స్టార్ హీరో మాస్ మూవీతో వస్తాడనుకుంటే..! | Sanjay Dutt latest project Bhoomi script work finished | Sakshi
Sakshi News home page

స్టార్ హీరో మాస్ మూవీతో వస్తాడనుకుంటే..!

Published Fri, Dec 9 2016 6:07 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

స్టార్ హీరో మాస్ మూవీతో వస్తాడనుకుంటే..!

స్టార్ హీరో మాస్ మూవీతో వస్తాడనుకుంటే..!

ముంబై: అతడి కెరీర్ వివాదాలమయం. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోగా కంటే ఇతర విషయాలతోనే తరచుగా వార్తల్లో నిలిచేవ్యక్తుల్లో సంజయ్ దత్ ఒకరు. చాలా గ్యాప్ తర్వాత ముఖానికి మళ్లీ మేకప్ వేసుకోవడానికి సంజూ సిద్ధమయ్యాడు. నిజ జీవిత గాథలతో కూడిన మూవీలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ పేరు తెచ్చుకున్న దర్శకుడు ఒమంగ్ కుమార్. మేరీ కోమ్, సరబ్‌జీత్ మూవీల తర్వాత సంజయ్‌తో కొత్త ప్రాజెక్టు 'భూమి' పట్టాలెక్కుతోంది. సంజయ్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. ఓ రేంజ్ మాస్ మూవీతో వస్తాడనుకుంటే సంజయ్ ఓ క్లాస్ మూవీకి కమిట్ అయ్యాడు.

'శంకర్ దాదా' మూడో పార్ట్ తీసి తెరపై కనిపిస్తాడని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా లేటెస్ట్ మూవీ వివరాలతో వారు సంతృప్తి చెందుతున్నారు. భూమి మూవీ ఫస్ట్ లుక్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. భూమి మూవీలో తండ్రీకూతురు మధ్య అనుబంధాన్ని సున్నితంగా తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఒమంగ్ తెలిపారు. లోగోతో పాటు ఏడాది ఆగస్టు 4న మూవీని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ శాతం షూటింగ్ చేయనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని వాస్తవ కథల దర్శకుడు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement