఎస్.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎం.ఎస్. విశ్వనాథన్, వాణీ జయరాంలకు పీబీ శ్రీనివాస్ పురస్కారం
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ఎం.ఎస్. విశ్వనాథన్, ప్రముఖ గాయని వాణీ జయరాంలను పీబీఎస్ పురస్కారం వరించింది. దివంగత గాయకుడు పి.బి.శ్రీనివాస్ స్మారకార్థం ఏర్పాటుచేసిన ఈ అవార్డును ఈనెల 29వ తేదీన వారిద్దరికీ అందజేస్తారు. పి.బి. శ్రీనివాస్ ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో మరణించిన విషయం తెలిసిందే. నేత్ర చికిత్స సంస్థ అరుణ నిత్యాగోపాల్ ఫౌండేషన్ రవీంద్రభారతిలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ అవార్డు అందజేస్తోంది. సీనియర్ నిర్మాత డి. రామానాయుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. డ్రమ్స్ మాంత్రికుడు శివమణి ప్రదర్శన కూడా ఆ రోజు రవీంద్రభారతిలో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.