Mahesh Babu Daughter Sitara Ghattamaneni Special Interview With Sakshi - Sakshi
Sakshi News home page

Sitara Ghattamaneni: 'గర్వపడేలా చేశావంటూ అమ్మ నన్ను గట్టిగా హత్తుకుంది'

Published Sun, May 8 2022 8:14 AM | Last Updated on Sun, May 8 2022 9:53 AM

Mahesh Babu Daughter Sitara Ghattamaneni Special Interview With Sakshi

నేను గర్వపడేలా చేశావు సితూ పాపా...నమ్రత ఎమోషన్‌ అయ్యారు...కూతుర్ని గట్టిగా హత్తుకున్నారు.అంతే.. సితూ పాప పిచ్చ హ్యాపీ.నువ్వు మా అమ్మలా ఉంటావు...అలా అంటూ కూతుర్ని ముద్దు చేస్తుంటారు మహేశ్‌బాబు. ఇంతకీ అమ్మ ఆనందపడేలా సితూ ఏం చేసింది?‘మదర్స్‌ డే’ సందర్భంగా తన తల్లి గురించి సితార చెప్పిన ముచ్చట్లు చదివితే తెలుస్తుంది. 

 ►మదర్స్‌ డే ప్లాన్‌ గురించి?
సితార: అమ్మ కోసం స్పెషల్‌ గిఫ్ట్‌ ఒకటి ప్లాన్‌ చేశాను. అది సర్‌ప్రైజ్‌. అలాగే ఆదివారం మొత్తం అమ్మతో స్పెండ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాను.

 ►  ఇంట్లో నిన్ను ‘సితూ పాపా’ అని పిలుస్తారు. మీ అమ్మని ‘అమ్మా’ అనే పిలుస్తావా? మామ్‌ అని కాదా?
  అమ్మా అనే పిలుస్తాను. అలా పిలిపించుకోవడం అమ్మకు ఇష్టం.

   ఇంతకీ మీ అమ్మగారు ఎంత స్ట్రిక్ట్‌?
   అవసరమైనప్పుడు మాత్రమే స్ట్రిక్ట్‌. మిగతా సమయాల్లో మా అమ్మ చాలా స్వీట్‌.

   ► చదువు విషయంలో, స్పోర్ట్స్, డాన్స్‌ వంటివి నేర్చుకునే విషయంలో అమ్మ ప్రోత్సాహం ఎంతవరకూ ఉంటుంది?
  స్కూల్‌ నుంచి రాగానే హోమ్‌వర్క్‌కి స్పెషల్‌గా టైమ్‌ ప్లాన్‌ చేస్తుంది. ఆ టైమ్‌కి మేం హోమ్‌వర్క్‌ చేసేలా చూస్తుంది. ఇక పెయింటింగ్, డాన్సింగ్‌... ఇంకా స్కూల్‌ యాక్టివిటీస్‌ అన్నింటిలోనూ పార్టిసిపేట్‌ చేసేలా అమ్మ ప్రోత్సహిస్తుంది.

 ►  ఎప్పుడైనా చదువుపట్ల నిర్లక్ష్యంగా ఉంటే మీ అమ్మగారి రియాక్షన్‌?
  నిర్లక్ష్యంగా ఉండే చాన్సే లేదు. రోజూ చదువుకోవడానికి ఒక టైమ్‌ కేటాయించిందని చెప్పాను కదా. ఆ టైమ్‌కి చదవుకోవాల్సిందే. తప్పించుకోవడానికి లేదు.



  ►  అమ్మ కోప్పడినప్పుడు నాన్నకు కంప్లైంట్‌ చేయడం జరుగుతుందా?
   జరుగుతుంది. నాకేదైనా కావాలన్నప్పుడు అమ్మ ‘నో’ చెబితే అప్పుడు నాన్నకు కంప్లైంట్‌ చేస్తాను.

    మీ ఇద్దరి (సితార అన్నయ్య గౌతమ్‌)లో అమ్మ ఎవర్ని ఎక్కువగా గారాబం చేస్తారు?
  ఇద్దరంటే అమ్మకి చాలా ప్రేమ. కానీ నేను చిన్నదాన్ని కాబట్టి నన్ను ఎక్కువగా గారాబం చేస్తుంది... హహ్హహ్హా...

   మీ అమ్మగారి నుంచి తీసుకోవాల్సిన మంచి విషయాలు?
  పాజిటివ్‌గా ఉండాలని చెబుతుంది. అలాగే ఇతరుల పట్ల కైండ్‌గా ఉండాలని కూడా అంటుంది. మన దగ్గర ఉన్నవాటికి కృతజ్ఞతాభావంతో ఉండాలని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది.

 ► పండగలప్పుడు ట్రెడిషనల్‌గా డ్రెస్‌ చేసుకుని, చక్కగా పూజలు చేస్తుంటావు.. అమ్మ నేర్పిస్తుంటారా?
 నా చిన్నప్పటి నుంచి అమ్మ మన కల్చర్‌ గురించి మంచి విషయాలు చెబుతూ ఉంది. కల్చర్‌ పరంగా మమ్మల్ని ఎడ్యుకేట్‌ చేయడం అమ్మకి ఇష్టం. మా అమ్మ మహారాష్ట్రీయన్‌.. నాన్న తెలుగు అని మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇంట్లో ఈ రెండు సంప్రదాయాలకు సంబంధించిన పండగలు చేసుకుంటాం. ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తాం.

     మరి... మీ అమ్మగారి మదర్‌ టంగ్‌ మరాఠీ వచ్చా?
    మాట్లాడతాను కానీ అంత ఫ్లూయంట్‌గా రాదు.



  ►   ఫ్రెండ్స్‌తో ఫుడ్‌ షేర్‌ చేయడం, కేరింగ్‌గా ఉండటం వంటివి కూడా అమ్మ చెబుతుంటారా?
  స్కూల్‌ లేక వేరే చోట ఫ్రెండ్స్‌తో స్పెండ్‌ చేసినప్పుడు తినడానికి నా దగ్గర ఏం ఉంటే అది వాళ్లతో షేర్‌ చేసుకుంటాను. నా దగ్గర తక్కువ ఉన్నా సరే షేర్‌ చేస్తాను. ఎందుకంటే ‘షేరింగ్‌ ఈజ్‌ కేరింగ్‌’ అని అమ్మ చెప్పింది. నేను ఫాలో అయిపోతున్నాను (నవ్వులు).

   మీ నాన్నమ్మలా ఉంటావు కాబట్టి మీ నాన్నగారు ఆ విషయం చెప్పి, గారాబం చేస్తుంటారా?
  ‘నువ్వు మా అమ్మలా ఉన్నావు’ అని నాన్న ఎప్పుడూ నాతో అంటుంటారు. బాగా ముద్దు చేస్తారు కూడా. కానీ నేను మా అమ్మలా కూడా ఉన్నానని అనుకుంటున్నాను

 ►  నీ యూ ట్యూబ్‌ చానల్‌ సక్సెస్‌ వెనకాల అమ్మ హెల్ప్‌ ఉందా?
అమ్మ బోలెడన్ని ఐడియాలు ఇస్తుంది. అది మాత్రమే కాదు.. షూట్‌ విషయంలో కూడా హెల్ప్‌ చేస్తుంది.

 ►  మరి.. ‘సర్కారువారి పాట కోసం’ నువ్వు చేసిన ‘పెన్నీ..’ సాంగ్‌కి ఆమె హెల్ప్‌ చేశారా? ఆ పాటలో నీ డాన్స్‌ బాగుంది...
 ఆ పాట షూట్‌ మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యేవరకు నా డాన్స్‌ టీచర్‌ అనీ మాస్టర్‌తో పాటు అమ్మ నాతోనే ఉంది. ఫేషియల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఎలా ఉండాలి అనే   విషయంలో గైడ్‌ చేసింది. అలాగే కెమెరా వెనకాల నన్ను చాలా ఎంకరేజ్‌ చేసింది.

 ► డాన్స్‌ మొత్తం పూర్తయ్యాక ఆమె ఏమన్నారు?
  నా ఫస్ట్‌ ఆన్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగా రావడంతో అమ్మ  చాలా హ్యాపీ ఫీలయింది. ‘నన్ను గర్వపడేలా చేశావు’ అని గట్టిగా హత్తుకుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది.

 ► పిల్లలకు ఆరోగ్యం బాగా లేనప్పుడు మీ అమ్మగారు ఎలా చూసుకుంటారు?
  అలాంటి సమయాల్లో మా అమ్మ మా పక్కనే ఉంటుంది. ఒంట్లో బాగాలేనప్పుడు ప్రత్యేకంగా డైట్‌ ప్లాన్‌ చేసి, మేం తినేలా చేస్తుంది. టైమ్‌కి టాబ్లెట్లు ఇచ్చి, చాలా కేరింగ్‌గా    ఉంటుంది.

 ► నువ్వు, గౌతమ్‌ ఏం అడిగినా మీ అమ్మ కొనిపెడతారా? ఐస్‌క్రీములు, చాక్లెట్లు ఎక్కువగా తింటే ఒప్పుకుంటారా?
  మేం ఏం అడిగినా దాదాపు కాదనదు. అయితే ప్రతిదానికీ ఒక లిమిట్‌ ఉండాలంటుంది. మితి మీరితే ఏదీ మంచిది కాదని అమ్మ అంటుంది. నేను అమ్మ మాటని ఒప్పుకుంటాను.

    ఈ మధ్య ఫ్యామిలీ టూర్‌ వెళ్లారు కదా. ఆ విశేషాలు?
మేం ప్యారిస్, బోర్దూ, ఫ్రాన్స్‌లోని లూర్దు వెళ్లాం. ఈఫిల్‌ టవర్‌ చూశాను. ఫుల్‌గా ఎంజాయ్‌ చేశాం.
– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement