క్యాంటీన్‌ సాంగ్‌కి సురేఖా వాణి కుమార్తె వీడియో | Celebrities Campaign For Fans in Social Media | Sakshi
Sakshi News home page

'ఫ్యాన్‌'టాస్టిక్‌!

Published Fri, Sep 27 2019 10:37 AM | Last Updated on Fri, Sep 27 2019 12:01 PM

Celebrities Campaign For Fans in Social Media - Sakshi

డియర్‌ కామ్రేడ్‌లోని క్యాంటీన్‌ సాంగ్‌కి సిటీ కాలేజీలో వీడియో రూపొందించిన సుప్రీతి

సెలబ్రిటీలకు ఫ్యాన్స్‌ ప్రాచుర్యం కలిగించడం తెలిసిందే. కానీ స్వయంగా సెలబ్రిటీలే తమ ఫ్యాన్స్‌కి ప్రచారం ఇవ్వడమే వింత. వండర్స్‌కి కేరాఫ్‌ అయిన సోషల్‌ మీడియా పుణ్యమాని అభిమానులకు ఈ అదృష్టం దక్కుతోంది. తమ ప్రతిభకు సెలబ్రిటీలు గులామ్‌ అయి సలామ్‌ చేయడం వారిని ఆనందంలో ముంచెత్తుతోంది.       

సినిమాల్లో హీరో హీరోయిన్లు చెప్పే డైలాగ్స్‌ నుంచి చేసే డ్యాన్స్‌ల దాకా మక్కీకి మక్కీ అనుకరించడం వాటి ద్వారా చుట్టుపక్కల వారి క్లాప్స్, కాంప్లిమెంట్స్‌ కొట్టేయడం ఫ్యాన్స్‌లో చాలా మంది చేసేదే. అయితే ఇప్పుడు సెలబ్రిటీలే తమ ఫ్యాన్స్‌ టాలెంట్‌ను స్వయంగా చూసి, క్లాప్స్, కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. అంతేకాదు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఫ్యాన్స్‌ ప్రతిభను పోస్ట్‌ చేస్తున్నారు. తద్వారా వారి ప్రతిభకు ప్రపంచవ్యాప్త ప్రచారం కలిగిస్తున్నారు.

డియర్‌ కామ్రేడ్‌లోని క్యాంటీన్‌ సాంగ్‌కి సిటీ కాలేజీలో వీడియో రూపొందించిన సుప్రీతి (నటి సురేఖా వాణి కుమార్తె)

‘ఓ బేబీ’ని అనుసరించిన‘కామ్రేడ్‌’
అదే విధంగా  ‘ఓ బేబీ’ మూవీ విడుదల సమయంలో సమంత ఫ్యాన్స్‌కి మరో ఆఫర్‌ ఇచ్చింది.  తను సినిమాలో ధరించిన పాత్ర తరహాలో అభిమానులు కూడా తనను రెట్రో లుక్‌తో ఆకట్టుకోవాలని కోరింది. అలా రెట్రోలుక్‌తో అదరగొట్టిన అభిమానుల ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో సమంత పోస్ట్‌ చేసింది. మరోవైపు ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకున్న హీరో విజయ్‌ దేవరకొండ తన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో హిట్టయిన క్యాంటీన్‌ సాంగ్‌కి తమదైన శైలిలో డ్యాన్స్‌ చేయమంటూ ఫ్యాన్స్‌కి పిలుపిచ్చాడు. దీంతో సిటీలోని కాలేజీ క్యాంటీన్లు ఆట–ఆ పాటలతో ప్రతిధ్వనించాయి. దీనికి వచ్చిన క్రేజ్‌కి నిదర్శనం ప్రముఖ సినీ నటి సురేఖావాణి కుమార్తె, కాలేజీ విద్యార్ధిని సుప్రీతి తానూ డ్యాన్స్‌ చేసి విజయ్‌ దేవరకొండకు షేర్‌ చేయడం...

చాలెంజ్‌ నుంచియూ టర్న్‌..
ఇది ఓ రకంగా సెలబ్రిటీలు చేసే చాలెంజ్‌కి స్వల్ప మార్పులతో కొనసాగింపు అని చెప్పొచ్చు. చాలా రకాలుగా యూత్‌ ట్రెండ్స్‌ని సృష్టించే స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని ఈ ట్రెండ్‌కు కూడా ఇక్కడ తానే శ్రీకారం చుట్టింది. తన సినిమా ‘యూటర్న్‌’ కోసం సమంత ది కర్మ థీమ్‌ సాంగ్‌కి డ్యాన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అది బాగా పాపులరైంది కూడా. దీంతో  ‘ఆ థీమ్‌ సాంగ్‌కి  మీరు కూడా డ్యాన్స్‌ చేసి...వాటిని నాకు పంపితే బాగున్న వీడియోస్‌కి నన్ను ట్యాగ్‌ చేయండి. నాకు నచ్చితే నా ప్రొఫైల్‌లో రీపోస్ట్‌ చేస్తా’ అని సమంత ఇచ్చిన ఆఫర్‌కి  సిటిజనుల్లో బాగా క్రేజ్‌ వచ్చింది. దీనికి స్పందనగా వీడియోలు పంపిన సమంత అభిమానులతో పాటు సహ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి, ప్రియమణి, హీరోలు అఖిల్, నవీన్‌ చంద్ర  వంటి వారు సైతం ఉండడం విశేషం. 

ఓ సాకి సాకి హిందీ పాటకి వీడియో  రూపొందించిన సిటీ యువతి శ్రుతీ మిట్టల్‌
త్రీ ఇన్‌ వన్‌ ట్రెండ్‌
ఈ తరహా పిలుపులకు ఫ్యాన్స్‌ భారీగా స్పందిస్తున్నారు. ఇవిసినీ తారలకు ఓ వైపు సినిమాప్రమోషన్స్‌కి మరోవైపు అభిమానులతో మరింత సన్నిహితం కావడానికి ఉపకరిస్తున్నాయి. అలాగే ఫ్యాన్స్‌కి కూడా అరుదైన అపురూప తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసుకునే అవకాశం అందుతోంది. దీంతో రాను రాను ఈ ట్రెండ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

బాలీవుడ్‌కీసై అంటున్న సిటీ...
గత కొన్ని నెలలుగా బాలీవుడ్‌ సైతం ఇదే బాట పట్టింది. పలు సినిమాలలోని తమ పాటలు, డైలాగ్స్‌...వగైరాలతో హీరో హీరోయిన్లు అభిమానులకు ఛాలెంజ్‌లు విసురుతున్నారు. సదరు నటీ నటులకు ఉన్న లక్షల సంఖ్యలోని ఫాలోయర్స్‌కు తమ ప్రతిభ సైతం పరిచయం అవుతుందనే సంతోషంతో ఫ్యాన్స్‌ భారీ సంఖ్యలో స్పందిస్తున్నారు. తాజాగా బాట్లా హౌజ్‌  బాలీవుడ్‌ సినిమాలోని ఓ సాకీ సాకీ అంటూ సాగే నోరా పటేíß (తార) డ్యాన్స్‌  ఐటమ్‌ సాంగ్‌కి సిటీలోని ఎమ్‌జె డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు డ్యాన్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement