కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ‘బార్ బార్ దేఖో’ సినిమాలోని కాలా చష్మా పాట ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. 2018లో వచ్చిన సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషనల్. అయితే ఇదే సాంగ్ మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతోంది. ఎవరిని చూసినా ఈ పాటపై రీల్స్ చేసి పోస్టు చేస్తున్నారు. కేవలం భారత్‌లోనే కాదు ఖండాంతరాలు దాటుకొని ఆఫ్రికన్ పిల్లలు కూడా కాలా చష్మా పాటకు డ్యాన్స్ చేశారంటే ఎంత పాపులర్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు
అందరూ సరదాగా స్నేహితులతో ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి వేడుకల్లో ఈ పాటకు రీల్స్ చేస్తుంటే తాజాగా ఓ విద్యార్ధి వెరైటీగా తన కాన్వొకేషన్ సందర్భంగా స్టేజ్‌పై డ్యాన్స్ చేశాడు. ముంబైకు చెందిన మహిర్ మల్హోత్రా అనే విద్యార్థి డిగ్రీ పూర్తి చేసుకొని గ్రాడ్యుయేషన్ పట్టాను తీసుకునేందుకు స్టేజ్ మీదకు వెళ్తుంటాడు. అందరూ చప్పట్లు కొడుతూ అతన్ని ప్రోత్సహిస్తుండగా.. స్టైలిష్‌గా స్టేజ్‌పై కాలాచష్మా స్టెప్స్ వేశాడు.
అయితే ముందుగా మహిర్ నిజంగా పడిపోయాడేమోనని ఆనుకుంటారు. కానీ అతను సాంగ్‌లోని స్టెప్ వేశారని భావించి ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను మహిర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘దయచేసి దీన్ని ప్రయత్నించవద్దు.. నేను దీన్ని ప్రోత్సహించను’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. మహిర్ డ్యాన్స్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
చదవండి: Viral: మ్యాట్రిమోనీలో యాడ్.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లు కాల్ చేయద్దంటూ..
Comments
Please login to add a commentAdd a comment