MS subbalaxmi
-
'లాబీయింగ్ చేయకపోవడం వల్లే ఆస్కార్ రాలేదు'
చెన్నై : ప్రఖ్యాత ఎంఎస్ సుబ్బలక్ష్మీ అవార్డును ప్రముఖ గాయని వాణీజయరామ్ శనివారం అందుకున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మీ అవార్డు అందుకోవటం పూర్వజన్మ సుకృతమని వాణీజయరామ్ అన్నారు. తన పాటలను ఆదరిస్తున్న అభిమానులకు ఆమె ధన్య వాదాలు తెలిపారు. తాను పాడిన పులిమురుగన్( తెలుగులో మన్యం పులి) చిత్రం టైటిల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్ కు ఎంపిక కావటం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తనకు పూజలు చేయటమే తెలుసని, అవార్డుల కోసం లాబీయింగ్ తెలియకపోవడం వల్లే అస్కార్ అందలేదన్నారు. -
సుబ్బులక్ష్మి గతాన్ని.. సంగీతాన్నీ ప్రేమిద్దాం..!
సాక్షి, హైదరాబాద్: భారతరత్న, సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితం గురించి ప్రపంచానికి తెలియని నూతన ఆవిష్కరణ ప్రముఖ పాత్రికేయుడు టీజేఎస్ జార్జి ఇంగ్లిష్లో రాసిన పుస్తకాన్ని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా ‘మనకు తెలియని ఎం.ఎస్ ’పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్లోని విద్యారణ్య పాఠశాలలో శుక్రవారం జరిగింది. ఈ పుస్తకాన్ని ఓల్గా, కర్ణాటక గాయకుడు టీఎం కృష్ణ ఆవిష్కరించారు. ‘మంథన్’నిరంతర మేధోమథన కార్యక్రమాల్లో భాగంగా సంగీత ప్రియులు, సామాజిక కార్యకర్తల మధ్య దేవదాసి పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు ఎదిగి వచ్చిన ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవన గమనంలోని విషాదానికి కారణమైన సామాజిక అంతరాలను, అణచివేతను ఈ సభలో వక్తలు లోతుగా విశ్లేషించారు. అవలక్షణాలను వదిలించుకోవాలి... ఎంఎస్ సుబ్బులక్ష్మి దేవదాసి అని తెలిసిన తరువాత కూడా ఆమె దేహాన్ని సంగీతం నుంచి విడదీయకుండా, దేవదాసీగా ఆమెను, ఆమె సంగీతాన్ని కలిపి ప్రేమించగలిగే సమాజం రావాలని కర్ణాటక గాయకుడు, మేధావి టి.ఎం.కృష్ణ అన్నారు. ‘సంస్కృతి–సమాజం’అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ కొంద రి అస్తిత్వాన్ని అందరి అస్తిత్వంగా చేసి సంస్కృతిగా చెబుతున్నారని, ఆ సంస్కృతిలోని భిన్నసామాజిక అవలక్షణాలను వదిలించుకోవాలన్నారు. ఓల్గా మాట్లాడుతూ ఈ పుస్తకానికి ముందు ఎం. ఎస్ సంగీతానికి నమస్కరించానని, అయితే, తన స్వగ్రామమైన మధురై నుంచి మద్రాసుకు తన గమ్యాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆమె నిర్ణయాధికార శక్తికి యిప్పుడు నమస్కరిస్తున్నానన్నారు. రచయిత ఆర్.ఎం.ఉమా మహేశ్వర్రావు మాట్లాడుతూ సంస్కరణ, సంస్కారం, ఉన్నతం పేరుతో ఒక సామాజిక వర్గాన్ని కళల నుంచి వెలివేసిన వైనాన్ని విప్పి చెప్పా రు. కళలను అగ్రకుల, ఆధిపత్య వర్గాలకే పరిమితం చేసే ఈ కుట్రే ఎం.ఎస్ ను తన ఇంటినీ, తన ఊరును వదిలి మద్రాసుకి వెళ్ళిపోయేలా చేసిందన్నారు. ఎం.ఎస్ జీవితాన్ని ‘మనకు తెలి యని ఎం.ఎస్’పుస్తక ప్రచురణ ద్వారా తెలుగు వారికి అందిం చిన గీతారామస్వామికి వక్తలు అభినందనలు తెలిపారు. -
నాదయోగి జ్ఞాపకాలు
‘‘రేవతిరాగంలో ‘నానాటి బతుకు నాటకము’ కీర్తన బాణీని కూర్చిన ఒక్క అద్భుతానికే మీకు సంగీత కళానిధి ఇవ్వాల’’ని మురిసిపోతూ ఆయన దగ్గర ఆ పాట నేర్చుకున్నారు విదుషీమణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. కొందరు గొప్పతనాన్ని భుజకీర్తుల్లాగ అలంకరిం చుకుని ఊరేగుతుంటా రు. మరికొందరు మంచి నీళ్ల సెలలాగ వ్యాపించి, పలకరించిన వారికి దప్పి క తీరుస్తూ, హృదయంలో ‘చెమ్మ’ని ఆర్ద్రంగా పంచు తూ ప్రయాణం చేస్తూం టారు. అలాంటి రెండో కోవకు చెందిన మనుషుల్లో మొదటిస్థానంలో నిలిచేవారు నేదునూరి కృష్ణ మూర్తిగారు. ఆయన శ్రీపాద పినాకపాణిగారి వద్ద శిష్య రికం చేసేనాటికి (1951) నేను శ్రీపాద వారి అల్లుణ్ణి కాలేదు. పినాకపాణి గారి దగ్గర ఆయన 11 సంవ త్సరాలు గురుకులవాసం చేశారు. నిజానికి పినా కపాణి గారి ఇంట్లో, జీవితంలో ఆయన ఒక భాగమై పోయారు. ఇద్దరూ పాట పాడుకుంటూ విశాఖలో సైకిలు రిక్షా మీద బయలుదేరి, బాలాం బగారు (పినాకపాణిగారి సతీమణి) చెప్పిన ఆరు పనుల్లో తేలికగా రెండు మరచిపోయేవారట. ఏ ‘బెహాగో’, ‘కల్యాణో’ వారి జ్ఞాపకాలకు అడ్డు పడేది. పాణి గారు ఆయనకి కారు డ్రైవింగు కూడా నేర్పారు. పాణి కర్నూలులో పనిచేసే రోజుల్లో రాత్రి వేళల్లో ఇద్దరూ రెండు మంచాల మీద పడుకుని రాగాలలో రవ్వ సంగతులు, కొత్త మలుపులు, సంచారాలు చర్చించుకుంటూంటే టైము తెలిసేది కాదు. రైలు కట్ట దగ్గర పాణిగారి ఇల్లు. తెల్లవారు జామున 3 గంటలకి హైదరాబాదు-బెంగళూరు ఎక్స్ప్రెస్ తుంగభద్ర వంతెన మీద వెళ్తూ పెద్ద శబ్దం చేస్తే ఇద్దరూ తుళ్లిపడేవారు. ‘‘అబ్బో! మూడయిపోయిం దండీ!’’ అనుకుని నిద్రలోకి జారేవారు. పాణిగారికి క్రికెట్ అంటే ఇష్టం. 1958లో ఇండియా-వెస్ట్ ఇండీస్ క్రికెట్ మ్యాచ్కి కారులో హైదరాబాదు వెళ్తూ ‘‘ఈ ఐదు రోజులూ కర్నూలులో ఏం చేస్తారు? మాతో రండి!’’ అంటూ నేదునూరిగారినీ కారెక్కించుకున్నారు (స్టాండర్ట్ 555. ఆ కారు ఇప్పటికీ కర్నూలులో పిల్లల దగ్గర ఉంది). దారి పొడుగునా హైదరాబాదు వరకు సంగీత సాధన. క్రికెట్ గ్రౌండ్లో ఒక పక్క క్రికెట్ ఆట. మరొక పక్క క్రికెట్ స్టాండులోనే సంగీత సాధన. పాణిగారి జీవితంలో నేదునూరిగారు ఒక భాగం. నేదునూరి గారి జీవితమే పినాకపాణిగారు. ఆయన పెద్దబ్బా యికి గురువుగారి పేరే పెట్టుకున్నారు. గురువు గారిని తలుచుకుంటే ఆయనకి పరవశం. మనోధర్మానికి పెద్ద పీట వేసి, సంప్రదా యాన్ని అటూ ఇటూ బెసగనివ్వక అచ్చమయిన మేలిమి బంగారంగా నిలిపిన గొప్పతరం సైనికుడు నేదునూరి. సేనాధిపతి పినాకపాణిగారు. అయితే నేదునూరి ప్రత్యేకత ఏమిటంటే ఆయన ‘నాది గొప్ప సంప్రదాయం’ అనరు. ‘గొప్ప సంప్రదా యం అంటే ఇలా ఉండాలి’ అనిపిస్తారు. నేనంటే ఆయనకి అమితమైన గౌరవం, అభిమానం. రాజాలక్ష్మీ ఫౌండేషన్ ప్రత్యేక పురస్కా రాన్ని వారితో పాటే ఆ సంవత్సరం పుచ్చుకు న్నాను. గీతం విశ్వవిద్యాలయం ఆయనకి డాక్టరేట్ ఇచ్చి గౌరవించినప్పుడు కృతజ్ఞతాపూర్వక ప్రసం గం కోసం నా దగ్గరకి వచ్చారు. ఆలోచనలో, అభిప్రాయంలో, నిర్దుష్టమైన నిర్ణయంలో ఆయన ఎంత నిక్కచ్చి మనిషో ఆనాడు చూశాను. వాక్యం లో ఏ అందమైన మాటకీ లొంగరు - అది తన అభిప్రాయమైతే తప్ప. భాష తనదికాని ఆలోచనని అలంకరించకూడదు. ఈ ధోరణి ఆయన సంగీతా నికీ వర్తిస్తుంది. ‘‘రేవతిరాగంలో ‘నానాటి బతుకు నాటకము’ కీర్తన బాణీని కూర్చిన ఒక్క అద్భుతానికే మీకు సంగీత కళానిధి ఇవ్వాల’’ని మురిసిపోతూ ఆయన దగ్గర ఆ పాట నేర్చుకున్నారు విదుషీమణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. 55 సంవత్సరాలు వరస తప్పకుండా చెన్నైలో జరిగే డిసెంబరు సంగీతోత్సవాలలో మ్యూజిక్ అకాడమీ పిలుపున కచ్చేరీలు చేసి తమిళ రసికులను మెప్పించడం ఒక రికార్డు. ఆరోగ్యం బాగులేదని తెలిసి ఈ మధ్య వెళ్తే - అంత అనారోగ్యంలోనూ నన్ను గుమ్మందాకా వచ్చి సాగనంపారు, వద్దంటున్నా. నెల రోజుల కిందట వెళ్లినప్పుడు మరీ డీలాపడ్డారు. మాట సరిగా రావడం లేదు. నెమ్మదిగా మంచం మీద కూర్చుంటూ. ‘‘బాధపడుతూ బతకకూడదండీ!’’ అంటూ మంచం మీద వాలారు. నేను చూస్తుండగానే చిన్న నిద్ర పట్టింది. శరీరం ఆయన సంస్కారాన్ని లొంగదీసుకుంటున్న అరుదైన క్షణాలవి. మామూలు కుటుంబంలో పుట్టి, ఏమీ భేషజం లేని అపూర్వమైన విద్వత్తును ఆపోశన పట్టి, ఒక తరానికి మకుటాయమానంగా నిలిచి, సంగీతానికి తనదైన విలాసాన్నీ నిండుదనాన్నీ కల్తీలేని పవిత్రతనూ మప్పిన పెద్ద కన్సర్వేటివ్ నేదునూరి. - ఆయన జీవన్ముక్తుడు. గొల్లపూడి మారుతీరావు