రేపు మదర్స్ డే
ఆమెతో గడపాలి. ఆమె తన పిల్లలకు మనసులోది చెప్పుకునేలా చేయాలి. ఆమె మురిసి΄ోయే కానుక ఇవ్వాలి. ఎదురు చూస్తున్న విహారానికి ఆమెను తీసుకెళ్లాలి. అరె... ఆమెకు ఇష్టమైనది వండితే ఎంత బాగుంటుంది. మనమలు, మనమరాళ్లు ఆమె కాళ్ల దగ్గర చేరితే మరింత బాగుంటుంది. అమ్మకు ఏం కావాలి? చిన్న చిరునవ్వు తప్ప. మే 12 అంతర్జాతీయ మాతృదినోత్సవం. అమ్మను సంతోషపెట్టేందుకు ఇదే సమయం.
అమ్మగా ప్రయాణం ప్రసవ వేదనతో మొదలవుతుంది. బిడ్డకు జన్మనివ్వడానికి వేదనకు సిద్ధమయ్యే అమృతమూర్తి అమ్మ. పుట్టాక బిడ్డ కేర్‌మన్నా, కేరింతలు కొట్టినా ఆమె పెదాల మీద చిర్నవ్వు. అంతవరకూ అనుభవించిన బాధను ఆమె మర్చి΄ోతుంది. ఆ తర్వాత ఆమె జీవితమంతా పిల్లల చుట్టే తిరుగుతుంది. వారు నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. సరిగా చదవక΄ోతే బాధ పడుతుంది. పూర్తిగా స్థిర పడక΄ోతే ఆందోళన పడుతుంది.
వారి ఎదుగుదల, పెళ్ళిళ్లు, సంసారాలు, సంపాదనలు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటుంది. ‘నా పిల్లలు చల్లగా ఉండాలి’ అని ్రపార్థనలు చేస్తుంది. చల్లగా ఉంటే సంతోషపడుతుంది. కాని పిల్లలు పెద్దవాళ్లయ్యాక... తాము తల్లిదండ్రులయిన తర్వాత... తల్లి నుంచి ΄÷ందిన ప్రేమంతా తమ పిల్లలకు ఇస్తారు తప్ప తల్లికి ఇవ్వడానికి బద్దకిస్తారు. ‘అమ్మంటే ప్రేమ కదా మనకు’ అనుకుంటారు తప్ప వ్యక్తీకరించరు. ఒకోసారి అమ్మనే మర్చి΄ోయేంత బిజీ అయి΄ోతారు. అలాంటి వారికి అమ్మను గుర్తు చేసేదే కదా ‘మదర్స్ డే’.
» అమ్మ ఫోన్ ఎత్తుతున్నారా?
లోకంలో ఎన్నో ఫోన్లు ఫస్ట్ కాల్‌కే ఎత్తుతారు చాలామంది. కాని అమ్మ చేస్తుంటే ‘అమ్మే కదా’ అని ఎత్తరు. అమ్మ ఫోన్‌లో పెద్ద విశేషం లేక΄ోవచ్చు. రొటీన్ కాలే కావచ్చు. ‘భోజనం చేశావా నాన్నా’ అనే అదే ప్రశ్నను అడుగుతుండవచ్చు. కాని అమ్మ కదా. కొడుకు ఎంత పెద్దవాడైనా, కూతురు ఎంత పెద్ద సమర్థురాలైనా వారు క్షేమంగా ఇల్లు చేరి నిద్రకు ఉపక్రమిస్తున్నారని తెలుసుకుంటే తప్ప ఆమె నిద్ర΄ోదు. ఆ విషయం తెలిసీ ఫోన్ ఎత్తరు. ఒకోసారి విసుక్కుంటారు. పిల్లలే ఫోన్ చేసి ‘అమ్మా అన్నం తిన్నావా?’ అని అడగడం ఎందరు అమ్మల విషయంలో జరుగుతున్నదో. పిల్లల పలకరింపే అమ్మకు అసలైన భోజనం.
» అమ్మను మాట్లాడనిస్తున్నారా?
అమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు. ఆమె ఎంతో జీవితం చూసి ఉంటుంది. అనుభవం ఉండి ఉంటుంది. పిల్లల జీవితాల్లో జరుగుతున్న విషయాలు ఆమె చెవిన పడి చూపుకు అందుతుంటాయి. ఏదో చె΄్పాలని ఉంటుంది. తోబుట్టువుల ఫిర్యాదులు, పట్టింపులు ఒకరివి మరొకరికి చేరవేసి ప్రేమలు గట్టి పడాలని పరితపిస్తూ ఉంటుంది. భర్త గురించి కూడా పిల్లలకు ఏదో చెప్పుకోవాలని ఉంటుంది. పిల్లలు వింటున్నారా? నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని తీరిగ్గా ఆమె పక్కన కూచుని అడుగుతున్నారా? ఆమెను అర్థం చేసుకుంటూ ఆమె చెప్పింది పాటిస్తున్నారా? పాటించడమే కదా ఆమెకు తెలుపగల కృతజ్ఞత. ఇవ్వగల గౌరవం.
» అమ్మకు కానుక
అమ్మ డబ్బు దాచుకోదు. దాచుకున్నా పిల్లల కోసమే. అమ్మ తన కోసం ఏదీ కొనుక్కోదు. కొనుక్కున్నా పిల్లల కోసమే. తమకు పిల్లలు పుట్టాక తమ పిల్లలకు ఏమేమి కొనిపెడదామా అనుకునే తల్లిదండ్రులు తమకు జన్మనిచ్చిన తల్లికి ఏదైనా కొని పెడదామా అనుకోరు. ఒక మంచి స్మార్ట్ వాచ్ (ఆమె ఆరోగ్యాన్ని సూచించేది), పాటల పెట్టె (సారెగమా కారవాన్ రేడియో), మంచి ఫోన్ హెడ్‌ఫోన్స్‌తో పాటుగా (ప్రవచనాలు వినడానికి), ఆమెకు నచ్చిన బంగారు ఆభరణం, ఆమెకు ఆసక్తి ఉన్న చానల్స్ సబ్‌స్క్రిప్షన్, ఓటీటీల సబ్‌స్క్రిప్షన్, ఏదైనా మంచి ప్రకృతి వైద్యశాలలో రెండు వారాలు ఉండటానికి కావలసిన ఏర్పాట్లు, ఆమె ప్రముఖంగా కనిపించేలా ఫ్యామిలీ ఫొటో... ఇవన్నీ ఆమె మళ్లీ మళ్లీ చూసుకుని ఆనందించే కానుకలు. చిరునవ్వుల మాలికలు. ‘మా పిల్లలు కొనిచ్చారమ్మా’ అని వారికీ వీరికి చెప్పుకునే ఘన విషయాలు.
» మనం తప్ప
అమ్మకు పిల్లలు తప్ప వేరే ఏ ఆస్తిపాస్తులు పట్టవు. అమ్మకు నిత్యం కళ్ల ముందు పిల్లలు కనిపించాలి. ఆమె మీద ఫిర్యాదులు చేసి, సాకులు చూపి, లేదా తప్పనిసరయ్యి ఆమెకు దూరంగా ఉండాల్సి వస్తే ఆ దూరాన్ని దాని వల్ల వచ్చే లోటును పూర్తిగా పూడ్చేంతగా పిల్లలు అమ్మకు ఇవ్వాలి. ‘అమ్మ’ అని పిలుచుకునే అదృష్టంతో ఒక మనిషి మన కోసం ఉండటం వరం. ఆ వరం అపురూపం. అది గ్రహిస్తే చాలు–ఈ మదర్స్ డే రోజున.
అమ్మతో ప్రయాణం
సెలవులొస్తే అచ్చోటకి వెళ్దాం ఇచ్చోటకి వెళ్దాం అని ΄్లాన్ చేసుకునే ఓ పిల్లలూ... మీ ప్రయాణంలో ఎన్నిసార్లు అమ్మను తీసుకెళ్లారు? జీవితం మొత్తం పిల్లల కోసం ఆమె ఇంటికే పరిమితమైంది. ఇప్పుడైనా లోకం చూడాలని అనుకుంటోంది. ‘నువ్వు రాలేవు’, ‘నువ్వు తిరగలేవు’, ‘నిన్ను చూసుకోవడం కష్టం’ అని ఆమెను ఇంటికే పరిమితం చేస్తే ఆమె మనసు ఆహ్లాదం ΄÷ందేదెప్పుడు. ఆమెకు ఆటవిడుపు లభించేదెప్పుడు. ఆమెకు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చింత ఉంటే అది తీరేదెప్పుడు. శ్రావణ కుమారుడిలా కావడిలో మోయక్కర్లేదు... రెండు రోజులు సెలవు పెట్టి ఆమెతో రైలు ప్రయాణమే ఆమెకు ఇవ్వగల వీక్షణ దరహాసం.
Comments
Please login to add a commentAdd a comment