International mothers day
-
International Mothers Day: అమ్మ చిరునవ్వును చూద్దామా
ఆమెతో గడపాలి. ఆమె తన పిల్లలకు మనసులోది చెప్పుకునేలా చేయాలి. ఆమె మురిసి΄ోయే కానుక ఇవ్వాలి. ఎదురు చూస్తున్న విహారానికి ఆమెను తీసుకెళ్లాలి. అరె... ఆమెకు ఇష్టమైనది వండితే ఎంత బాగుంటుంది. మనమలు, మనమరాళ్లు ఆమె కాళ్ల దగ్గర చేరితే మరింత బాగుంటుంది. అమ్మకు ఏం కావాలి? చిన్న చిరునవ్వు తప్ప. మే 12 అంతర్జాతీయ మాతృదినోత్సవం. అమ్మను సంతోషపెట్టేందుకు ఇదే సమయం.అమ్మగా ప్రయాణం ప్రసవ వేదనతో మొదలవుతుంది. బిడ్డకు జన్మనివ్వడానికి వేదనకు సిద్ధమయ్యే అమృతమూర్తి అమ్మ. పుట్టాక బిడ్డ కేర్‌మన్నా, కేరింతలు కొట్టినా ఆమె పెదాల మీద చిర్నవ్వు. అంతవరకూ అనుభవించిన బాధను ఆమె మర్చి΄ోతుంది. ఆ తర్వాత ఆమె జీవితమంతా పిల్లల చుట్టే తిరుగుతుంది. వారు నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. సరిగా చదవక΄ోతే బాధ పడుతుంది. పూర్తిగా స్థిర పడక΄ోతే ఆందోళన పడుతుంది. వారి ఎదుగుదల, పెళ్ళిళ్లు, సంసారాలు, సంపాదనలు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటుంది. ‘నా పిల్లలు చల్లగా ఉండాలి’ అని ్రపార్థనలు చేస్తుంది. చల్లగా ఉంటే సంతోషపడుతుంది. కాని పిల్లలు పెద్దవాళ్లయ్యాక... తాము తల్లిదండ్రులయిన తర్వాత... తల్లి నుంచి ΄÷ందిన ప్రేమంతా తమ పిల్లలకు ఇస్తారు తప్ప తల్లికి ఇవ్వడానికి బద్దకిస్తారు. ‘అమ్మంటే ప్రేమ కదా మనకు’ అనుకుంటారు తప్ప వ్యక్తీకరించరు. ఒకోసారి అమ్మనే మర్చి΄ోయేంత బిజీ అయి΄ోతారు. అలాంటి వారికి అమ్మను గుర్తు చేసేదే కదా ‘మదర్స్ డే’.» అమ్మ ఫోన్ ఎత్తుతున్నారా?లోకంలో ఎన్నో ఫోన్లు ఫస్ట్ కాల్కే ఎత్తుతారు చాలామంది. కాని అమ్మ చేస్తుంటే ‘అమ్మే కదా’ అని ఎత్తరు. అమ్మ ఫోన్లో పెద్ద విశేషం లేక΄ోవచ్చు. రొటీన్ కాలే కావచ్చు. ‘భోజనం చేశావా నాన్నా’ అనే అదే ప్రశ్నను అడుగుతుండవచ్చు. కాని అమ్మ కదా. కొడుకు ఎంత పెద్దవాడైనా, కూతురు ఎంత పెద్ద సమర్థురాలైనా వారు క్షేమంగా ఇల్లు చేరి నిద్రకు ఉపక్రమిస్తున్నారని తెలుసుకుంటే తప్ప ఆమె నిద్ర΄ోదు. ఆ విషయం తెలిసీ ఫోన్ ఎత్తరు. ఒకోసారి విసుక్కుంటారు. పిల్లలే ఫోన్ చేసి ‘అమ్మా అన్నం తిన్నావా?’ అని అడగడం ఎందరు అమ్మల విషయంలో జరుగుతున్నదో. పిల్లల పలకరింపే అమ్మకు అసలైన భోజనం.» అమ్మను మాట్లాడనిస్తున్నారా?అమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు. ఆమె ఎంతో జీవితం చూసి ఉంటుంది. అనుభవం ఉండి ఉంటుంది. పిల్లల జీవితాల్లో జరుగుతున్న విషయాలు ఆమె చెవిన పడి చూపుకు అందుతుంటాయి. ఏదో చె΄్పాలని ఉంటుంది. తోబుట్టువుల ఫిర్యాదులు, పట్టింపులు ఒకరివి మరొకరికి చేరవేసి ప్రేమలు గట్టి పడాలని పరితపిస్తూ ఉంటుంది. భర్త గురించి కూడా పిల్లలకు ఏదో చెప్పుకోవాలని ఉంటుంది. పిల్లలు వింటున్నారా? నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని తీరిగ్గా ఆమె పక్కన కూచుని అడుగుతున్నారా? ఆమెను అర్థం చేసుకుంటూ ఆమె చెప్పింది పాటిస్తున్నారా? పాటించడమే కదా ఆమెకు తెలుపగల కృతజ్ఞత. ఇవ్వగల గౌరవం.» అమ్మకు కానుకఅమ్మ డబ్బు దాచుకోదు. దాచుకున్నా పిల్లల కోసమే. అమ్మ తన కోసం ఏదీ కొనుక్కోదు. కొనుక్కున్నా పిల్లల కోసమే. తమకు పిల్లలు పుట్టాక తమ పిల్లలకు ఏమేమి కొనిపెడదామా అనుకునే తల్లిదండ్రులు తమకు జన్మనిచ్చిన తల్లికి ఏదైనా కొని పెడదామా అనుకోరు. ఒక మంచి స్మార్ట్ వాచ్ (ఆమె ఆరోగ్యాన్ని సూచించేది), పాటల పెట్టె (సారెగమా కారవాన్ రేడియో), మంచి ఫోన్ హెడ్‌ఫోన్స్‌తో పాటుగా (ప్రవచనాలు వినడానికి), ఆమెకు నచ్చిన బంగారు ఆభరణం, ఆమెకు ఆసక్తి ఉన్న చానల్స్ సబ్స్క్రిప్షన్, ఓటీటీల సబ్స్క్రిప్షన్, ఏదైనా మంచి ప్రకృతి వైద్యశాలలో రెండు వారాలు ఉండటానికి కావలసిన ఏర్పాట్లు, ఆమె ప్రముఖంగా కనిపించేలా ఫ్యామిలీ ఫొటో... ఇవన్నీ ఆమె మళ్లీ మళ్లీ చూసుకుని ఆనందించే కానుకలు. చిరునవ్వుల మాలికలు. ‘మా పిల్లలు కొనిచ్చారమ్మా’ అని వారికీ వీరికి చెప్పుకునే ఘన విషయాలు.» మనం తప్పఅమ్మకు పిల్లలు తప్ప వేరే ఏ ఆస్తిపాస్తులు పట్టవు. అమ్మకు నిత్యం కళ్ల ముందు పిల్లలు కనిపించాలి. ఆమె మీద ఫిర్యాదులు చేసి, సాకులు చూపి, లేదా తప్పనిసరయ్యి ఆమెకు దూరంగా ఉండాల్సి వస్తే ఆ దూరాన్ని దాని వల్ల వచ్చే లోటును పూర్తిగా పూడ్చేంతగా పిల్లలు అమ్మకు ఇవ్వాలి. ‘అమ్మ’ అని పిలుచుకునే అదృష్టంతో ఒక మనిషి మన కోసం ఉండటం వరం. ఆ వరం అపురూపం. అది గ్రహిస్తే చాలు–ఈ మదర్స్ డే రోజున. అమ్మతో ప్రయాణంసెలవులొస్తే అచ్చోటకి వెళ్దాం ఇచ్చోటకి వెళ్దాం అని ΄్లాన్ చేసుకునే ఓ పిల్లలూ... మీ ప్రయాణంలో ఎన్నిసార్లు అమ్మను తీసుకెళ్లారు? జీవితం మొత్తం పిల్లల కోసం ఆమె ఇంటికే పరిమితమైంది. ఇప్పుడైనా లోకం చూడాలని అనుకుంటోంది. ‘నువ్వు రాలేవు’, ‘నువ్వు తిరగలేవు’, ‘నిన్ను చూసుకోవడం కష్టం’ అని ఆమెను ఇంటికే పరిమితం చేస్తే ఆమె మనసు ఆహ్లాదం ΄÷ందేదెప్పుడు. ఆమెకు ఆటవిడుపు లభించేదెప్పుడు. ఆమెకు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చింత ఉంటే అది తీరేదెప్పుడు. శ్రావణ కుమారుడిలా కావడిలో మోయక్కర్లేదు... రెండు రోజులు సెలవు పెట్టి ఆమెతో రైలు ప్రయాణమే ఆమెకు ఇవ్వగల వీక్షణ దరహాసం. -
పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే
అమ్మ.. ఆ పిలుపు కోసం తపించని వారుంటారా? ఆ స్పర్శ కోరుకోని వారుంటారా? అమ్మ అంటే వేయి ఏనుగుల బలం. అమ్మ అంటే కదిలొచ్చే దేవత. అమ్మ అంటే మమతల కోవెల. ఎంత వర్ణించినా అమ్మ గొప్పతనాన్ని మాటల్లో బందీ చేయలేము. అమ్మ కోసం ఆరాటపడేవారు కొందరైతే అమ్మగా మారాలని తపించేవాళ్లు కొందరు! పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాకే మాతృత్వపు మమకార మాధుర్యం చూడాలని కోరుకోవడం లేదు కొందరు. అలాంటివారి జాబితాలో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. ప్రేమించినవాడితో పెళ్లి వాయిదా వేశారే కానీ సంతానాన్ని వద్దనుకోలేదు. ఫలితంగా పెళ్లి కాకముందే గర్భం దాల్చినవాళ్లు ఉన్నారు. ఏడడుగులు వేయడానికి ముందే బుడిబుడి అడుగులు వేసే పాపాయితో పందిట్లోకి అడుగుపెట్టినవాళ్లు ఉన్నారు. మదర్స్ డే సందర్భంగా ఓసారి ఆ తల్లులను గుర్తు చేసుకుందాం.. నీనా గుప్తా నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో బిడ్డను కన్నది. అయితే అతడు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో నీనా సింగిల్ పేరెంట్‌గా మసాబా గుప్తాను పెంచింది. కల్కి కొచ్లిన్ బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్.. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో మూడేళ్లు ప్రేమాయణం సాగించి 2011లో పెళ్లి చేసుకుంది. కానీ వీరి వైవాహిక బంధం సజావుగా సాగలేదు. 2013లో విడిపోగా 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హర్ష్‌బెర్గ్‌తో డేటింగ్ చేయగా వీరికి కూతురు పుట్టింది. ఇప్పటికీ వీరు పెళ్లి చేసుకోలేదు. రేణు దేశాయ్.. బద్రి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలోనే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. అతడితో ఏడుగులు వేయడానికే ముందే అకీరా జన్మించాడు. అతడికి ఐదేళ్ల వయసొచ్చాక పెళ్లి చేసుకున్నారు. 12 ఏళ్లు కలిసి మెలిసి ఉన్నా తర్వాత విడిపోయారు. సెలీనా జైట్లీ నటి సెలీనా జైట్లీ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త పీటర్ హగ్‌తో సహజీవనం చేసిన ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చింది. దీంతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. సారిక స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లు చక్రం తిప్పిన సారిక స్టార్ నటుడు కమల్ హాసన్‌తో ప్రేమాయణం నడిపింది. కొంతకాలం వీరిద్దరూ సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి శృతి హాసన్ జన్మించింది. తర్వాత రెండేళ్లకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గాబ్రియెల్లా మోడల్, నటి గాబ్రియెల్లా డెమట్రేడ్స్ నటుడు అర్జున్ రాంపాల్‌తో డేటింగ్లో ఉంది. త్వరలో ఆమె రెండోసారి తల్లి కాబోతోంది. కానీ ఇప్పటివరకు వీరు పెళ్లి చేసుకోలేదు. మహిహ చౌదరి నటి మహిమ చౌదరి పెళ్లి చేసుకునే సమయానికి ఐదు నెలల గర్భవతి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2006 మార్చిలో ఆమె బాబీ ముఖర్జీని పెళ్లాడింది. అమృత అరోరా అమృత అరోరా.. షేకలా లడక్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే గర్భం దాల్చింది. బిడ్డ పుట్టాక ప్రియుడిని పెళ్లాడింది. శ్రీదేవి దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. జాన్వీ కపూర్ కడుపులోకి వచ్చాకే ఆమె బోనీకపూర్‌ను పెళ్లాడింది. అప్పటికి ఆమె ఏడు నెలల గర్భిణి. కొంకణ్ సేన్ శర్మ నటుడు రణ్వీర్ షోరేతో ఎంతోకాలం రిలేషన్షిప్ కొనసాగించిన ఈ నటి ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే తను గర్భవతి. పెళ్లైన తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అమీ జాక్సన్ ఐ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అమీ జాక్సన్. ప్రియుడు జార్జ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిన మరుక్షణమే తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది. తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కానీ ఆ ప్రేమ పెళ్లి దాకా రాకుండానే ఆగిపోయింది. నేహా ధూపియా బాలీవుడ్ నటి నేహా ధూపియా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఈ విషయాన్ని నేహా ధూపియా ఆమె ప్రియుడు అంగద్ బేడీ ఇంట్లో చెప్పి ఒప్పించాకే పెళ్లి చేసుకున్నారు. నేహాతో అంగద్ షాదీ జరిగే సమయానికి ఆమె మూడు నెలల గర్భిణి. దియా మీర్జా బాలీవుడ్ నటి దియా మీర్జా వ్యాపారవేత్త వైభవ్ రేఖీని పెళ్లాడింది. అతడిని పెళ్లాడే సమయానికే ఆమె గర్భం దాల్చింది. నటి నటాషా స్టాంకోవిచ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే గర్భం దాల్చింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కొంతకాలం పాటు రిలేషన్లో ఉన్న ఆమె ప్రెగ్నెన్సీ వచ్చాక పెళ్లి చేసుకుంది. అలియా భట్ అలియా భట్ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయిందంటారు. 2022 ఏప్రిల్ 14న రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడింది. జూన్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. నవంబర్‌లో రాహాకు జన్మనిచ్చింది ఆలియా. చదవండి: మదర్స్ డే స్పెషల్...కమ్మనైన ఈ అమ్మ పాటలు విన్నారా? మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిత్రాలివే -
మదర్స్ డే స్పెషల్...కమ్మనైన ఈ అమ్మ పాటలు విన్నారా?
అమ్మ...ఆ పదం పలకడానికి పెదాలు కమ్మగా కదులుతాయి. అలా పిలవడానికి మనసు నిలువెల్లా పులకరించి గొంతులో ఏకమవుతుంది. అమ్మ గర్భంనుంచి బయటకొచ్చిన బిడ్డ కూడా ఈ ప్రపంచంకంటే ముందు అమ్మనే చూస్తుంది. అమ్మనే పిలుస్తుంది. అమ్మా అనే ఏడుస్తుంది. అమ్మ చుట్టూనే ప్రపంచం.. అమ్మ ఉంది కాబట్టే ప్రపంచం. ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా.. వెండితెరపై అమ్మను కీర్తిస్తూ అలరించిన గీతాలపై ఓ లుక్కేద్దాం. అమ్మంటే ప్రేమకి పర్యాయపదం. అమ్మ మనసు అనురాగ నిలయం. అమ్మ కమ్మని కథలు చెబుతూ.. నమ్మలేని లోకాల్ని కళ్లముందు చూపెడుతుంది. అంతే కాదు.. అమ్మ ధైర్యాన్ని నూరిపోస్తుంది. కొడుకుని వీరుడిగా తీర్చిదిద్దుతుంది. ఐనా కొడుకెప్పుడా ఆ మమతల తల్లి మదిలో చిన్నిపిల్లవాడే. జన్మనిచ్చేదే అమ్మ అయినపుడు... ఆ అమ్మకు జన్మనిచ్చింది కూడా అమ్మే అయినపుడు అమ్మను మించిన దైవమేముంటుంది.. ఆ మాట మనుషులే కాదు.. ఆ మనిషిని సృష్టించిన దేవుడు కూడా ఒప్పుకున్నాడు. అందుకే అవతారపురుషుడైనా ఒక అమ్మకు కొడుకే అన్నారు. అమ్మ గురించి వింటుంటే.. అమ్మను చూస్తుంటే.. అమ్మ ఒడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటే.. ప్రతిదీ మనసు ఫలకంపై అక్షరాలు దిద్దినంత గట్టిగా తాకుతుంది. అమ్మ ప్రేమకన్నా విలువైన సంపద ఈ సృష్టిలో లేనేలేదు. అమ్మ ఆప్యాయత ముందు ఏదీ నిలవదు. వందమంది దేవుళ్లు ఎదురుగా వచ్చి నిలబడినా.. ఆమ్మ అందించే ప్రేమ ముందు తక్కువే అవుతారు. కంటికి వెలుగునిచ్చే అమ్మ కదిలే దేవతే కదా. అమ్మా అని తొలిపలుకు పలికే అదృష్టం పెదాలకు దక్కిన అదృష్టమే కదా! సృష్టిలో ఒక మనిషికే కాదు.. ఏ జీవికైనా అమ్మ ప్రేమ ఒక్కటే. అమ్మలోని కమ్మదనం.. అమ్మప్రేమలోని మధురం ఒక్కటే. జన్మనిచ్చే తల్లే ఎవరికైనా తొలిదైవం... ఏ జీవికైనా అమ్మే ఒక వరం. బిడ్డ అలిగితే తల్లి బుజ్జగిస్తుంది. బ్రతిమిలాడో, బామాడో అన్నం తినిపిస్తుంది. అప్పుడే తన కడుపు నిండినట్టు భావిస్తుంది. ఐతే.. కొన్ని సందర్భాల్లో అమ్మ కూడా అలకబూనుతుంది. అప్పుడు కొడుకు పడే వేదన హృదయాన్ని తాకుతుంది. అమ్మ మీద ప్రేమని చెప్పకనే చెబుతుంది. అమ్మ అనే రెండక్షరాల పదం కంటే గొప్పది ఎవరు మాత్రం రాస్తారు. అసలు అంతకంతే గొప్పమాట.. అమ్మగురించి పాడటంకంటే గొప్ప పాట ఏముంటాయి? రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలు ఎగిరిపోతున్నా... తనును నడిరోడ్డుమీద వదిలేసినా.. ఏ తల్లీ బిడ్డను శపించదు.. ఆకలికడుపుతో అలమటిస్తూనే నవ్వుతూ బిడ్డ క్షేమంగా ఉండాలని దీవిస్తుంది. అమ్మా అని ప్రేమగా పిలిస్తే చాలనుకుంటుంది. మనిషైనా.. మాకైనా.. అమ్మకు.. అమ్మ మనసుకు ఆ భేదాలేమీ ఉండవు. ఆమె బిడ్డను ప్రేమిస్తుంది.. పాలిస్తుంది.. లాలిస్తుంది. ప్రాణంకంటే మిన్నగా కాపాడుకుంటుంది. జాబిల్లిని పిలిచినా... బూచోడని భయపెట్టినా ఊరుకోని బిడ్డ... అమ్మ చేతి స్పర్శ తగిలితే ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఎందుకంటే అమ్మ పిల్లల ప్రాణాలను తన అరచేతుల్లో పెట్టుకుని బతుకుతుంది. మన జీవితంలో అమ్మ లేని చోటుండదు.. అమ్మను స్మరించుకోని క్షణాలుండవు. మనకు తెలిసినా.. తెలియకపోయినా.. తమకు మాటలు నేర్పిన అమ్మను పిలవడానికి, తలవడానికి పెదాలెప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. బాధకలిగితే అమ్మా.. అలసిపోయేంతగా నవ్వితే అమ్మ.. దెబ్బ తాకితే అమ్మ.. కన్నీళ్లొస్తే అమ్మ.. కడుపు మాడితే అమ్మ.. కడుపు నిండినా అమ్మే.. అమ్మ తలపురాని చోటుండదు. ఎందుకంటే తల్లి ప్రాణం ఎప్పుడూ పిల్లలతోనే ఉంటుంది. అమ్మ బంధం కంటే వరమేముంటుంది... ఇలలో అంతకంటే సంతోషాల ఆనందం ఏముంటుంది. అందుకే అమ్మగురించి రాయని వాళ్లులేరు. అమ్మ జోలపాట గుర్తొచ్చి పాడనివాళ్లూ లేరు. అసలు ఈ ప్రపంచంలో ఒక గొప్ప పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకం పేరు కూడా అమ్మే. అది అమ్మకు మాత్రమే సొంతమయ్యే ఘనత. బిడ్డకు ఎలాంటి హాని జరిగినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. దగ్గరుండి మనసు గాయాల్ని మాన్పుతుంది. మరి అమ్మకే తీరని కష్ణమొస్తే.. పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది.. ?కనిపెంచిన అమ్మకు ఏమైనా జరిగితే.. తట్టుకునే ధైర్యం ఎవరికీ ఉండదు. అలాంటి కష్టకాలంలో ఆమ్మ జ్ఞాపకాలతో హృదయం నిండిపోతుంది. వయసంతా వెనక్కి మళ్లి అమ్మ ఒడిలోకే పారిపోతుంది. నిజమే కదా... ఉరుము ఉరిమినా.. మెరుపు మెరిసినా.. బిడ్డను గుండెలకు హత్తుకుని.. ఆకశంలో విరిసే హరివిల్లును బిడ్డ బోసినవ్వుల్లోనే చూసుకునే అమ్మ మెరిసే మేఘం.. కురిసే వాన. అమ్మ గురించి పాడినా.. అమ్మగురించి రాసినా.. అమ్మగురించి మాట్లాడినా... అమ్మ గురించి చదివినా జన్మ గుర్తొస్తుంది. జన్మజన్మలకు అమ్మకు మొక్కుతూనే ఉండాలనిపిస్తుంది. కడుపున పుట్టకపోయినా... ఒక పసిబిడ్డ అమ్మకు కన్నబిడ్డలాగే కనిపిస్తుంది. ఒక అనాదను తీసుకొచ్చి పెంచుకున్నా..నిజమైన తల్లిమనసుకు ఎప్పుడూ పరాయి అనే భావమే ఉండదు. ఉంటే అమ్మ అనిపించుకోదు. ఇప్పుడు ఎంతో మంది తల్లులు అనాథపిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడుతున్నారు. రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. అలా ప్రేమించగలిగే శక్తి అమ్మకు మాత్రమే ఉంది. అమ్మకు సాటి పోటీ ఏమీ లేదు. ఏమన్నా ఉంటే అది మళ్లే అమ్మే అవుతుంది.. అక్కడకూడా అమ్మే ఉంటుంది. బిడ్డ కంటికి రెప్ప అమ్మ. ప్రేమైక శక్తి అమ్మ. ప్రపంచమంతా అమ్మను ఈరోజు విష్ చేయొచ్చు.. కానీ ఆ ప్రపంచాన్ని అమ్మ ఎప్పుడూ విష్ చేస్తూనే ఉంటుంది. అమ్మను ప్రతిరోజూ ప్రతిక్షణం ప్రేమిద్దాం. ప్రేమగా పలకరిద్దాం. -
మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిత్రాలివే
'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు' అన్న డైలాగ్ కేజీఎఫ్ సినిమాలో చెప్పిందే కావొచ్చు. కానీ ఒక తల్లి ప్రేమ అంతకు మించి ఉంటుందని మాత్రమే చెప్పగలను. తొమ్మిది నెలలు తాను ఎన్నో బాధలను దిగమింగి బిడ్డకు జన్మినిస్తుంది. అంతే కాకుండా తన పిల్లల కలలను నెరవేర్చడానికి జీవితాంతం కష్టపడుతుంది. కానీ ఎప్పుడే గానీ తన బాధను బయటికి చెప్పలేని పిచ్చి ప్రేమ అమ్మది. అలాంటి అమ్మకు మన జీవితంలో ఏం చేసినా తక్కువే అవుతుంది. తల్లికి తన బిడ్డపై ఉండే ప్రేమకు ప్రపంచంలో ఏదీ సాటిరాదు. అలాంటి అమ్మ ప్రేమను మనకు తెలియజేస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. మదర్స్ డే సందర్భంగా ఆ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 'మాతృ దేవో భవ' మాధవి, నాసర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాతృ దేవో భవ'. ఈ చిత్రాన్ని కెఎస్ రామారావు నిర్మించగా.. కె అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1993లో విడుదలైన ఈ చిత్రం క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం మలయాళంలో సిబి మలైల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశదూతు’కి రీమేక్. ఈ చిత్రం తరువాత హిందీలో 'తులసి'గా రీమేక్ చేశారు. అదే నిర్మాత-దర్శకులు నిర్మించగా మనీషా కొయిరాలా, ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రం వూట్, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. 'బిచ్చగాడు' తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది. ప్రభాస్ 'ఛత్రపతి' 2005లో విడుదలైన ‘ఛత్రపతి’ అప్పట్లో ప్రభాస్‌కి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రెండు పొరలు ఉన్నాయి, అందమైన తల్లీ కొడుకుల అనుబంధం మరియు మంచి ప్రతీకార కథ. ఈ సినిమాలో భానుప్రియ, శ్రియ శరణ్ కూడా నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి. అమ్మ చెప్పింది 2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అమ్మా రాజీనామా 1991లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం అమ్మ రాజీనామా. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తను బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దాసరి చేసిన సినిమాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో శారద ప్రధాన పాత్రలో నటించారు. 2001లో ఈ సినిమాను కన్నడలోనూ అమ్మ పేరుతో రీమేక్ చేశారు. ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్, యూ ట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది. యమ లీల 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం యమలీల. ఈ సినిమాలో ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గాను సుచిత్రకు ఉత్తమ నృత్య దర్శకురాలిగా నంది పురస్కారం లభించింది. ఈ చిత్రం హిందీలో ‘తక్దీర్వాలా’గా, తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 'నిజం' కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి: 2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. యోగి: ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. -
International Mothers Day: ఆలోచింప చేసే అమ్మ కథ
‘అమ్మను మసిగుడ్డలా చూస్తున్నామా?’ అని ప్రశ్నిస్తుందో తెలుగు కథ. ‘ఇంట్లో నుంచి బయటకు పో అని అమ్మను నాన్న ఎందుకు అంటుంటాడు’ అని నిలదీస్తుంది మరో కథ. ‘అమ్మ ఒంటి నిండా మందులు చేరడానికి కారణం ఎవరు?’ అని వేదన చెందుతుంది ఇంకో కథ. ‘అమ్మకు కంటి నిండా నిద్రన్నా ఉంటుందా?’ అని కన్నీరు కారుస్తుంది కథ. ‘మదర్స్ డే’ రోజున అమ్మను తలచుకోవడం, గౌరవించడం అందరూ చేసేదే. కాని ఆమె గురించి ఆలోచించాలి. సరిగా ఆలోచించాలి. ఆమె శ్రమను, గౌరవాన్ని, స్థానాన్ని సమస్థాయిలో ఉంచడం గురించి తెలుగులో వచ్చిన కొన్ని గొప్ప కథల ప్రస్తావన... ఆమె పేరు ఏమిటో ఆమెకు గుర్తు లేదు. భర్త ‘అది’ అంటాడు. ఇంటికి రాగానే ‘అదెక్కడా?’ అని కొడుకును అడుగుతాడు. కొడుక్కు కూడా ‘అది’ అనడం అలవాటే. ‘పిల్లల బాధ నీకెందుకు? అది చూసుకుంటుంది కదా’ అని అంటుంటాడు. ఈ ‘అది’ ఆ ఇంట్లో ఏనాడూ కూచోవడానికి వీల్లేదు. నిలబడి చేస్తూ ఉండాల్సిందే. భర్త రిటైరైనా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి అతను ఇంట్లో హాయిగా కూచోగలడు. కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తారు. డబ్బు ఉంది. వాళ్లు కూచుంటారు. ఈ ‘అది’కే ఏ సంపాదనా లేదు. ‘నేను తల్లిని కదా’ అనుకుంటుంది. అయితే? ‘నేను అత్తగారిని, నానమ్మని కదా’ అనుకుంటుంది. అయితే? ఇంట్లో ఎవరికీ ఏ విలువా లేదు. ‘అది.. ఇది’ అనడమే. ఒకరోజు ఆమె గేటు దగ్గర నిలబడి ఉంటే ఇద్దరు పనమ్మాయిలు మాట్లాడుకుంటూ వెళుతుంటారు. ఒకమ్మాయి అంటుంటుంది– ‘ఆ ఇంట్లో పని మానేశాను. ఆదివారం కూడా చేయిస్తున్నారు’ అని. విన్న ఆమె దిగ్భ్రమ చెందుతుంది. ఇన్నేళ్లుగా ఇంత చాకిరీ చేస్తున్నా ప్రతిఫలం లేకపోగా చులకనగా చూడటమా? ఉన్నది ఉన్నట్టుగా ఆ పని మనుషుల వెంట నడుస్తుంది. ‘మనలాంటి వాళ్ల కోసం ఒక మేడమ్ మంచి హోమ్ నడుపుతున్నారు. అక్కడ చేర్పిస్తాం. పద’ అని వాళ్లు తీసుకెళ్లి చేర్పిస్తారు. ఆ మేడమ్ ఆమెను పేరు అడుగుతుంది. ఏనాడో మర్చిపోయిన పేరును గుర్తు చేసుకోవడం వల్ల ఆ తల్లి కొత్త అస్తిత్వం, ఆత్మగౌరవం పొందుతుంది. కె.రామలక్ష్మి రాసిన ‘అదెక్కడ’ కథ ఇది. ఇలా ఇంట్లో అమ్మను చూసుకుంటున్నవారు ఉంటే ఈ కథ చెప్పే నీతి ఏమిటో గ్రహించాలి. ఒక ఇంట్లో ఒక తల్లి మరణిస్తుంది. దుప్పటి తీసి చూసిన భర్త అదిరిపోతాడు. ఎందుకంటే ఆమె శరీరం మొత్తం సుద్దముక్కలా తెల్లగా అయిపోయి ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది? ఇదేం వింత జబ్బు? ఆ కాలనీలో ఉన్న ఒక చురుకైన అమ్మాయి ఆ తల్లి ఒంటి నుంచి చిన్న ముక్క తీసి ల్యాబ్‌కు పరిగెత్తి పరీక్ష చేయిస్తే ఆ ముక్క ‘ఆస్ప్రిన్’ టాబ్లెట్ అని తేలుతుంది. అంటే ఆమె శరీరం మొత్తం మందు బిళ్లలతో నిండిపోయిందా? అందుకే సుద్దముక్కలా మారిందా? నిజానికి ఆ చనిపోయినామెకు ‘సూపర్ మామ్’ అని పేరు. పిల్లల్ని బాగా పెంచేది. భర్తను బాగా చూసుకునేది. ఇల్లు బాగా పెట్టుకునేది. పైగా ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేసేది. పిల్లల్ని చదివించి, ప్రయోజకుల్ని చేసి, అమెరికా సంబంధాలు చూసి సెటిల్ చేసి... ఇన్ని చేసి అందరి ప్రశంసలు పొందిన ఆమె కొన్ని విషయాలు దాచింది. ఏమిటవి? ఆఫీసు పని వొత్తిడితో రోజూ ఒక తలనొప్పి మాత్ర వేసుకునేది. ఇంటి పనులకు ఆటంకం రాకుండా ఒళ్లు ఏమాత్రం వెచ్చబడినా ఒక మాత్ర వేసుకునేది. శుభకార్యాలకు అడ్డు రాకుండా నెలసరిని వెనక్కు నెట్టడానికి మాత్రలు వేసుకునేది. గర్భసంచి తీయించేస్తే సప్లిమెంట్లు తెగ మింగింది. హార్మోనల్ ఇంబేలెన్స్ అంటే అందుకు మళ్లీ మందులు. అనారోగ్యం గురించి చెప్పి భర్తను, పిల్లల్ని డిస్ట్రబ్ చేయకుండా ఏ ఇబ్బంది వచ్చినా మాత్రలే మాత్రలు. అందుకే మరణించగానే ఒళ్లు అలా తెల్లబడింది. తేలిపోయింది. ఇది అర్థమయ్యాక, ఆమె సూపర్‌మామ్ సిండ్రోమ్‌తో మరణించిందని అర్థమయ్యాక ఆ కాలనీ అమ్మాయి తన తల్లి దగ్గరకు పరిగెడుతుంది. ‘అమ్మా... నువ్వు గొప్పల కోసం నిన్ను నువ్వు బలిపెట్టుకోకు. కొద్దిగానే పని చెయ్. విశ్రాంతి తీసుకో. ఆరోగ్యం మెరుగు పర్చుకో’ అని చెప్పడానికి. కె.సత్యవతి రాసిన ‘సూపర్‌మామ్ సిండ్రోమ్’ ఇస్తున్న సందేశం అర్థమైందిగా. ఒక భర్త భార్య మీద కోపం వచ్చిన ప్రతిసారీ ‘పో నా ఇంటి నుంచి’ అంటుంటాడు. అది అతని ఊతపదం. ఏ ఇల్లయినా భర్తదే. భార్యది కాదు. తండ్రిదే. తల్లిది కాదు. అందుకే భర్తలు భార్యల్ని ఇంటి నుంచి గెంటేస్తుంటారు. లేదా గెంటేస్తానని బెదిరిస్తుంటారు. పిల్లల్ని కన్నా, పొదుపు చేసి ఆ డబ్బు భర్త చేతిలో పెట్టినా, ఇల్లు దగ్గరుండి కట్టించినా, అందులో సంసారం చేసినా ఆ ఇల్లు మాత్రం ఆమెది కాదు. అతనిదే. ఒకరోజు ఆమెకు చివుక్కుమంటుంది. ఇంటి నుంచి రెండు మూడు చీరలతో బయటపడి దూరంగా ఒక గది అద్దెకు తీసుకుంటుంది. చిన్న ఉద్యోగం వెతుక్కుంటుంది. స్టవ్వు గివ్వు పెట్టుకుని ఇంకెవరూ తనని బెదిరించ లేని తన ఇంట్లో ఉంటుంది. దాంతో ఆ భర్త తెగ కంగారు పడిపోతాడు. కాలనీ కంగారు పడుతుంది. బంధువులు కంగారు పడతారు. కాని ఆమె మాత్రం ‘అతడికి విడాకులు ఇవ్వను. కావాలంటే నా దగ్గరకు వచ్చి నా ఇంట్లో ఉండమనండి‘ అని వర్తమానం పంపుతుంది. ఏం కథ ఇది. ఏ ఇంట్లో అయినా అమ్మ ఈ మూడ్‌లో ఉందేమో ఎవరు గమనించాలి? ఇది కవన శర్మ ‘ఆమె ఇల్లు’ కథ. పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ కథ ఉంటుంది. అందులో ఒకామె అందరూ జేబు రమణమ్మ అని పిలుస్తూ ఉంటారు. దాని కారణం ఆమె తన బాల్యంలో తల్లి ప్రతి రూపాయి కోసం తండ్రి దగ్గర చేయిజాస్తూ ఉండటమే. అలా తాను ఉండకుండా తన రవికకో, చీర కుచ్చిళ్లకో ఒక జేబు ఉండాలని భావిస్తుందామె. అలా జేబులాంటి గుడ్డ సంచిని దోపుకునే బతుకుతుంది. పసుపు కుంకాలుగా కోడలు తెచ్చిన భూమిని భర్త, కొడుకు అమ్మబోతే వారించి ‘అది కోడలి ఆర్థిక భద్రత కోసం ఉండాలి’ అని గట్టిగా నిలబడుతుంది. అమ్మకు ఉండాల్సిన ఆర్థిక స్వాతంత్య్రం గురించి ఆర్థిక గౌరవం గురించి ఆలోచిస్తున్నామా మనం. ‘మసిగుడ్డ’ లేకుండా వంట చేయడం అసాధ్యం. కాని మసిగుడ్డకు ఏ విలుగా ఉండదు. పిల్లల్ని తల్లి పెంచుతుంది. కాని ప్రోగ్రెస్ కార్డ్ మీద తండ్రి సంతకం చేస్తాడు. పిల్లలకు తల్లి ఒండి పెడుతుంది. కాని పిల్లలు వెచ్చాలకు డబ్బులిచ్చే తండ్రినే గౌరవిస్తారు. బంధువులు శుభలేఖ ఇస్తూ దానిపై అతని పేరే రాస్తారు. ఆస్తిపన్ను, కరెంటు బిల్లు, ఇంటి గడపకు నేమ్‌ప్లేట్ అన్నీ అతనివే. ఆమె మసిగుడ్డ. కాని అది లేకపోతే ఏ పనీ జరగదు. కుప్పిలి పద్మ రాసిన ‘మసిగుడ్డ’ కథ ఇది. కిచెన్‌లోకి నేడు వెళ్లి చూసినా అమ్మ పాత జాకెట్టే మసిగుడ్డగా కనిపిస్తుంది. నాన్న పాత చొక్కా కాదు. అమ్మకు గౌరవం ఇవ్వలేమా? బతికినంత కాలం ఇంటి చాకిరీలో పడి, తెల్లవారుజామునే లేస్తూ, రాత్రి లేటుగా వంట గది సర్దుకుని పడుకుంటూ, చంటి పిల్లల వల్ల, వృద్ధులైన అత్తమామల వల్ల, వేరే సవాలక్ష బాధ్యతల వల్ల కంటి నిండుగా నిద్రపోని ఒక తల్లి తనకు నిద్ర కావాలని, కనీసం ఈ వృద్ధాప్యంలో అయినా హాయిగా నిద్రపోవాలని గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. కంటి నిండా నిద్ర పోయే ‘లగ్జరీ’ ఇవాళ్టికీ అమ్మకు ఉందా? అమ్మ గురించి మదర్స్ డే సందర్భంగా ఆలోచిద్దాం. అమ్మను మొదట మనిషిగా చూస్తే, వ్యక్తిగా చూస్తే, పౌరురాలిగా చూస్తే ఆమె హక్కులు అర్థమవుతాయి. ఆ హక్కులు ఆమెకు మిగల్చడమే అందరి విధి. -
రాజ్‌భవన్‌లో ఘనంగా మాతృదినోత్సవం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం రాజ్ భవన్లో ఘనంగా జరుపుకొన్నారు. రాజ్‌భవన్ పరివారం వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్న ఈ కార్యక్రమంలో వారి మాతృమూర్తులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. -
తల్లి నిను దలంచి
-
Mother's Day 2021: ఈ ‘అమ్మ’ పాటలు ఎప్పుడు స్పెషలే
‘అమ్మ’ తెలుగు భాషలో ఈ పదం కన్న గొప్పది మరొకటి లేదు. నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. పిల్లలు అంద వికారంగా ఉన్నా, అంగవైకల్యం కలిగి ఉన్న గుండెలకు హత్తుకొని పెంచుకుంటుంది అమ్మ. అందుకే కనిపించే దైవం అమ్మ అంటారు. మనం తిట్టినా, కొట్టిన తల్లి ప్రేమ మారదు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆమె దృష్టిలో పిల్లాడిలాగే ఉంటాం. అందుకే అంటారు కాబోలు.. ‘ఢిల్లికి రాజైనా తల్లికి కొడుకే’. అమ్మ గురించి, అమ్మ గొప్పదనం గురించి చెప్పుకునేందుకు మరో సందర్భం మాతృ దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగులో వచ్చిన ‘అమ్మ’పాటలు మీకోసం.. -
Mother's Day: అమ్మ కూడా మనిషే
అమ్మ.. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ నాన్న... భక్తితో ఇచ్చే గౌరవం అమ్మ.. ఏమీ తెలియదనే అభిప్రాయం నాన్న.. అన్నీ తెలుసనే నమ్మకం అమ్మ.. జీతం అక్కర్లేని పనిమనిషి నాన్న.. జీవితాలు నిలబెట్టే యజమాని ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు వర్ణనలు అమ్మానాన్న గురించి. అన్నింట్లోకి.. నాన్నే మిన్న. అన్నీ భరించేది అమ్మే. ఆత్మగౌరవ భంగపాటు నుంచి వెట్టి చాకిరి వరకు అవమానాలు అన్నీ ఆమె ఖాతాలోనే. వాటికోసం ఆమె పుట్టలేదు. అమ్మను వరించడానికే అవి వేచి చూడట్లేదు. త్యాగం అమ్మకు పర్యాయ పదం కాదు. సహనం అమ్మ ఆస్తి కాదు. భరించే శక్తి అమ్మకు పేటెంట్నివ్వలేదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర అమ్మకూ అత్యవసరాలే. సరదాలు, సంతోషాలూ అమ్మకూ హక్కులే. అమ్మ దేవత కాదు.. అభయహస్తం ఇవ్వడానికి.అమ్మ రోబో కాదు.. కోరిందల్లా క్షణాల్లో చేసిపెట్టడానికి.అమ్మ మనిషి... రక్తమాంసాలున్న మనలాంటి మనిషి. అలసట, అనారోగ్యం, నీరసం, నిస్తేజం, నిస్పృహ ఆమెకూ అనుభవమే! ఈ ఎరుక మనకు రావాలి. తేగల.. తెప్పించగల వ్యక్తి నాన్న. కుటుంబ సభ్యుల్లో వచ్చే ఆ సోయే అమ్మకు కానుక.. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా!! దూరదర్శన్ రోజుల్లో (1980లు) ఆహారంలో ఐరన్‌కు సంబంధించి ఒక యాడ్ వచ్చేది. వండిందంతా ఇంట్లో వాళ్లకు పెట్టేస్తుంది ఆ ఇంటి ఇల్లాలు. ‘మరి మీకేది?’ అని అడిగితే.. ‘నాకేంటి ఈ కాస్తంత అన్నం చాలు. పచ్చడితో సరిపెట్టుకుంటా’ అంటుంది. దాని వల్ల ఐరన్, ఇతర పోషక పదార్థాలు అందవు. ఇంట్లో వాళ్లకే కాదు మీకూ బలవర్థకమైన ఆహారం కావాలి. మీరిలా మిగిలిన అన్నాన్ని పచ్చడితో సరిపెట్టుకుంటే కుదరదు’ అని వాయిస్ ఓవర్ వస్తుంది.. మహిళల్లో ఆరోగ్య స్పృహ కలిగించేలా. ప్రైవేట్ చానెళ్ల కాలంలో (2020.. అంటే ఇప్పటికీ).. ఉదయం లేవగానే మామగారు తనకేం టిఫిన్ కావాలో ఆర్డర్ వేస్తారు. భర్తా తన ఫర్మాయిష్ను వినిపిస్తాడు. పిల్లలూ వాళ్లకు నచ్చిన బ్రేక్‌ఫాస్ట్‌కు అర్జీ పెట్టుకుంటారు. ఏమాత్రం విసుగు, ఇంకో మనిషి సహాయం లేకుండా కుటుంబ సభ్యులు కోరినవన్నీ క్షణాల్లో వండిపెడుతుంది. ఇంటిల్లిపాదీ వాటిని ఆస్వాదించి ఆమె వైపు అభినందనగా చూస్తారు. ఆమె సంతృప్తిగా నిట్టూరుస్తుంది. ఇది ఎమ్టీఆర్ వాళ్ల ఇన్స్టంట్ ఫుడ్ వ్యాపార ప్రకటన. ఇంట్లో వాళ్ల కోరికల చిట్టా తీసుకొని ఆమె వంటింట్లోకి వెళ్లగానే ఆమెకు ఆరు చేతులు వచ్చినట్టుగా గ్రాఫిక్స్ చేస్తారు. 1980లకు, 2020వ దశకానికి తేడా అది. ఒక్క ఎమ్టీఆరే కాదు రకరకాల బ్రాండ్ల నూనెలు, సాంబారు, మసాల పొడుల కంపెనీల వ్యాపార ప్రకటనలూ ఇదే ధోరణిలో కనిపిస్తున్నాయి. ఆరు చేతుల సూపర్ ఉమన్‌గా, తన ఆకలిని త్యాగం చేసి ఇంట్లో వాళ్ల సంక్షేమమే లక్ష్యంగా జీవించే ఇల్లాలిగా మాతృమూర్తిని చిత్రీకరిస్తున్నాయి. అమ్మ అనే హోదా మీద అపోహలను పెంచుతున్నాయి. తమ ఉత్పత్తులకు పేరుగాంచిన నటీమణులను మోడల్స్‌గా పెట్టి అమ్మ అంటేనే బండెడు చాకిరి అనే తప్పుడు భావనలను ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ మంచిగానో... చెడుగానో ప్రభావితం చేస్తాయని మానసిక, మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. మార్చుకుంది మెఘన్ మార్కల్ (అమెరికన్ నటి, ప్రిన్స్ హ్యారీ భార్య) చిన్నప్పటి సంఘటన ఇది. స్కూల్లో ఇంటర్వెల్ బ్రేక్‌లో ఆమె టీవీ చూస్తుండగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ ‘డిష్ బార్ సోప్’ యాడ్ వచ్చిందట. అందులో అమెరికాలోని ఆడవాళ్లంతా జిడ్డు పాత్రలతో యుద్ధం చేస్తున్నారు అనే మాట వాడారట. అది విని పదకొండేళ్ల మెఘన్ బాగా నొచ్చుకుంది. ఇంటికెళ్లాక వాళ్ల నాన్నను అడిగింది. ‘గిన్నెలు తోమడం కేవలం ఆడవాళ్ల పనేనా?’ అని. ‘కాదు ఏం?’ అన్నాడు తండ్రి. ఆ వ్యాపార ప్రకటన గురించి చెప్పింది. ‘ఆ కంపెనీ యజమానికి ఉత్తరం రాయు’ సలహా ఇచ్చాడు. రాసింది. ప్రతిస్పందనా వచ్చింది ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ యాజమాన్యం నుంచి. ‘అమెరికాలోని ప్రజలంతా జిడ్డు పాత్రలతో యుద్ధం చేస్తున్నారు’ అని యాడ్‌ను మార్చుకుంటూ. వంట చేయడం, వంటపాత్రలు తోమడం, బట్టలుతకడం, పిల్లలను పెంచడం కేవలం ఆడవాళ్ల పనులే కాదు మగవాళ్లూ పంచుకోవాల్సినవి అనే ఎరుక మెఘన్కు వాళ్ల నాన్న కల్పించాడు కార్యాచరణతో. అమ్మతో నాన్న ఉండే తీరు.. ఆమెను తనతో సమానంగా చూసే పద్ధతి .. కచ్చితంగా పిల్లలను ప్రభావితం చేస్తాయి. నాన్నా అమ్మను గౌరవంగా చూస్తేనే పిల్లలూ ఆమెను గౌరవిస్తారు. శశి వంటల్లో మేటి. ఆ ఘుమఘుమలతోనే ఆకలి పుడుతుంది. అది అరుదైన ప్రతిభ అని భర్త సతీష్‌కు అర్థం కాదు. అందుకే ‘ఆడవాళ్లు చేసిన వంట మగవాళ్లు చేస్తే ఆర్ట్ (కళ) అవుతుంద ’ని శశి వెటకారమాడుతుంది. తగ్గట్టుగానే సతీష్ ఆమెను మెదడులేని యంత్రంగానే పరిగణిస్తాడు. మూర్ఖురాలిగా అవమానిస్తుంటాడు. తల్లిని అలా జమకట్టే ఆ తండ్రి.. బిడ్డకు ప్రతిభావంతుడిగా కనిపిస్తాడు. ఆమే తండ్రి వరుసను కొనసాగిస్తుంటుంది. ఏదైనా చెప్పబోతే ‘ఇదేమన్నా లడ్డూలు చేయడం అనుకున్నావా?’ అంటూ హేళన చేస్తుంది. తల్లి పేరెంట్ మీటింగ్‌కి వస్తే ఆమె ఇంగ్లిష్ ఉచ్ఛారణకు టీచర్స్ ఎక్కడ నవ్వుతారోనని బెంబేలెత్తిపోతుంది. తండ్రీకూతుళ్ల పద్ధతితో శశి అహం దెబ్బతింటుంది. పట్టుదలతో ఇంగ్లిష్ నేర్చుకుంటుంది. ఆ ఇన్స్టిట్యూట్లోని సహ విద్యార్థి శశి టాలెంట్‌ను ఇష్టపడ్తాడు. ప్రేమను వ్యక్తం చేస్తాడు. అప్పుడు చెప్తుంది ఆ అమ్మ.. ‘నాకు ప్రేమకు కొదవలేదు.. గౌరవమే కరువైంది’ అని. ఇది ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రంలోని శశి పాత్ర (శ్రీదేవి) మాటే అయినా ప్రపంచంలోని దాదాపు తొంభై శాతం అమ్మలు చెప్పాలని.. గొంతెత్తి అరవాలనుకుంటున్న మాట కూడా. దీన్ని నాన్నలు వినాలి. ఇంట్లో పని వ్యాకరణాన్ని మార్చాలి. తగ్గట్టుగా సిలబస్‌ను కూర్చాలి. నాన్నే గురువు పిల్లలకు తొలి గురువు అమ్మే కాదు నాన్న కూడా. ఇంకా చెప్పాలంటే నాన్నే. మాటలు, చేతల్లో మంచి మర్యాద నేర్పేది.. నేర్పాల్సింది నాన్న. అమ్మను తన తోటి జెండర్‌గా పరిగణిస్తూ, ఆమె ఆలోచనలను గౌరవిస్తూ, ఆమె ఇంటి నిర్వహణా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, ఆమె కర్తవ్యాల్లో తానూ భాగమవుతూ! అవి చూస్తూ పెరిగిన పిల్లల్లో అమ్మ పట్ల ఉన్న చులకన భావం పోతుంది. నాన్నంటే ఉన్న అతిశయోక్తీ కరిగిపోతుంది. ఆకలిదప్పులకు ఎలా లింగ వివక్ష ఉండదో, వంటవార్పు, ఇల్లు ఊడ్వడం, బట్టలు ఉతకడం వంటి ఎన్నో ఇంటి పనులకూ జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు. ఉద్యోగం పురుష లక్షణం అనే నానుడితో ఇల్లే ఇల్లాలి ఉద్యోగం అనే ప్రాక్టికాలిటీని ముందుంచారు. రెండూ తప్పే అని తెలుసుకోవాల్సిన కాలం ఇది. చదువుకి జెండర్ లేదు. ఉద్యోగాలకూ జెండర్ ఉండదని నిరూపితమవుతోంది. ప్రతిభకు లింగ వివక్ష అన్న తలంపే రాదని తెలిసిపోయింది. అమ్మలు ఏలని రంగాల్లేవు. రాకెట్లనూ డిజైన్ చేస్తున్నారు. అంతరిక్ష కక్ష్యలోకీ ప్రవేశ పెడుతున్నారు.. పొత్తిళ్లలో బిడ్డను ఎత్తుకున్నంత జాగ్రత్తగా. ఇలా బయటి ప్రపంచంలో తమ ఉనికిని వీళ్లు ఇంత సునాయాసంగా చాటగలుతున్నప్పుడు ఇంట్లోని అంట్ల పనుల్లో.. వంట పనుల్లో.. ఇతరత్రా పనుల్లో పురుషులు ఎందుకు తమ నైపుణ్యాన్ని పరీక్షించుకోరు! మీ ఇంటి అమ్మాయి అత్తింట్లో గౌరవంగా ఉండాలంటే మీ ఇంటి కోడలిని మీరు గౌరవించాలి. ఈ పాఠాన్ని నాన్న నుంచే నేర్చుకుంటాడు కొడుకు. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించగలిగే భార్య దొరికినప్పుడు.. అంట్ల పనిలో నైపుణ్యం చూపించే సత్తా కొడుక్కీ ఉండాలి. దానికి నాన్నే గురువు కావాలి. అమ్మకూ స్వాతంత్య్రం కావాలి అమ్మ కంటే ముందు ఆమె ఒక మనిషి. ఆశలు, ఆశయాలూ ఉన్న యాంబీషియస్ (చదువు, ఉద్యోగం మొదలైనవాటితో సంబంధం లేకుండా) ఉమన్. వాటిని నెరవేర్చుకునే స్వేచ్ఛ, స్వాతంత్య్రం కావాలి ఆమెకు. ఆ వెసులుబాటు కుటుంబమే కల్పించాలి. దీనికీ నాన్నే నాంది పలకాలి అమ్మను అర్థం చేసుకుంటూ. చూస్తూ తెలుసుకుంటారు ఇంటి పనికి లింగవివక్ష ఉండదని. అమ్మ స్థానాన్ని గౌరవించడం అలవర్చుకుంటారు. ఇంట్లో పనిభారం తగ్గి సమయం దొరికితే బయటి ప్రపంచంలోనూ అమ్మ అద్భుతాలు చేస్తుంది. అలా తన సొంత ప్రయత్నాలతో ఆమె తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడమంటే జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో మన దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టడమే. మన ప్రగతిని చాటడమే. అమ్మలూ అప్డేట్ అవ్వాలి మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం వంటి మాటలను ఒంటబట్టించుకోకపోవమే మంచిది. ఇది కఠోర వాస్తవంలా అన్పించినా నిఖార్సయిన నిజం. అమ్మ బిడ్డ ఆకలి తీరిస్తే నాన్న బిడ్డ కాలకృత్యాల సంగతి చూడాలి. అమ్మ బిడ్డకు స్నానమూ, నిద్ర పుచ్చడమూ చేయిస్తుంటే నాన్న వంట సంగతి పట్టించుకోవాలి. హలో.. ఇవన్నీ నాన్న చేస్తూ కూర్చుంటే ఆఫీస్ పని ఎవరు చూస్తారంటూ విసుక్కోవద్దు. ఇప్పుడు చాలాచోట్ల మెటర్నిటీ లీవునే కాదు పెటర్నిటి లీవునూ కల్పిస్తున్నారు. లేనిచోట డిమాండ్ చేసే అవకాశమూ ఉంది. అదీలేకపోతే పిల్లల పెంపకం డ్యూటీలో వంతుల సర్దుబాటునూ చేసుకోవచ్చు. మనసుంటే మార్గాలు అనేకం. అన్వేషించుకోవచ్చు. ఉద్యోగం, ఇంటి పని.. మనిషి లక్షణం. ఆలస్యంగానైనా ఈ సత్యాన్ని గుర్తించాయి చాలా కంపెనీలు. తగ్గట్టుగానే తమ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను మారుస్తున్నాయి. ల్లాయిడ్ తన వాషింగ్ మెషీన్ కోసం చేసిన వ్యాపార ప్రకటనే ఒక ఉదాహరణ. కొత్తగా పెళ్లయిన ఓ జంట వాషింగ్ మెషీన్ కొనడానికి వెళ్తారు. భార్య వాషింగ్ మెషీన్స్ చూస్తుంటే భర్త ఫోన్ చెక్ చేసుకుంటుంటాడు. సేల్స్‌మన్ ‘సర్ వాషింగ్ మెషీన్ మెడల్స్’ అని చూపించబోతాడు. ‘అది ఆమె డిపార్ట్మెంట్.. ఆమెకు చూపించండి’ అని భార్యనుద్దేశిస్తూ అంటాడు భర్త. అప్పుడు భార్య అడుగుతుంది సేల్స్ మన్ని ‘యూనిసెక్స్ వాషింగ్ మెషిన్ మోడల్స్ ఉన్నాయా?’ అని. ‘వాషింగ్ మెషీన్ ఆడవాళ్ల బట్టలు, మగవాళ్ల బట్టలు ఇద్దరివీ ఉతుకుతుంది’ అని వ్యంగ్యంగా అంటాడు భర్త. ‘నిజమే కాని మీరెప్పుడూ ఆ పని చేయలేదు కదా’ అని కౌంటర్ ఇస్తుంది భార్య. అప్పుడు చూపిస్తాడు సేల్స్‌మన్ ఆడవాళ్లు, మగవాళ్లు ఎవరైనా తేలికగా ఆపరేట్ చేసే ఫుల్లీ ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్‌ని. అనివార్యంగా దాని గురించి తెలుసుకుంటాడు భర్త. ఇలా వంటింటి సామాగ్రిని అమ్మే కంపెనీలు కొన్నీ తమ వ్యాపార ప్రకటనలను సవ్యం చేశాయి. రజనీగంధ పెరల్స్ వాళ్లు మదర్స్ డే సందర్భంగానే పిల్లల్లో అమ్మ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాదు అని చూపించే యాడ్స్ చేశారు. ఒక తల్లి తన టీన్స్ కూతురి ప్రవర్తన గురించి ఆందోళన పడుతూంటుంది. ఎక్కడికి వెళ్తున్నావ్, ఎవరితో వెళ్తున్నావ్ వంటి ప్రశ్నలతో అమ్మాయి భద్రతను పర్యవేక్షిస్తుంటుంది. ఒకరోజు చాలా పొద్దుపోయాక ఇల్లు చేరిన కూతురితో ‘ఇంత రాత్రిదాకా ఎక్కడికెళ్లావ్? ఫోన్ చేస్తుంటే కూడా ఆన్సర్ చేయవు’ అని అడుగుతుంది. ఇరవై నాలుగ్గంటలూ నన్ను కనిపెట్టుకొని ఉండకపోతే అమ్మమ్మ దగ్గరకు వెళ్లొచ్చు కదా.. నీకు, మాకూ తెరిపిగా ఉంటుంది’ అంటుంది చిరాగ్గా. ఆ తెల్లవారే పిల్లలు లేచేసరికి అమ్మ ఇంట్లో ఉండదు. అమ్మ చేసే పనంతా ఆ కూతురి మీదే పడుతుంది. తనకన్నా చిన్నవాళ్లయిన తోబుట్టువులిద్దరినీ స్కూల్‌కు రెడీ చేయడం, వాళ్లకు, నాన్నకు లంచ్ బాక్స్‌లు పెట్టడం, ఇల్లు సర్దుకోవడం, సాయంకాలానికి స్నాక్స్ తయారు చేయడం, రాత్రి భోజనం వండడం వగైరా వగైరా. ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకునే సమయం దొరకదు అమ్మాయికి. ఒక్కరోజుకే చుక్కలు కనిపించి ‘అమ్మా ఎప్పుడొస్తావ్’ అనుకుంటుంది. ఆ రాత్రికే అమ్మ వచ్చేస్తుంది. బిడ్డ కళ్లల్లో నీళ్లు. ‘థాంక్స్ అమ్మా.. ఒక్కరోజు సెలవు తీసుకొని నీ వాల్యూ ఏంటో తెలుసుకునేలా చేశావు’ అంటూ అమ్మను హత్తుకుంటుంది. పనిగంటల నియమం లేని అమ్మ చాకిరీకి డబ్బులతో లెక్కగడితే నాన్న సంపాదన సరిపోదు. తరతరాల ఆస్తీ సరితూగదు. అమ్మలూ మారాలి మీ సుఖమే నే కోరుకున్నా.. అందుకు నా జీవితాన్నే ధారపోస్తున్నా అని ఆనందబాష్పాలు రాల్చే అమ్మలు మారాలి. ‘నేను లేకపోతే మా ఇల్లు నడవదండీ.. మావారికి స్టవ్ వెలిగించడం రాదంటే నమ్మండీ... బ్రష్ మీద టూత్ పేస్ట్ పెట్టడం దగ్గర్నుంచి రాత్రి పడుకున్నాక దుప్పటి కప్పడం వరకు అన్నీ నేనే చేయాలి. ఇప్పటికీ (ఇరవై ఏళ్లు వచ్చినా)పిల్లలకు గోరుముద్దలు తినిపించాల్సిందే. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే సరిపడా కూరలు, రోటి పచ్చళ్లు, పులిహోర పులుసు అన్నీ చేసి ఫ్రిజ్‌లో పెట్టెళ్లినా.. అన్నం వండుకోవడం చేతకాదు. పక్కవాళ్లను బతిమాలాలి.. అంటూ గర్వంగా చెప్పుకునే ఇల్లాళ్లు ఆ మాటలను మానేయాలి. కుటుంబ సభ్యులనంత పరాధీనులుగా చేయడం స్వయంకృతాపరాధం. నేటి ఆ పరాధీనత రేపు ఆ ఇంటికి వచ్చే మరో ఆడపిల్లకు నరకంగా మారుతుంది. ఇంకో ఇంటి పరాధీనత మనింటి అమ్మాయిని వంటింటికే అంకితం చేస్తుంది. త్యాగమయి అనే బిరుదు భ్రమ. ఎవరి పని వాళ్లు చేసుకునేలా బాల్యం నుంచే పిల్లలకు తర్ఫీదునివ్వాలి. భార్యగా సంసారంలోని మొదటి అడుగులోనే భర్తకు అతని విధుల జాబితానందివ్వాలి. ఈ అవగాహనే కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆడపిల్లను సాటి మనిషిగా భావించే తరాన్ని తెస్తుంది. ‘అమ్మా.. ఎక్కడికెళ్లావ్.. నాకు ఆకలేస్తోంది’ ‘వంటిల్లును వెంటతీసుకెళ్లలేదుగా నేను? ఇక్కడే ఉంది. కావల్సింది చేసుకొని తినొచ్చు కదా’ ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్. ఇలా సమాధానం చెప్పే ధైర్యం రావాలి అమ్మకు. అప్పుడే ఆమె గౌరవం పెరుగుతుంది. ఇదేం ఘనత? 2014లో ఎకనమిక్ కో ఆపరేషన్ డిస్టింక్షన్ (OECD) అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో నిగ్గు తేలిన నిజం.. ఇంటి పని తనది కాదనుకొనే మగమహారాజులను మోస్తున్నదేశం మనదే. మనవాళ్లు రోజులో పందొమ్మిది నిమిషాలు మాత్రమే ఇంటి పనికి కేటాయిస్తారట. ప్రపంచంలోనే ఇంత తక్కువ ఇంటి పనిచేసే మగవాళ్లు మనవాళ్లేట సుమా! మనకన్నా ముందు స్థానాల్లో కొరియా పురుషులు (21 నిమిషాలు), జపాన్ మెన్ (24 నిమిషాలు), చైనా వీరులు (48 నిమిషాలు) ఉన్నారట. ► 71%: ఇంటి పనుల ఒత్తిళ్లతో దేశంలో దాదాపు 71 శాతం మహిళలకు కంటినిండా నిద్ర ఉండడం లేదని సర్వేల సారాంశం. ► డాడీ #షేర్ వర్క్‌లోడ్ అమ్మంటే ఎముకలు అరిగే చాకిరే అనే అభిప్రాయాన్ని స్థిరపరిచిన వ్యాపార ప్రకటనలే కనిపిస్తున్నా.. అమ్మ కూడా మనిషే.. ఇంటిని నడుముకు కట్టేసుకొని పుట్టలేదు.. ఇంట్లో పని నాన్నది కూడా అని చాటుతున్న వ్యాపార ప్రకటనలూ ఉన్నాయి. ఏరియల్ వాషింగ్ పౌడర్ ‘డాడీ # షేర్ వర్క్ లోడ్’ పేరుతో వాటిని రూపొందించింది. తన కూతురింటికి వెళ్లిన తండ్రి.. కూతురు ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఇల్లు, పిల్లలు, అటు ఆఫీస్ పనితో సర్కస్ చేస్తుంటే అల్లుడు మాత్రం ఆఫీస్ అయిపోగానే ఇంటికొచ్చి ఫోన్లో, టీవీతో ఎంత ధిలాసాగా ఉంటాడో చూస్తాడు. బిడ్డలో తన భార్య, అల్లుడిలో తను కనిపిస్తారు. తన భార్య విషయంలో తనూ అలాగే కదా అనుకుంటాడు. అల్లుడూ తన లాంటి తండ్రి ప్రభావంలోనే పెరిగాడని తెలుసుకుంటాడు. ఇంటికి వెళ్లి భార్యకు సహాయపడడం మొదలుపెడ్తాడు. ఇలా వర్క్ లోడ్‌ను తండ్రులు ఎలా పంచుకోవాలో చాటుతాయి ఆ వీడియోలు. మన మహిళామణుల చాకిరీ ఓఈఎస్డీ సర్వేలో మన ఆడవాళ్లు రోజులో ఎన్ని నిమిషాలు ఇంటి చాకిరీతో చేతులు అరగ్గొట్టుకుంటారో కూడా చెప్పింది. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే ఇంటి కోసం అంటే వంట, బట్టలుతకడం, పిల్లలు, ఇల్లు సర్దడం వగైరా పనుల కోసం రోజులో 298 నిమిషాలు వెచ్చిస్తారట. వాళ్లలా ఇంటి పనుల్లో సతమతమవుతున్న సమయాల్లో మన మగోళ్లు టీవీ చూస్తూ, స్నేహితులతో బాతాఖానీ కొడుతూ, పేకాటాడుతూ దాదాపు 283 నిమిషాలు వినోదం పంచుకుంటారట. మన సగటు మగవాళ్లు రోజులో 703 నిమిషాల కంటే ఎక్కువ అంటే పదకొండు గంటల సమయాన్ని నిద్ర, వినోదం, మద్యంతో పాస్ చేస్తారట. బీ యాన్ ఐరన్ ఉమన్ ఎప్పుడో 80ల్లో ఆడవాళ్లకు పౌష్టికాహారం అనే ప్రభుత్వ ప్రకటనలను దూరదర్శన్ ప్రచారం చేసింది. అలాంటివి ప్రైవేట్ చానెళ్ల కాలంలో రాలేదు అనుకున్నాం కదా. ధన్‌తే రస్ సందర్భంగా రెండు, రెండున్నరేళ్ల కిందట అనుకుంటా స్త్రీధన్ పేరుతో కొన్ని ప్రకటనలు వచ్చాయి వీడియోల రూపంలో. ప్రైవేట్ చానెళ్లతోపాటు సోషల్ మీడియాలోనూ ప్రసారం, ప్రచారం అయ్యాయి. మహిళలకు ఒంటి మీద బంగారం కన్నా ఒంట్లో ఐరన్ మిన్న. బీ యాన్ ఐరన్ ఉమన్ అంటూ. కాబోయే అమ్మలు, అమ్మలు శారీరకంగా, మానసికంగా ఐరన్ ఉమెన్‌గా ఉండడం చాలా అవసరం. నిజంగానే బీ యాన్ ఐరన్ ఉమన్. మగాళ్లంటే వీళ్లు ఇంటి పనుల్లో మహిళలకు చేదోడు వాదోడుగా ఉన్న మగాళ్లు స్లోవేనియా దేశంలో ఉన్నారు. వీళ్లు రోజులో 114 నిమిషాలు ఇంటి పనులకు కేటాయిస్తారట. ఈ దేశం తర్వాత స్థానాల్లో డెన్మార్క్, ఈస్టోనేషియా మగవాళ్లున్నారట. చదవండి: డాక్టరమ్మలు మదర్స్ డే సెల్యూట్ -
డాక్టరమ్మలు మదర్స్ డే సెల్యూట్
కడుపులో దాచుకుంటుంది. కనురెప్పలా కాచుకుంటుంది. కష్టాన్ని ఓర్చుకోవడం నేర్పుతుంది. పోరాడే శక్తిని ఇస్తుంది. చీకట్లను సంహరించే వెలుగు ఖడ్గాన్ని చేతికి ఇస్తుంది. జయము నీదేనని అభయమిస్తుంది. జయించి వస్తే.. ‘భళి భళి భళి.. భళిరా భళి’ అని భుజం తడుతుంది. ఎవరు?! ఇంకెవరు? మాతృమూర్తి! తొమ్మిది నెలలు కడుపులో మోసే ఓరిమి ఎవరికి ఉంటుంది? అమ్మకే కదా. అమ్మలా.. మన డాక్టరమ్మలు కూడా గత పదిహేను నెలలుగా విరామం లేకుండా, అలసటను కనిపించనివ్వకుండా, మోముపై చిరునవ్వును మాయం అవనివ్వకుండా కరోనా రోగులను బిడ్డల్లా సంరక్షిస్తున్నారు. ‘మీకేం కాదు’ అని ధైర్యం చెబుతున్నారు. ‘మేమున్నాం’ అని పక్కనే కూర్చుంటున్నారు! ఊపిరి నిలిపి బతుకు దీపాలు వెలిగిస్తున్నారు. అందుకే ఈ మదర్స్‌డేకి ప్రతి డాక్టరమ్మకూ మనం చేతులెత్తి నమస్కరించాలి. ఆ ఫ్రంట్‌లైన్ వారియర్‌కి సెల్యూట్ చెయ్యాలి. హ్యాపీ మదర్స్ డే డాక్టరమ్మా! మృదుల, భావన, హృద్య, రాఖీ, జుంజుమి, అంజు.. కన్నూర్‌లోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లు. ఒక్కొక్కరూ ఒక్కో విభాగంలో నిపుణులు. అయితే గత ఏడాదిన్నరగా ఆ ఆసుపత్రులలోని కరోనా విభాగాలకే తమ పూర్తి సేవలు అందిస్తున్నారు! మహాశక్తి మాతకు ఉన్నట్లుగా పదీ పన్నెండు చేతులు ఉంటే తప్ప సాధ్యం కాని వైద్యవిధుల్ని ఈ డాక్టరమ్మలు విశ్రాంతి అన్నదే లేకుండా ఉరుకులు పరుగుల మీద నిర్వహిస్తున్నారు. వీళ్లు చెప్పినట్లు కరోనా రోగులు బుద్ధిగా వింటున్నారు. అంటే.. కరోనా రోగులు వినిపించుకునేలా వీళ్లు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు. రోగి విసుగును ప్రదర్శిం^è వచ్చు. కానీ వైద్యులు సహనాన్ని కోల్పోకూడదు. అంతేకాదు, ఔషధంగా కాస్త ఆత్మీయమైన పలకరింపునూ పంచాలి. సాధ్యం అయ్యేదేనా ఇంత ఒత్తిడిలో! సాధ్యం చేశారు ఈ ఆరుగురు మహిళా వైద్యులు. అందుకే వీరి చేత ‘నేషనల్ హెల్త్ మిషన్’, కేరళ వైద్య శాఖ కలిసి ప్రజలకు ధైర్యమిచ్చే, ప్రజల్లో చైతన్యం కలిగించే వీడియోను రూపొందించాయి! ఆ వీడియో గత సోమవారం నెట్లోకి అప్లోడ్ అయింది. వైరస్‌పై విజయం సాధించడానికి ఈ మహిళా డాక్టర్లు ఇచ్చిన ‘నృత్య సందేశం’ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడమే కాదు, ఆలోచన కలిగిస్తోంది. అప్రమత్తతను నేర్పుతోంది. ∙∙ రోగుల మన్ననలను పొందుతున్న ఈ ఆరుగురు మహిళా డాక్టర్ల ప్రస్తావన సమీక్షా సమావేశాలలో వచ్చినప్పుడు వీరందరూ కూడా భారత సంప్రదాయ నృత్యాలలో అభినివేశం ఉన్నవారేనన్న ఒక ఆసక్తికరమైన సంగతి యాదృచ్చికంగా వైద్యాధికారుల దృష్టికి వచ్చింది! వైద్యం ప్రాణాల్ని కాపాడే సంజీవని. నృత్యం ప్రజల్ని ప్రభావితం చేసే కళ. వైద్యాన్ని, నృత్యాన్ని కలిపి ప్రజా ప్రయోజం కోసం ఏమైనా చేయొచ్చా అని యోచించారు. అప్పుడు వచ్చిన ఆలోచనే.. ఈ మహిళా డాక్టర్ల నృత్య రూపకం. మాస్కులు ధరించండి, దూరాన్ని పాటించండి, బాధ్యతగా మెలగండి అని రోజూ ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలనే మృదుల, భావన, హృద్య, రాఖీ, జుంజుమి, అంజు.. తమ నృత్యం ద్వారా నాలుగు నిముషాల సందేశంగా ప్రజల్లోకి పంపారు. హెల్త్ ఇన్స్పెక్టర్ సురేశ్ శ్రేష్ట పాట రాస్తే, ఆ పాటకు ప్రశాంత్ కృష్ణన్ అనే సంగీతకారుడు బాణీలు కట్టి, తనే నేపథ్యగానం అందించారు. ‘అలయ దిక్కున్న మహమారి..’ అనే మలయాళ పల్లవితో పాట మొదలవుతుంది. చరణాలకు అనుగుణంగా ఒక్కో డాక్టర్ ఫ్రేమ్ మీదకు వచ్చి నృత్యాభినయం చేస్తుంటారు. ‘కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్’కు అనుబంధంగా ‘జ్వాల’ అనే మహిళా విభాగం ఉంది. ఆ విభాగం ఆధ్వర్యంలోనే ఈ వీడియోకు రూపకల్పన జరిగింది. అయితే అదంత తేలిగ్గా ఏమీ జరగలేదు. ఆరుగురు డాక్టర్స్‌కి ఒకేసారి షూటింగ్‌కి సమయం దొరికేది కాదు. వార్డునుంచి అరక్షణం బయట పడాలన్నా మెడికల్ స్టాఫ్‌కి వెయ్యి జాగ్రత్తలు చెప్పాల్సి ఉంటుంది. ‘‘మొత్తానికి పూర్తి చేశాం’అని నవ్వుతూ అంటున్నారు డాక్టర్ మృదుల. ఆమె పిల్లల వైద్య నిపుణురాలు. పిల్లల కోసం అమ్మ ఎన్ని చేతుల్ని తగిలించుకుంటుందో ఈ మహిళా వైద్యులు కరోనా నుంచి ప్రజల్ని కాపాడేందుకు అన్ని విధాలా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అందుకే వీళ్లు వట్టి డాక్టర్లు కాదు. డాక్టరమ్మలు. -
మాతృదేవోభవ
-
అంపశయ్యపై మన భాషలు..!
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రెండు వారాలకు ఒక భాష కనుమరుగవుతోంది. దానితో పాటే వారసత్వంగా వస్తున్న అపారమైన జ్ఞానసంపద అంతరించిపోతోంది. భారత్ విషయాని కొస్తే నలభైకు పైగా భాషలు, మాండలికాలు అదే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గదబ, నైకీ గిరిజన తెగల భాషలున్నాయి. పది వేల మంది కంటే తక్కువగా మాట్లాడే భాషలు క్రమక్రమంగా కాలగర్భంలో కలిసి పోతాయని పరిశోధకులు చెబుతున్నారు. వివిధ భాషల వైవిధ్యానికి పెద్దపీట వేసేలా ప్రతీ ఏడాది ఫిబ్రవరి 21న ఐరాస ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 50 ఏళ్లలో 220 భాషలు కనుమరుగు... మనదేశంలో 780 భాషలకు పైగా ఉనికిలో ఉండగా, గత 50 ఏళ్లలోనే 220 భాషలు కనబడకుండా పోయాయి. దీనిని బట్టి భారతీయ భాషలు ఎంత వేగంగా అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కుంటున్నాయన్నది స్పష్టమవుతోంది. ఐరాస విద్యా, శాస్త్రీయ, సాంస్కృతి సంస్థ (యునెస్కో) ఆధ్వర్యంలో నిర్వహించిన వర్గీకరణ ప్రకారం భారత్‌లోని 197 భాషలు ఈ కోవలోకే వస్తాయి. వల్నరబుల్, డెఫినెట్లి ఎండేంజర్డ్, సివియర్లీ ఎండేంజర్డ్, క్రిటికల్లి ఎండేంజర్డ్‌గా ఆ సంస్థ వర్గీకరించింది. వీటిలో బొరొ, మీథీ మాత్రమే భారత్‌లో అధికారికంగా గుర్తించినవి. ఇతర భాషలకు రాత (లిఖిత) వ్యవస్థ కూడా లేదు. జనన గణన డైరెక్టరేట్ నివేదిక ప్రకారం...మనదేశంలో 22 షెడ్యూల్డ్ భాషలతో పాటు లక్ష అంతకు పైగా సంఖ్యలోనే ప్రజలు మాట్లాడే వంద నాన్-షెడ్యూల్డ్ భాషలున్నాయి. అయితే యునెస్కో రూపొందించిన కనుమరుగయ్యే ప్రమాదమున్న భాషలు,మాండలికాల జాబితాలో 40 భారతీయ భాషలున్నాయి. ఈ భాషలను పదివేల మంది కంటే తక్కువ మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ భాషలు అంతరించే ప్రమాదముందని ఓ హోంశాఖ అధికారి పేర్కొన్నారు. యునెస్కో జాబితాలోని 40 భారతీయ భాషలివే... అండమాన్, నికోబార్ ద్వీపాల్లో మాట్లాడే 11 భాషలు...గ్రేట్ అండమానీస్, జరావా, లామొంగ్సే, లూరో,మ్యుయొట్, ఒంగో, పు, సెనెన్యో, సెంటిలీస్, షోంపెన్,తకహనియిలాంగ్ మణిపూర్‌లోని 7 భాషలు...ఐమల్, అక, కొయిరెన్, లామ్‌గంగ్, లాంగ్రాంగ్, పురుమ్, తరావ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు భాషలు...బఘతి, హందురి, పంగ్వలి, సిర్‌మౌది మండ, పర్జి,పెంజో(ఒడిశా) కొరగ, కురుబ (కర్ణాటక), గదబ, నైకీ (ఆంధ్రప్రదేశ్), కోట, తోడ (తమిళనాడు), మ్రా, నా (అరుణాచల్‌ప్రదేశ్), తై నోరా, తైరాంగ్ (అసోం), బంగాని (ఉత్తరాఖండ్), బిర్హొర్ (జార్ఖండ్), నిహాలి (మహారాష్ట్ర), రుగ (మేఘాలయ), టొటొ (పశ్చిమ బెంగాల్) పరిరక్షణ ఏ విధంగా ? సమస్య తీవ్రత నేపథ్యంలో అంపశయ్యపై ఉన్న భాషలను కాపాడుకోవాలి. ఇలాంటి భాషల ఆడియో, వీడియో డాక్యుమెంటేషన్‌తో పాటు వాటిలోని ముఖ్యమైన కథలు చెప్పడం, జానపద, మౌఖిక సాహిత్యం, సంస్కృతి, చరిత్ర వంటి సాంఘిక, సాంస్కృతిక అంశాలను నిక్షిప్తం చేసుకోవాల్సి ఉంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని డిజిటలైజ్ చేయడం ద్వారా ఆయా భాషల వనరులను సంరక్షించుకోవాలి. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు తయారుచేసుకోవాలి. ఈ వనరుల ద్వారా భాషాపరమైన పరికరాలు, పనిముట్లను తయారుచేసుకుని ఈ భాషల వ్యాప్తికి చర్యలు తీసుకోవాలి. ఈ కోవలోని భాషల పదకోషాలు తయారుచేసి, వాటిలోని పదాలను ఏ విధంగా పలకాలన్న దానిపై గ్రంధాలయాల ద్వారా అవగాహన కల్పించాలి. ఆడియో, వీడియో ఉపకరణాల ద్వారా ఇలాంటి భాషలపై విస్తృత ప్రచారం చేయాలి. ప్రతీ భాషలో మౌఖిక సాహిత్య భాండాగరం నిక్షిప్తమై ఉన్నందున కనుమరుగయ్యే భాషలపై ఈ విషయంలో ప్రత్యేక దృష్టి నిలపాలి. ప్రస్తుతం చౌక ధరలకే స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆడియో, వీడియోలు రికార్డ్ చేసి, ఫొటోలు తీసుకుని డేటాను తయారుచేసుకునే వీలుంది. కృతిమ మేథస్సు విస్తృత ప్రచారంలోకి వస్తున్నందున దానిని కూడా ఈ భాషల పరిరక్షణకు ఉపయోగించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎక్కువ భాగం ఇంటికే..
సంపాదనకు విదేశాలకు వెళ్లినా కుటుంబ బాధ్యతల్లో ముందే ఉంటున్న మహిళలు దుబాయ్: మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో పోటాపోటీగా దూసుకుపోతున్నా కుటుంబ బాధ్యతలను ఏమాత్రం విస్మరించడం లేదు. కొత్త అవకాశాల కోసం దేశ సరిహద్దులను దాటి ప్రయాణించినా ఇంటి అవసరాలను తీర్చడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఏ దేశంలో పనిచేస్తున్నా తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని రెమిటెన్స్‌ల రూపంలో ఇంటికి పంపుతున్నారు. పురుషుల కంటే ఎక్కువగానే వారు పంపుతున్న విషయం ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. డబ్బును బదిలీ చేసే సర్వీస్ ప్రొవైడర్లలో ప్రధానమైన వెస్ట్రన్ యూనియన్ సంస్థ అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ‘ఇతర దేశాలకు వలస వెళ్లిన మహిళలు-ఆర్థిక ప్రభావం’ అనే అంశంపై అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులోని ప్రధానాంశాలు వెస్ట్రన్ యూనియన్ మధ్యప్రాచ్య, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, ఈస్ట్రన్ యూరప్ ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ ఫరా మాటల్లో... * ప్రపంచవ్యాప్తంగా డబ్బును బదిలీ చేయడంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. వీరు గ్లోబల్ ఎకనమీ అభివృద్ధిలో పాలుపంచుకుంటూనే కుటుంబ ఆర్థిక అవసరాలను తీరుస్తూ కీలకపాత్ర పోషిస్తున్నారు. * గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన మహిళలతో చాలామంది తల్లులు గానీ లేదా తల్లిదండ్రులకు చేయూతనిచ్చేందుకు వచ్చినవారే. * ముఖ్యంగా పురుషులుగానీ, స్త్రీలు గానీ డబ్బు పంపుతున్నది ఎక్కువ భాగం మహిళలకే(డబ్బును అందుకుంటున్న వారిలో మూడింట రెండొంతులు వారే). దీన్ని బట్టి ఇంటి ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో మహిళలు ఎంత కీలకమో తెలుస్తోంది. * విదేశాలకు వలస వెళ్లిన 48 శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేయడంగానీ, సొంత వ్యాపారాలు గానీ నిర్వహిస్తున్నారు. * విదేశాల నుంచి పురుషులు పంపుతున్న డబ్బుకు సమానంగా మహిళలు కూడా పంపుతున్నారు. మగవారి కన్నా తక్కువగా సంపాదిస్తున్నప్పటికీ సంపాదనలో ఎక్కువ భాగాన్ని కుటుంబానికి పంపుతున్నారు. * బ్యాంకు ఖాతాల్లో తక్కువగా ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో మహిళలు (13.4).. పురుషులకు (15.6 శాతం) ధీటుగా ఉన్నారు. -
ఆ ఋణం తీరేదెలా?
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం అది ఆదివారం. వంటింట్లో ఉన్న తల్లి దగ్గరకు కార్తీక్ ఎంతో ఉత్సాహంగా వచ్చాడు. ‘‘అమా! నువ్వు నాకెంత ఇవ్వాలో లెక్క రాశాను’’ అంటూ ఒక కాగితం అందించాడు. తల్లి ఆశ్చర్యంగా, కొంత అయోమయంగా ఆ కాగితం వైపు చూసి ‘‘నేను వంట చేస్తున్నాను. నా చేతులు ఖాళీగా లేవు. అది ఏమిటో నువ్వే చదివి చెప్పు’’ అది.‘‘ఈ రోజు నేను నీ కోసం చాలా పనులు చేశాను. నువ్వు ఒక్కో పనికి ఎంత చెల్లించాలో లెక్క రాశాను’’ అన్నాడు కార్తీక్.చేస్తున్న పనిని మధ్యలో వదిలేసి, కార్తీక్ చేతిలోంచి కాగితం అందుకుంది తల్లి. అందులో ఇలా రాసి ఉంది...‘‘మొక్కలకు నీళ్ళు పోశాను. దానికి 20 రూపా యలు. గది సర్దుకున్నాను. దానికి 50 రూపాయలు.మార్కెట్‌కు వెళ్ళాను. దానికి 30 రూపాయలు. వర్షం పడుతోంటే మేడ మీద నుండి బట్టలు తెచ్చాను. దానికి 20 రూపాయ లు. మొత్తం 120 రూపాయలు. అది చదవగానే తల్లి బిత్తరపోయింది. ‘‘ఇక నుండి ఇలాగే లెక్క రాస్తానమ్మా. నేను ఇంట్లో చేసే ప్రతి పనికీ నువ్వు నాకు డబ్బులివ్వాలి’’ అన్నాడు. అప్పటికే ఆ ఆశ్చర్యంలోంచి బయటపడ్డ ఆమె ‘‘తప్పకుండా ఇస్తాను. ఒకసారి పెన్ను ఇవ్వు’’ అంది. కాగితం వెనుక ఆమె ఏదో రాసి, కార్తీక్‌కి ఇస్తూ.... ‘‘వీటికి కూడా లెక్క వెయ్యి. నేను నీకివ్వాల్సిన దాంట్లో నుంచి ఇది తీసివేసి, అప్పుడు నీకెంత రావాలో చెబితే అంత ఇచ్చేస్తాను’’ అంది. కార్తీక్ ఆ కాగితం తీసుకుని చదివాడు. నిన్ను తొమ్మిది నెలలు కడుపులో మోశాను... డబ్బులు తీసుకోలేదు. నిన్ను పదమూడేళ్ళుగా జాగ్రత్తగా పెంచుతున్నాను. డబ్బులు తీసుకోలేదు. నీకు రోజూ భోజనం వండి పెడుతున్నాను. డబ్బులు తీసుకోలేదు. నీకు జ్వరం వచ్చినప్పుడల్లా కంటికి రెప్పలా కాపాడుతున్నాను. డబ్బులు తీసుకోలేదు. ప్రతిరోజూ నీ చేత హోమ్‌వర్క్ చేయిస్తున్నాను. డబ్బులు తీసుకోలేదు. నువ్వు పడుకునేటప్పుడు కథలు చెప్తున్నాను. దానికీ డబ్బులు తీసుకోలేదు...అని ఉంది.అది మొత్తం చదివాక చిన్నారి కార్తీక్‌కు తన పొరపాటు ఏమిటో అర్థమైంది. ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్ళు నిండుకున్నాయి. ‘‘సారీ అమ్మా’’ అంటూ కాగితం చింపేసి, బయటకు పరుగెత్తాడు. -
రెండు చేతులు... వేయి బాధ్యతలు... అలుపెరుగని అమృతమూర్తి
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం ఈ ప్రపంచం విశాలమైనదా? అమ్మ హృదయం విశాలమైనదా? అని అడిగితే వచ్చే సమాధానం ఒక్కటే! అమ్మ హృదయం అని! అవును మరి! ఈ ధరిత్రికి ఉన్న ఓర్పు ఈ ప్రపంచంలో ఒక్క అమ్మకు తప్ప మరెవరికి ఉంది? అందుకే తల్లి ... పుడమితో సమానం. ప్రపంచంలో నాగరక, ఆటవిక జాతులన్నింటిలోనూ తల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రపంచానికి భావితరాలను అందించే వ్యక్తి ఆమే కదా! నవ మాసాలూ మోసి బిడ్డను కనడం మహిళకు మరో జన్మ అంటారు. ఎందరో మహిళలు పసిగుడ్డుకు జన్మనిచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. అయినా అమ్మ ఆ భారాన్ని మోస్తూనే వస్తోంది. భవిష్యత్తులోనూ దాన్ని ఓ భారం అనుకోకుండా మోస్తూనే ఉంటుంది. ఓ పసిగుడ్డుకు ప్రాణం పోయడానికి ఎంత శ్రమపడాల్సి ఉంటుందో తెలిసినా ఆ తల్లి ఈ ప్రపంచానికి ఒక తరాన్ని అందించడానికి తన ప్రాణాలను పణంగా పెడుతూనే ఉంది. అందువల్లనే అమ్మకు అత్యున్నత స్థానం లభించింది. అమ్మగా అనేక పనులు ఆడపిల్లగా పుట్టిన క్షణం నుండి ఓ కుటుంబంలో ఆమె ప్రయాణం ఆరంభమై, కూతురుగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, వదినగా, అత్తగా, ఆడపడుచుగా, అమ్మమ్మగా, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి తాను ఒక్కటిగా, అందరికీ అవసరమైన వ్యక్తిగా కుటుంబంలో, సమాజంలో నిలుస్తుంది. ఓ టీచర్‌గా.... బిడ్డ పుట్టిన తర్వాత చనుబాలు ఇవ్వడంతో తల్లి తన బిడ్డకు ఒక గురువుగా మారుతుంది. ఆ బిడ్డ ప్రతి కదలికలోనూ తల్లి మార్గదర్శకత్వం ఉంటుంది. ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా జీవించాలి, జీవితపు ఆఖరు క్షణాలను హుందాగా ఎలా ఆహ్వానిం చాలి... అన్నీ తల్లే నేర్పిస్తుంది. అక్షరాలు మొదలుకొని జీవితపు ఆఖరి మజిలీ వరకు తల్లి నేర్పిన పాఠాలే మనిషిని ముందుకు నడిపిస్తాయి. రామకృష్ణ పరమహంస తన భార్యలో కూడా తల్లిని దర్శించిన మహనీయుడు. ఆయన అంతటి గొప్ప వ్యక్తి కావడానికి స్ఫూర్తి ఆయన తల్లే. అలాగే వివేకానందుని జీవితం కూడా. తల్లి నేర్పిన జీవిత పాఠాలే ప్రపంచానికి ఆయన ఆదర్శమూర్తి కావడానికి కారణం. ఇక గాంధీ మహాత్ముని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? ఆయన స్వయంగా తన ఆత్మకథలో అమ్మ గురించి ఎన్నో సందర్భాలలో చెప్పుకున్నాడు. ప్రపంచానికే ఆదర్శమూర్తులైన ఆ వ్యక్తుల తల్లులు ఇంకెంత గొప్ప ఆదర్శమూర్తులో ఆలోచించండి? ఒక గృహిణిగా... ప్రతి తల్లీ ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరనే చెప్పాలి. కలెక్టర్ ఒక జిల్లాలోని అన్ని శాఖలను ఎలా సమన్వయం చేసి నడుపుతాడో ఒక తల్లి కూడా ఇంటిలో ఉండే అన్ని శాఖలను, వ్యవహారాలను సమన్వయం చేసి ముందుకు నడుపుతుంది. ఇంటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూస్తుంది. పిల్లల మధ్యన గొడవలు రాకుండా, ఇంట్లోని వ్యక్తుల మధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పడంలో చొరవ తీసుకుంటుంది. రోజువారీ కార్యక్రమాలు, ఆదాయం - వ్యయం, బంధుమిత్ర వర్గం, క్రమశిక్షణ, ఇంటి నిర్వహణ, జనన మరణాలు... ఒకటేమిటి! ఎన్ని విభాగాలో? అన్నింటినీ నేర్పుతో నిర్వహిస్తుంది. ఖర్చు చేయడంలో, పొదుపు చేయడంలో ఆమెకు సాటి మరొకరు లేరు. అనునిత్యం ఆమె ఇంటి గురించే ఆలోచిస్తుంది. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకున్న చాలామంది ‘నేను ఈ స్థాయికి రావడానికి నా భార్య కృషి ఎంతో ఉంది’ అని చెబుతుంటారు. అందులో సందేహమేమీ లేదు. వ్యాపార సామ్రాట్టులుగా ప్రపంచంలో పేరు తెచ్చుకున్న అంబానీల తల్లినే తీసుకోండి. కొడుకులు కోట్లాది రూపాయల వ్యాపారాలకు అధిపతులైనా, తగవులు వచ్చినప్పుడు తల్లి మాత్రమే తీర్పు చెబుతుంది. ఎలాంటి ఆడంబరాలకూ పోకుండా సహజత్వానికి దగ్గరగా ఉండే మహిళ ప్రపంచాన్ని ఏలే కొడుకులను తీర్చిదిద్దుతుంది. పెపైచ్చు, అందులో తన గొప్పదనం ఏమీ లేదని ఎంతో వినమ్రంగా చెబుతుంది. ఒక మనిషి - అనేక కోణాలు జడ్జిగా ఎన్నో తీర్పులు చెప్పే కొడుకు ఇంటికి వచ్చి ఒకానొక కేసులో తీర్పు ఎలా ఉండాలో తల్లిని సలహా అడుగుతాడు. దినమంతా కలెక్టరుగా ఎన్నో శాఖల పనులను చక్కబెట్టి ఇంటికి వచ్చి తల్లిని సలహాలు అడుగుతాడు. బజార్లో పోట్లాడి ఇంటికి వచ్చిన కొడుక్కి బుద్ధి నేర్పుతుంది తల్లి. ఇంటి బయటి గొడవలను తన మాటలతో సద్దుమణిగేట్లు చేస్తుంది. తన పిల్లలే కాదు తాను ఉంటున్న వీధిలోని పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలనే విశాలహృదయం గల ప్రత్యక్ష దేవత తల్లి. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరిగి ఆమె పరిధి మరింత విస్తృతమవుతుంది. కొడుకులు, కూతుళ్లకు కుటుంబాలను ఏర్పరుస్తుంది. అమ్మమ్మగా, నానమ్మగా మనుమలను కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏ మాత్రం స్వార్థం లేకుండా తన శక్తియుక్తులనన్నింటినీ తన వారి కోసం ధారపోసి తనువు చాలిస్తుంది స్ఫూర్తి ప్రదాత వేల ఏళ్ళ నుండీ చరిత్రను గమనిస్తే ఒక విషయం కనిపిస్తుంది. ఎంతోమంది రాజులు తమ రాజ్య పరిపాలనలో తల్లినే ఆదర్శంగా తీసుకున్న నిదర్శనాలెన్నో కనబడతాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు, మరాఠా మహారాజు శివాజీ ఇందుకు నిదర్శనాలు. శివాజీ ప్రతి పనిలో తల్లిని సంప్రదించేవాడు. గాంధీజీ నేటియుగంలో మహాత్ముడు అయ్యాడంటే అది ఆయన తల్లి గొప్పదనం. ఎన్నో కంపెనీలకు అధిపతులుగా ఉన్న ఎందరో పారిశ్రామిక వేత్తల జీవితాలలో స్ఫూర్తి నింపింది వారి అమ్మ అనడంలో సందేహం లేదు. ఎందరో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి నాయకులు, అధికారులు తమ ఉన్నతిలో తమ తల్లి పాత్ర ఎంతో ఉందని అనేక సందర్భాలలో చెబుతూనే ఉన్నారు. తల్లిని కళ్ళెదుట కనిపించే దైవంగా కొలిచే కొడుకులు ఉన్నారు. కొన్ని చోట్ల తల్లికి గుడి కట్టిన కొడుకులూ ఉన్నారు. తల్లి గొప్పతనాన్ని కమనీయంగా మలిచిన సినిమాలు చాలానే వచ్చాయి.అందరూ అమ్మ గొప్పతనాన్ని గుర్తిస్తున్నారా అంటే సందేహమే. నవమాసాలూ మోసి, కని పెంచిన అమ్మను వార్ధక్యంలో పట్టించుకోకుండా, వదిలేసిన సంతానమూ లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో ‘మదర్స్ డే’ మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటోంది. మాతృదినోత్సవం అమ్మ పాత్రను గుర్తించిన ప్రపంచం ఆమె కోసం ఒక రోజును కేటాయించి ఆ రోజున అందరూ ఆమె గొప్పతనాన్ని స్మరించుకొనేలా చేస్తోంది. ప్రపంచ చరిత్రను చూస్తే మాతృదినోత్సవాన్ని ఒక వేడుకగా జరుపుకోవడం 1914లో మొదలైంది. అమెరికాకు చెందిన అన్నా జార్విస్ అనే మహిళ మాతృదినోత్సవాన్ని నిర్వహించడానికి ఆద్యురాలు. ఆమె 1908లోనే ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆమె తల్లి మే 9న చనిపోయింది. ఆ తేదీయే ఇప్పుడు అమెరికాలో అధికారిక మాతృదినోత్సవంగా స్థిరపడింది. ప్రపంచ చరిత్ర లోతుల్లోకి వెళితే భారతీయ సమాజంతో పాటు గ్రీకులు, రోమన్లు సైతం ‘అమ్మ దేవత’ గా రియా, సైబిలిలను కొలిచేవారు. క్రైస్తవులు పూర్వకాలంలో అమ్మ దినోత్సవాన్ని ‘ఆదివారం అమ్మ’ గా ఆదివారం నాడు వేడుక జరుపుకునేవారు. బ్రిటన్, కొన్ని ఐరోపా దేశాలలో మే నెలలో నాలుగో ఆదివారాన్ని మాతృదినోత్సవంగా జరుపుకొంటున్నారు. పుతలీబాయి గాంధీజీ పుతలీబాయికి నాలుగో కొడుకు. కరమ్‌చంద్ గాంధీతో పెళ్లి నాటికి ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలే. వయసు చిన్నదే అయినా ఆమె తన పిల్లలనే కాక మిగతా పిల్లలనందరినీ తన పిల్లలుగానే భావించేది. ప్రేమానురాగాలను పంచేది. చిన్న కొడుకైన గాంధీజీ అంటే పుతలీబాయికి ఎనలేని ప్రేమ. చిన్నప్పటి నుండే తల్లి ప్రేమను గాంధీజీ అర్థం చేసుకున్నాడు. తల్లి దగ్గరే అనేక విషయాలు నేర్చుకున్నాడు. ‘అబద్ధం చెప్పకూడదు. సత్యమే పలకాలి’ అనేవి ఆయన ఆయుధాలు. పుతలీబాయి భారత, భాగవత కథలు చక్కగా చెప్పేది. తల్లిదండ్రులను జీవితాంతం కావడిలో పెట్టి మోసిన శ్రవణ కుమారుడి కథ గాంధీజీకి ఎంతో ఇష్టం. అందుకే గాంధీజీ కూడా తల్లిదండ్రుల పట్ల గౌరవభావంతో ఉండేవాడు. పుతలీబాయి ఆచార వ్యవహారాలు పాటించేది. దైవ ప్రార్థన చేసేది. బీదపిల్లలకు సాయం చేసేది. నిరాడంబరత, ఓర్పు, సహనం, క్షమ వంటివి గాంధీజీకి తల్లి నుండే అలవడ్డాయి. ఆమె వల్లే గాంధీజీ అంత గొప్పవాడయ్యాడు. మేరీ మాత మేరీమాత జీసస్కు తల్లి. జీసస్‌ను దేవుని బిడ్డగా భావిస్తారు. భగవంతుని ప్రేరణతోనే కొడుకుగా మేరీ గర్భం నుండి జీసస్ ఉద్భవించాడు. అప్పటికి ఆమె యవ్వనంలో ఉంది. ఆమె తల్లిదండ్రులు జోచిమ్, అన్నే మేరీలకు దేవుడన్నా, జూవిష్ మతమన్నా ఎంతో అభిమానం. అందరికీ ఆమె ఓ సాధారణ ఆడపిల్ల అనే తెలుసు. భగవంతుడు దేవదూత గాబ్రియేలును తన దూతగా నజరేత్ పట్టణానికి పంపించాడు. అతడు భగవంతుని ఆశయాన్ని ఆమెకు వినిపించాడు. అలా మేరీ, ఆమె భర్త జోసేఫ్లకు జీసస్ జన్మించాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఎన్నో ఏళ్ళు నజరేత్ పట్టణంలోనే ఉన్నారు. చిన్నప్పటి నుండే జీసస్కు భగవంతుని పట్ల ప్రేమను ఆమె పురికొల్పింది. తదనంతరం జీసస్ భగవంతుని బిడ్డగా అందరి మన్ననలు పొందాడు. భగవంతుని కోసం ప్రాణాలను అర్పించాడు. తన కొడుకు చనిపోయాడన్న బాధ ఆమెలో ఎప్పుడూ లేదు. భగవంతుని కోసం ప్రాణాలను ఇచ్చిన గొప్పవాడుగానే భావించింది. అందుకే ఆమె క్రైస్తవ మత ప్రజలందరికీ తల్లిగా మారిపోయింది. భువనేశ్వరీదేవి వివేకానందుడు ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చుకొనేలా ఎదగడానికి కారణం అతని తల్లి భువనేశ్వరీదేవి. చిన్నప్పుడే భర్త చనిపోవడంతో ఇంటి బరువు బాధ్యతలను ఆమె తన మీద వేసుకుంది. చిన్నతనంలోనే వివేకానందుడికి పురాణ కథలు చెప్పింది. ఆమె చెప్పిన విషయాలు వివేకానందుని మనసులో నాటుకుపోయాయి. దేశ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయడానికి ఏం చేయాలో అతనికి అర్థమైంది. అతడు శ్రీరామకృష్ణ పరమహంసను కలవడంతో అది మరింత బలపడింది. తల్లి ఏనాడూ దేనికీ అతనికి అడ్డు చెప్పలేదు. వివేకానందుడు భవిష్యత్తులో ఎంతో గొప్ప వ్యక్తి అవుతాడన్న విషయాన్ని అతని చిన్నతనంలోనే ఆమె గమనించింది. అందుకే అన్ని సందర్భాలలో సరైన మార్గదర్శకత్వం చేసింది. ‘‘నేను నా తల్లికి ఎంతో రుణపడి ఉన్నా. విపత్కర పరిస్థితుల్లోనూ ఆమె ప్రశాంతంగా ఉండేది. సమస్యనెలా ఎదుర్కోవాలో ఆమెకు బాగా తెలుసు. ఈ లక్షణాలన్నీ నేను నా తల్లి నుండే పుణికిపుచ్చుకున్నా’’ అని వివేకానందుడు చెప్పారు. మదర్ థెరిసా 1910 ఆగస్టు 26న యుగొస్లేవియాలో జన్మించిన మదర్ థెరిసా ఇప్పుడు విశ్వమాతగా కొనియాడబడుతోంది. ఆమెకు ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఆమెను తమ మత ఆచారాల ప్రకారం పెంచింది. పన్నెండేళ్ళ వయసులోనే ఆమె సన్యసించాలని నిర్ణయించుకుంది. కానీ తల్లి అప్పుడు ఒప్పుకోలేదు. చివరికి పద్ధెనిమిదేళ్ళ వయసులో 1928 ఆగస్టు 15న ఆమె లొరెటో మిషనరీలో సన్యాసినిగా చేరిపోయింది. 1929లో ఆమె భారతదేశానికి వచ్చింది. అనాథ పసిపిల్లలకు తల్లిగా ఎంతో సేవ చేసింది. కులం, మతం పక్కన పెట్టి ఆమె కలకత్తా నగరంలో రోగులకు, వితంతువులకు, అనాథలకు చేసిన సేవ జగమెరిగినదే. 1943లో కలరా వచ్చినప్పుడు ఎందరికో వైద్య సేవలు అందించింది. 1946లో ఆమె రైలులో ప్రయాణిస్తుండగా దేవుని వాక్యాలను విన్నది. ఇక అప్పటి నుండి ఆమె తన పూర్తి జీవితాన్ని దీనుల కోసం అంకితం చేసింది. కలకత్తాలో పాఠశాలలు, వైద్య సౌకర్యాలు, అనాథ గృహాలు ప్రారంభించింది. తన సేవను భగవంతుని సేవగా భావించింది. ఏ సందర్భంలోనూ ఇతరులను చూసి అసహ్యించుకోలేదు. విపత్కర పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండడం ఆమె స్వభావంగా మారింది. భారత పౌరసత్వం పొందింది. మొత్తం ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు పొందింది. ఎన్నో దేశాలు ఆమెకు అత్యున్నత పురస్కారాలు ఇచ్చి గౌరవించాయి .