
వాణీజయరామ్
చెన్నై : ప్రఖ్యాత ఎంఎస్ సుబ్బలక్ష్మీ అవార్డును ప్రముఖ గాయని వాణీజయరామ్ శనివారం అందుకున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మీ అవార్డు అందుకోవటం పూర్వజన్మ సుకృతమని వాణీజయరామ్ అన్నారు. తన పాటలను ఆదరిస్తున్న అభిమానులకు ఆమె ధన్య వాదాలు తెలిపారు. తాను పాడిన పులిమురుగన్( తెలుగులో మన్యం పులి) చిత్రం టైటిల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్ కు ఎంపిక కావటం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తనకు పూజలు చేయటమే తెలుసని, అవార్డుల కోసం లాబీయింగ్ తెలియకపోవడం వల్లే అస్కార్ అందలేదన్నారు.