'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు' అన్న డైలాగ్ కేజీఎఫ్ సినిమాలో చెప్పిందే కావొచ్చు. కానీ ఒక తల్లి ప్రేమ అంతకు మించి ఉంటుందని మాత్రమే చెప్పగలను. తొమ్మిది నెలలు తాను ఎన్నో బాధలను దిగమింగి బిడ్డకు జన్మినిస్తుంది. అంతే కాకుండా తన పిల్లల కలలను నెరవేర్చడానికి జీవితాంతం కష్టపడుతుంది. కానీ ఎప్పుడే గానీ తన బాధను బయటికి చెప్పలేని పిచ్చి ప్రేమ అమ్మది. అలాంటి అమ్మకు మన జీవితంలో ఏం చేసినా తక్కువే అవుతుంది. తల్లికి తన బిడ్డపై ఉండే ప్రేమకు ప్రపంచంలో ఏదీ సాటిరాదు. అలాంటి అమ్మ ప్రేమను మనకు తెలియజేస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. మదర్స్ డే సందర్భంగా ఆ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం.
'మాతృ దేవో భవ'
మాధవి, నాసర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాతృ దేవో భవ'. ఈ చిత్రాన్ని కెఎస్ రామారావు నిర్మించగా.. కె అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1993లో విడుదలైన ఈ చిత్రం క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం మలయాళంలో సిబి మలైల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశదూతు’కి రీమేక్. ఈ చిత్రం తరువాత హిందీలో 'తులసి'గా రీమేక్ చేశారు. అదే నిర్మాత-దర్శకులు నిర్మించగా మనీషా కొయిరాలా, ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రం వూట్, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
'బిచ్చగాడు'
తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది.
ప్రభాస్ 'ఛత్రపతి'
2005లో విడుదలైన ‘ఛత్రపతి’ అప్పట్లో ప్రభాస్‌కి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రెండు పొరలు ఉన్నాయి, అందమైన తల్లీ కొడుకుల అనుబంధం మరియు మంచి ప్రతీకార కథ. ఈ సినిమాలో భానుప్రియ, శ్రియ శరణ్ కూడా నటిస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి.
అమ్మ చెప్పింది
2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
అమ్మా రాజీనామా
1991లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం అమ్మ రాజీనామా. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తను బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దాసరి చేసిన సినిమాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో శారద ప్రధాన పాత్రలో నటించారు. 2001లో ఈ సినిమాను కన్నడలోనూ అమ్మ పేరుతో రీమేక్ చేశారు. ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్, యూ ట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.
యమ లీల
1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం యమలీల. ఈ సినిమాలో ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గాను సుచిత్రకు ఉత్తమ నృత్య దర్శకురాలిగా నంది పురస్కారం లభించింది. ఈ చిత్రం హిందీలో ‘తక్‌దీర్‌వాలా’గా, తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
'నిజం'
కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి: 2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
యోగి:
ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment