matrudevobava
-
మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిత్రాలివే
'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు' అన్న డైలాగ్ కేజీఎఫ్ సినిమాలో చెప్పిందే కావొచ్చు. కానీ ఒక తల్లి ప్రేమ అంతకు మించి ఉంటుందని మాత్రమే చెప్పగలను. తొమ్మిది నెలలు తాను ఎన్నో బాధలను దిగమింగి బిడ్డకు జన్మినిస్తుంది. అంతే కాకుండా తన పిల్లల కలలను నెరవేర్చడానికి జీవితాంతం కష్టపడుతుంది. కానీ ఎప్పుడే గానీ తన బాధను బయటికి చెప్పలేని పిచ్చి ప్రేమ అమ్మది. అలాంటి అమ్మకు మన జీవితంలో ఏం చేసినా తక్కువే అవుతుంది. తల్లికి తన బిడ్డపై ఉండే ప్రేమకు ప్రపంచంలో ఏదీ సాటిరాదు. అలాంటి అమ్మ ప్రేమను మనకు తెలియజేస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. మదర్స్ డే సందర్భంగా ఆ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 'మాతృ దేవో భవ' మాధవి, నాసర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాతృ దేవో భవ'. ఈ చిత్రాన్ని కెఎస్ రామారావు నిర్మించగా.. కె అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1993లో విడుదలైన ఈ చిత్రం క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం మలయాళంలో సిబి మలైల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశదూతు’కి రీమేక్. ఈ చిత్రం తరువాత హిందీలో 'తులసి'గా రీమేక్ చేశారు. అదే నిర్మాత-దర్శకులు నిర్మించగా మనీషా కొయిరాలా, ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రం వూట్, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. 'బిచ్చగాడు' తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది. ప్రభాస్ 'ఛత్రపతి' 2005లో విడుదలైన ‘ఛత్రపతి’ అప్పట్లో ప్రభాస్‌కి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రెండు పొరలు ఉన్నాయి, అందమైన తల్లీ కొడుకుల అనుబంధం మరియు మంచి ప్రతీకార కథ. ఈ సినిమాలో భానుప్రియ, శ్రియ శరణ్ కూడా నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి. అమ్మ చెప్పింది 2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అమ్మా రాజీనామా 1991లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం అమ్మ రాజీనామా. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తను బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దాసరి చేసిన సినిమాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో శారద ప్రధాన పాత్రలో నటించారు. 2001లో ఈ సినిమాను కన్నడలోనూ అమ్మ పేరుతో రీమేక్ చేశారు. ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్, యూ ట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది. యమ లీల 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం యమలీల. ఈ సినిమాలో ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గాను సుచిత్రకు ఉత్తమ నృత్య దర్శకురాలిగా నంది పురస్కారం లభించింది. ఈ చిత్రం హిందీలో ‘తక్దీర్వాలా’గా, తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 'నిజం' కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి: 2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. యోగి: ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. -
Nayanthara: 'మాతృదేవోభవ' రీమేక్‌లో నయనతార
అమ్మప్రేమలోని గొప్పతనాన్ని అడుగడుగునా చాటిచెప్పిన చిత్రం మాతృదేవోభవ. 1993లో విడుదలైన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోని ప్రేక్షకులు లేరు. అమ్మప్రేమలోని మాధుర్యాన్ని అంతలా కనెక్ట్ చేసిన చిత్రమిది. కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో నాజర్, మాధవి నటించిన ఈ చిత్రాన్ని కె.ఎస్. రామారావు నిర్మించారు. తాజాగా చిత్ర నిర్మాత రామారావు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తనకు మాతృదేవోభవ రీమేక్ చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టేశారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అజయ్ కుమారే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాలని పేర్కొన్నారు. అయితే హీరోయిన్ పాత్రలో ఎవరు నటించాలనే ప్రశ్నకు బదులుగా..నయనతార, కీర్తి సురేష్ ఇద్దరూ ఈ పాత్రకు సరిపోతారని, నయనతార నటన ఇంకాస్త మెచ్యూర్డ్ కూడా ఉంటుందని, ఆమె అయితే సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడున్న నటీనటులు కథ కంటే రెమ్యూనరేషన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని, వాళ్లు అడిగే రెమ్యూనరేషన్ వింటేనే కంగారు ఉందని చెప్పుకొచ్చారు. మరి చిన్న పాత్రకు సైతం భారీ పారితోషికం అందుకునే నయనతార ఈ సినిమాను చేస్తోందా? లేక కథకు ప్రాధాన్యమిచ్చి రెమ్యూనరేషన్ విషయంలో కాస్త వెనక్కు తగ్గుతుందా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది చదవండి : పుష్ప: ఆ రోల్ చేయడానికి ఐశ్వర్య ఒప్పుకుంటుందా? సామాన్యుల కోసం నడుం బిగించిన నటుడు -
మనసా స్మరామి : రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...
మా ఊరు గుంటూరు జిల్లా, వెనిగండ్ల. పుట్టింది ఒకచోట, పెరిగింది ఒకచోట, చదువుకున్నది మరోచోట. చిన్నప్పుడు చదువుకోనని తెగ మారాం చేస్తుంటే మా మామయ్య నన్ను బాపట్లలోని వాళ్ళింటికి తీసుకెళ్ళి చదువుతో పాటు, శ్రద్ధబుద్ధులు నేర్పించారు. అప్పుడు నా వయసు ఆరు సంవత్సరాలు. అక్కడే నాకు సాహిత్య సాన్నిహిత్యంతో పాటు సినీగేయ సాహిత్యంపై అవగాహన ఏర్పడింది. మా మామయ్య సూర్యోదయానికి ముందే నన్ను నిద్ర లేపి మంత్రాలు, వాటి అర్థాలు చెబుతుండేవారు. నాకు బోర్ కొడుతుందన్నప్పుడు సినిమా పాటలు, ఆ సినీగేయకవి గురించి ఎక్కువగా చెప్పేవారు. అలా మా మామయ్య మాటల ద్వారా పరిచయమైన కవి వేటూరిగారు. వారి పాటలు రోజుకి ఒకటి చొప్పున అర్థాలు తెలుసుకుంటూ ఉండేవాడిని. అలా వారి కవనాల్లో నా మనసుని బాగా కదిలించిన పాట ‘మాతృదేవోభవ’ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...’’. అప్పటి వరకు తత్త్వాన్ని, తర్కాన్ని సంస్కృతంలో తెలుసుకుంటున్న నాకు, అలతి పదాలతో తెలుగులో కూడా తత్త్వాన్ని చెప్పొచ్చని అర్థమయ్యింది. వేటూరి గారి సాహిత్యానికి కీరవాణి స్వరం, స్వరకల్పన తోడైన ఈ పాట నా మనసుపొరల్లో చెరగని మధురామృతాన్ని నింపింది. తర్వాత నాలో గీత రచయిత కావాలనే కోరికను రగిలించింది. జాతీయ పురస్కారం అందుకున్న ‘అద్వైతం’ లఘుచిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన నా సాహిత్యానికి, ఈ పాటే మార్గదర్శకమైంది. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... తోటవూలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే నీకిది తెలవారని రేయువ్మూ... కలికీ వూ చిలక..! పాడకు నిన్నటి నీ రాగం...’ ఈ పల్లవిలో కవి కనిపిస్తాడు. కవి పువ్వుని, సాయంత్రాన్ని ప్రశ్నిస్తున్నాడు. రాలే పువ్వు, వాలే పొద్దు ఈ రెండూ ఎక్కువ రంగులని ఈనుతుంటాయి. ఐనా గతించే నీకు ఇన్ని రంగులు, హంగులు ఎందుకు..? అనే తత్త్వం పాట ఆద్యంతం మనకి కనిపిస్తుంది. ‘చెదిరింది నీ గూడు గాలిగా చిలకగోరింకవ్ము గాథగా... చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా.... తన వాడు తారల్లో చేరగా వునసు వూంగల్యాలు జారగ... సిందూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా తిరిగే భూవూత వు నీవై వేకువలో వెన్నెలవై... కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై’ చిలకగోరింకల్లా కలకాలం చల్లగా ఉండండి అని మనం నవ దంపతులను దీవిస్తుంటాం. నిజానికి చిలక, గోరింక రెండూ కలిసి ఉండవు. కాపురం చేయవు. చిత్రంలో సత్యం (నాజర్), శారద (మాధవి) ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ చిర్రుబుర్రులాడుతుంటారు. చివరికి రూపం లేకుండా పోయి శూన్యంలో కలిసింది. శారద భర్త చనిపోవడంతో సుఖాలు, కోరికలు అన్నీ తన ‘సిందూరం’ తో తెల్లారి చల్లారిపోయాయి. కేవలం తన బిడ్డల కోసం ఓర్పుతో భూమాతలా తిరుగుతూ కష్టపడుతుంది. ‘అనుబంధవుంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ వుబ్బులే హేవుంతరాగాల చేవుంతులే వాడిపోయే... తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలు కొండెక్కి పోయే...’ ‘ఋణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయం’ అంటారు. ఈ భవబంధాలన్నీ పూర్వజన్మలో తీరని ఋణం వలన ఏర్పడతాయి. అప్పు తీర్చకపోతే వడ్డీ పెరిగి తలకు మించిన భారం అవుతుంది. అనుబంధం అనే అప్పు తీర్చకపోతే మోక్షం రాదు. తన తరువాత తన పిల్లలు ఏమైపోతారో అని పరితపిస్తున్న శారదకి కవి గొంతు ఇలా తత్త్వాన్ని చెప్పింది. వేకువలో వెన్నెల, కరిగే కర్పూరం ఆశల హారతి, జారిపడే జాబిలి, కరిగే మబ్బు... వీటిన్నింటినీ జీవితం అనే అస్థిరానికి అద్ది, చివరికి తీగ తెగిన వీణలా బంధాలనన్నింటినీ తెంచుకుని శరీరం మూగబోతుంది... అని తత్త్వాన్ని వర్ణించడం వేటూరిగారి కలానికే చెల్లింది. భూమి మీద మనుషులు, బంధాలు-అనుబంధాలు ఉన్నంత కాలం ఈ పాటలోని ప్రతి అక్షరం అజరామరం. - సంభాషణ: నాగేశ్