‘అమ్మ’ తెలుగు భాషలో ఈ పదం కన్న గొప్పది మరొకటి లేదు. నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. పిల్లలు అంద వికారంగా ఉన్నా, అంగవైకల్యం కలిగి ఉన్న గుండెలకు హత్తుకొని పెంచుకుంటుంది అమ్మ. అందుకే కనిపించే దైవం అమ్మ అంటారు. మనం తిట్టినా, కొట్టిన తల్లి ప్రేమ మారదు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆమె దృష్టిలో పిల్లాడిలాగే ఉంటాం. అందుకే అంటారు కాబోలు.. ‘ఢిల్లికి రాజైనా తల్లికి కొడుకే’. అమ్మ గురించి, అమ్మ గొప్పదనం గురించి చెప్పుకునేందుకు మరో సందర్భం మాతృ దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగులో వచ్చిన ‘అమ్మ’పాటలు మీకోసం..
Comments
Please login to add a commentAdd a comment