
సురేఖ వాణి వీడియో వైరల్
బుల్లితెరపై మొగుడ్స్ పెళ్లామ్స్ కార్యక్రమంలో క్రేజ్ సంపాదించుకున్న వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్న సురేఖవాణికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సురేఖా వాణి తన కూతురుతో కలిసి కాలా చష్మా మ్యూజిక్కు డ్యాన్స్ చేసింది.
ఆ వీడియోలో ఆమె పొట్టి జీన్స్ వేసుకుని కళ్లజోడు పెట్టుకుని... కూతురితో పోటీ పడుతూ మరీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియో ఇప్పుడూ వైరల్గా మారింది. కాగా కత్రినాకైఫ్, సిద్దార్థ్ మల్హోత్రా జంటగా రూపుదిద్దుకున్న ‘బార్ బార్ దేఖో’ చిత్రంలోని కాలా చష్మా పాటకి ఆన్‌లైన్‌లో మంచి పాపులారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇక సెలబ్రెటీ స్టేటస్ ఉన్నవారు ఏం చేసినా అది వార్తే అనుకోండి. మరి సురేఖా వాణి డ్యాన్స్ చూడండి...