Kala Chashma
-
కాన్వొకేషన్ సమయంలో ‘కాలా చష్మా’.. ‘దయచేసి దీన్ని ప్రయత్నించవద్దు’
కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ‘బార్ బార్ దేఖో’ సినిమాలోని కాలా చష్మా పాట ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. 2018లో వచ్చిన సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ సెన్సేషనల్. అయితే ఇదే సాంగ్ మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతోంది. ఎవరిని చూసినా ఈ పాటపై రీల్స్ చేసి పోస్టు చేస్తున్నారు. కేవలం భారత్‌లోనే కాదు ఖండాంతరాలు దాటుకొని ఆఫ్రికన్ పిల్లలు కూడా కాలా చష్మా పాటకు డ్యాన్స్ చేశారంటే ఎంత పాపులర్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు అందరూ సరదాగా స్నేహితులతో ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి వేడుకల్లో ఈ పాటకు రీల్స్ చేస్తుంటే తాజాగా ఓ విద్యార్ధి వెరైటీగా తన కాన్వొకేషన్ సందర్భంగా స్టేజ్‌పై డ్యాన్స్ చేశాడు. ముంబైకు చెందిన మహిర్ మల్హోత్రా అనే విద్యార్థి డిగ్రీ పూర్తి చేసుకొని గ్రాడ్యుయేషన్ పట్టాను తీసుకునేందుకు స్టేజ్ మీదకు వెళ్తుంటాడు. అందరూ చప్పట్లు కొడుతూ అతన్ని ప్రోత్సహిస్తుండగా.. స్టైలిష్‌గా స్టేజ్‌పై కాలాచష్మా స్టెప్స్ వేశాడు. అయితే ముందుగా మహిర్ నిజంగా పడిపోయాడేమోనని ఆనుకుంటారు. కానీ అతను సాంగ్‌లోని స్టెప్ వేశారని భావించి ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను మహిర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘దయచేసి దీన్ని ప్రయత్నించవద్దు.. నేను దీన్ని ప్రోత్సహించను’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. మహిర్ డ్యాన్స్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చదవండి: Viral: మ్యాట్రిమోనీలో యాడ్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాల్ చేయద్దంటూ.. View this post on Instagram A post shared by Mahir Malhotra (@mahir_malhotra) -
అర్హత సాధించామన్న ఆనందం.. 'కాలా చష్మా'తో దుమ్మురేపారు
ప్రస్తుతం బాలీవుడ్ సూపర్‌హిట్ సాంగ్ ''కాలా చష్మా'' సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే పాట వినిపిస్తుంది. తాజాగా ఆసియాకప్‌లో అర్హత సాధించామన్న ఆనందంలో హాంకాంగ్ జట్టు ''కాలా చష్మా'' పాటకు ఆ జట్టు ఆటగాళ్లు అదిరిపోయే స్టెప్పులేశారు. ఇంతకముందు జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సంతోషంలో ధావన్, గిల్, ఇషాన్ కిషన్ సహా టీమిండియా ఆటగాళ్లు చేసిన కాలా చష్మా డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను ఊపేశాయి. కాగా హాంకాంగ్ జట్టు ఆసియాకప్ క్వాలిఫికేషన్ రౌండ్లో టేబుల్ టాపర్స్‌గా నిలిచి తుది టోర్నీకి అర్హత సాధించింది. కువైట్, యూఏఈ, సింగపూర్‌లతో క్వాలిఫై మ్యాచ్‌లు ఆడిన హాంకాంగ్ అన్నింటిలోనూ విజయాలు సాధించింది. తద్వారా టీమిండియా, పాకిస్తాన్లున్న గ్రూఫ్-ఏలో హాంకాంగ్ ఆడనుంది. గ్రూఫ్-బిగా ఉన్న మరొక దాంట్లో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు ఉన్నాయి. ఇక ఇవాళ(ఆగస్టు 27న) శ్రీలంక, అఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్‌తో ఆసియాకప్ 15వ ఎడిషన్‌కు తెరలేవనుంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆగస్టు 28న(ఆదివారం) జరగనుంది. ఇక ఇప్పటివరకు 15 సార్లు ఆసియా కప్ జరగ్గా.. భారత్ ఏడుసార్లు, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు నెగ్గాయి. View this post on Instagram A post shared by ESPNcricinfo (@espncricinfo) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: పాక్‌తో మ్యాచ్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రోహిత్ డుమ్మా; కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే.. IND Vs PAK Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్.. రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా కోహ్లి! -
అదరగొట్టిన ఆఫ్రికన్ చిన్నారులు.. కేటీఆర్ మెచ్చిన డ్యాన్స్ వీడియో
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ తప్పక ఉంటుంది. అందుకు కావాల్సిందల్లా మనలోని టాలెంట్‌ను గుర్తించి దానిని పదును పెట్టడమే. చాలామందిలో టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నప్పటికీ.. నిరూపించుకునేందుకు సరైన మార్గం లేక వెనకబడిపోతారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడంతో మారుమూల ప్రాంతంలోని ప్రతిభ కలిగిన వ్యక్తులు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించి ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. అచ్చం ఇలాగే ఆఫ్రికన్ చిన్నారులు బాలీవుడ్ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసి ఔరా అనిపించారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ నటించిన బార్ బార్ దేఖో సినిమాలో కాలా చష్మా పాటకు ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపారు. భాష రాకపోయినా, దాదాపు పది మంది ఉన్న పిల్లలు గ్రూప్‌గా ఏర్పడి ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా స్టెప్పులేశారు. కష్టమైన మూవ్‌మెంట్స్‌ను కూడా చాలా సునాయసంగా చేస్తూ అందరి మనసులు దోచుకున్నారు. తమ డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని డ్డ్యాన్స్ చేస్తున్న పిల్లలు వెనుక బ్యాగ్రౌండ్ చూస్తుంటే వారంతా గ్రామీణ నేపథ్యానికి చెందిన వారిలా కనిపిస్తున్నారు. వీరంతా మట్టిలో మాణిక్యం అనే పదానికి సరైన నిర్వచనం ఇచ్చారు. ఏవియేటర్ అనిల్ చోప్రా చేర్ చేసిన ఈ వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. దీనిని రీట్వీట్ చేస్తూ.. పిల్లలు అద్భుతంగా డ్యాన్స్ చేశారని, ఇది తప్పకుండా మీ ముఖంలో చిరునవ్వు తీసుకొస్తుందని కామెంట్ చేశారు. This is Wow! Indian soft power. pic.twitter.com/DsGQWTsnF5 — Aviator Anil Chopra (@Chopsyturvey) August 25, 2022 -
సిరీస్ క్లీన్‌స్వీప్.. 'కాలా చష్మా' పాటకు చిందేసిన టీమిండియా
జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా సంతోషంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ సహా మిగతా ఆటగాళ్లు బాలీవుడ్ పాపులర్ పాట.. 'కాలా చష్మా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ముఖ్యంగా ధావన్, మ్యాచ్ హీరో శుబ్‌మన్ గిల్లు కాలా చస్మా సిగ్నేచర్ స్టెప్పులతో దుమ్మురేపారు. ఈ వీడియోనూ ధావన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది. కాలా చస్మా ట్రెండ్ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసిన ధావన్.. సెలబ్రేషన్ మూడ్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సెంచరీ హీరో గిల్ అయితే సంతోషంలో మునిగిపోయి తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఉర్రూతలూగించడం విశేషం. ఇక మూడో వన్డేలో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్ సికందర్ రజా వీరోచిత సెంచరీ వృథా అయినప్పటికి.. తన ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసు దోచుకున్నాడు. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) Winning celebration by team India. pic.twitter.com/ccVQEDppoc — Mufaddal Vohra (@mufaddal_vohra) August 22, 2022 చదవండి: Sikandar Raza: పాక్ మూలాలున్న బ్యాటర్.. అయినా సరే మనసు దోచుకున్నాడు Shubman Gill: 'డెబ్యూ సెంచరీ నాన్నకు అంకితం'.. గిల్ ఎమోషనల్ -
దుమ్మురేపుతున్న మోనాలిసా డ్యాన్స్ వీడియో
బిగ్‌బాస్ 10తో వెలుగులోకి వచ్చిన భోజ్‌పూరీ నటి మోనాలిసా సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. తన అభిమానులను నిరాశపరచకుండా తరచూ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటారు. కామెడీ వీడియోలు లేదా తన వ్యక్తిగత వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తారు. తాజాగా ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ పాపులర్ సాంగ్ ‘ కాలా చష్మా’ కు తనదైన స్టైల్లో స్టెప్పులేశారు. తన కోస్టార్ నాజర్‌తో కలిసి మోనాలిసా వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
సురేఖ వాణి వీడియో వైరల్
బుల్లితెరపై మొగుడ్స్ పెళ్లామ్స్ కార్యక్రమంలో క్రేజ్ సంపాదించుకున్న వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్న సురేఖవాణికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సురేఖా వాణి తన కూతురుతో కలిసి కాలా చష్మా మ్యూజిక్కు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలో ఆమె పొట్టి జీన్స్ వేసుకుని కళ్లజోడు పెట్టుకుని... కూతురితో పోటీ పడుతూ మరీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియో ఇప్పుడూ వైరల్‌గా మారింది. కాగా కత్రినాకైఫ్, సిద్దార్థ్ మల్హోత్రా జంటగా రూపుదిద్దుకున్న ‘బార్ బార్ దేఖో’ చిత్రంలోని కాలా చష్మా పాటకి ఆన్లైన్లో మంచి పాపులారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇక సెలబ్రెటీ స్టేటస్ ఉన్నవారు ఏం చేసినా అది వార్తే అనుకోండి. మరి సురేఖా వాణి డ్యాన్స్ చూడండి... -
సురేఖ వాణి వీడియో సంచలనం
-
హెడ్ కానిస్టేబుల్ పాట దుమ్మురేపుతోంది!
పంజాబీ జానపద గీతం 'కాలాచష్మా' ఇప్పుడు దేశమంతటా దుమ్మురేపుతోంది. నిజానికి ఈ పాట 1990లోనే వచ్చింది. కానీ, తాజాగా వచ్చిన 'బార్ బార్ దేఖో' సినిమాలో ఆ పాటను వాడుకోవడంతో దీనికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ పాట రాసిందో ఎవరో తెలుసా.. ఓ హెడ్ కానిస్టేబుల్. పంజాబ్ పోలీసుశాఖలో పనిచేస్తున్న అమ్రిక్ సింగ్ షెరా (43) ఈ పాటను రచించారు. ఆ విషయం తెలిసి షాక్ తిన్నాను! పంజాబ్‌లోని కపుర్తలా పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న షెరా తన పాట దేశమంతటా మార్మోగుతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఈ పాట సినిమాలో తీసుకున్నారనే విషయం చివరివరకు తనకు తెలియదని చెప్పారు. 'రెండు నెలల కిందట నా స్నేహితులు ఫోన్‌చేసి నీ 'కాలాచష్మా' పాట చానెళ్లలో వస్తున్నదని చెప్పారు. నాకు ఆనందంతోపాటు షాక్ కలిగింది. నాకు తెలియకుండా ఇదంతా జరిగింది' అని షెరా తెలిపారు. ఓ సిమెంట్ సంస్థ ప్రారంభోత్సవంలో ప్లే చేస్తామంటూ ముంబైకి చెందిన ఓ కంపెనీ తన పాట హక్కులను తీసుకున్నదని, అందుకు కేవలం రూ. 11వేలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. సినిమాలో వాడుకుంటున్న విషయాన్ని తనకు చెప్పలేదన్నారు. ఇలా వాడుకోవడంపై ఎవరిపట్ల తనకు కోపం లేదని చెప్పారు. 'ఈ సినిమా ఆడియో వేడుకకుగానీ, ఇతర వేడుకలకుగానీ ఎవరూ నన్ను ముంబైకి పిలువలేదు. ఈ వేడుకలకు వెళ్లాలని నేను అనుకున్నాను. పంజాబ్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి ఈ పాట రాశాడని అందరికీ తెలియజేయాలనుకున్నా' అని షెరా ఆవేదన వ్యక్తం చేశారు. జలంధర్ సమీపంలోని తల్వాండీ గ్రామానికి చెందిన షెరా 15 ఏళ్ల వయస్సులో తొమ్మిదో తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ పాట రాశారు. తన పాటలను రికార్డు చేయాల్సిందిగా అప్పట్లో చాలామంది గాయకులను కలిశానని, కానీ ఎవరూ సహకరించలేదని షెరా గుర్తుచేసుకున్నారు. చాలాకాలం తర్వాత ఇంగ్లండ్‌లోని ఓ వేడుకలో గాయకుడు అమర్ అర్షి 'కాలాచష్మా' పాట పాడటంతో అది సూపర్ హిట్ అయిందని, దీంతో ఓ కంపెనీ ఈ పాటను రికార్డుచేసి మొదట ఇంగ్లండ్‌లో విడుదల చేసిందని, ఆ తర్వాత పంజాబ్‌లోనూ ఈ పాట మార్మోగిందని చెప్పారు.