ఎక్కువ భాగం ఇంటికే.. | Women to give preference more only for home | Sakshi
Sakshi News home page

ఎక్కువ భాగం ఇంటికే..

Published Mon, Mar 23 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

ఎక్కువ భాగం ఇంటికే..

ఎక్కువ భాగం ఇంటికే..

సంపాదనకు విదేశాలకు వెళ్లినా కుటుంబ బాధ్యతల్లో ముందే ఉంటున్న మహిళలు
 దుబాయ్: మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో పోటాపోటీగా దూసుకుపోతున్నా కుటుంబ బాధ్యతలను ఏమాత్రం విస్మరించడం లేదు. కొత్త అవకాశాల కోసం దేశ సరిహద్దులను దాటి ప్రయాణించినా ఇంటి అవసరాలను తీర్చడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఏ దేశంలో పనిచేస్తున్నా తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని రెమిటెన్స్‌ల రూపంలో ఇంటికి పంపుతున్నారు. పురుషుల కంటే ఎక్కువగానే వారు పంపుతున్న విషయం ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. డబ్బును బదిలీ చేసే సర్వీస్ ప్రొవైడర్లలో ప్రధానమైన వెస్ట్రన్ యూనియన్ సంస్థ అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ‘ఇతర దేశాలకు వలస వెళ్లిన మహిళలు-ఆర్థిక ప్రభావం’ అనే అంశంపై అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులోని ప్రధానాంశాలు వెస్ట్రన్ యూనియన్ మధ్యప్రాచ్య, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, ఈస్ట్రన్ యూరప్ ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ ఫరా మాటల్లో...

*  ప్రపంచవ్యాప్తంగా డబ్బును బదిలీ చేయడంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. వీరు గ్లోబల్ ఎకనమీ అభివృద్ధిలో పాలుపంచుకుంటూనే కుటుంబ ఆర్థిక అవసరాలను తీరుస్తూ కీలకపాత్ర పోషిస్తున్నారు.
*  గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన మహిళలతో చాలామంది తల్లులు గానీ లేదా తల్లిదండ్రులకు చేయూతనిచ్చేందుకు వచ్చినవారే.
*   ముఖ్యంగా పురుషులుగానీ, స్త్రీలు గానీ డబ్బు పంపుతున్నది ఎక్కువ భాగం మహిళలకే(డబ్బును అందుకుంటున్న వారిలో మూడింట రెండొంతులు వారే). దీన్ని బట్టి  ఇంటి ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో మహిళలు ఎంత కీలకమో తెలుస్తోంది.
*  విదేశాలకు వలస వెళ్లిన 48 శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేయడంగానీ, సొంత వ్యాపారాలు గానీ నిర్వహిస్తున్నారు.
*  విదేశాల నుంచి పురుషులు పంపుతున్న డబ్బుకు సమానంగా మహిళలు కూడా పంపుతున్నారు. మగవారి కన్నా తక్కువగా సంపాదిస్తున్నప్పటికీ సంపాదనలో ఎక్కువ భాగాన్ని కుటుంబానికి పంపుతున్నారు.
*    బ్యాంకు ఖాతాల్లో తక్కువగా ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో మహిళలు (13.4).. పురుషులకు (15.6 శాతం) ధీటుగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement